రామ్ చరణ్ పోస్ట్ ఆర్జీవీ గురించేనా..?
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ పెట్టాడు. ఎవరి పేరును మెన్షన్ చేయకపోయినా.. రంగస్థలం సినిమాలో తన స్టిల్‌ను పోస్ట్ చేసి.. `కేవలం పనికొచ్చే విషయాలను మాత్రమే వింటున్నాను` అంటూ కామెంట్ చేశాడు. చరణ్, వర్మను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశాడన్న అభిప్రాయం వ్యక్తం మవుతోంది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా వివాదాస్పద సినిమాలతో రెచ్చిపోతున్నాడు. లాక్ డౌన్ సమయంలో దర్శక నిర్మాతలంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుస రిలీజ్ లతో తెగ హడావిడి చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను ఏటీటీ ద్వారా రిలీజ్ చేసిన వర్మ తాజాగా మరో వివాదాస్పద చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్‌గా పవర్ స్టార్ పేరుతో ఓ సినిమాను రూపొందించి వదులుతున్నాడు వర్మ. అయితే ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించి తీయటం లేదని చెప్పినా పవన్ అభిమానులు మాత్రం రగలిపోతున్నారు. వర్మ వ్యాఖ్యలు శృతిమించుతుండటంతో గురువారం వర్మ ఆఫీస్ మీద దాడి కూడా చేశారు కొంత మంది పవన్ అభిమానులు.
అయితే ఈ ఘటనను కూడా తన సినిమా పబ్లిసిటీకి వాడేసుకున్నాడు వర్మ. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా వర్మపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో నిఖిల్ వర్మ ను కుక్కతో పోలుస్తూ ట్వీట్ చేశాడు. అల్లు అరవింద్ వంటి వారు కూడా వర్మ తీరును తప్పుబట్టారు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ పెట్టాడు. ఎవరి పేరును మెన్షన్ చేయకపోయినా.. రంగస్థలం సినిమాలో తన స్టిల్‌ను పోస్ట్ చేసి.. `కేవలం పనికొచ్చే విషయాలను మాత్రమే వింటున్నాను` అంటూ కామెంట్ చేశాడు. చరణ్, వర్మను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశాడన్న అభిప్రాయం వ్యక్తం మవుతోంది. కొంత కాలంగా హైదరాబాద్‌లోనే ఉంటున్న వర్మ, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ అనేక వివాదాస్పద ట్వీట్లు చేశాడు.
ఈ నేపథ్యంలోనే పవన్ కథలో పవర్ స్టార్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్నికల తరువాత జరిగిన సంఘటనలను, పవన్ మానసిక పరిస్థితిని ఎంటర్‌టైనింగ్‌గా చూపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలో పాట, ట్రైలర్‌లకు సూపర్ రెస్పాన్స్ రావటం, వివాదాలతో సినిమాకు భారీ పబ్లిసిటీ రావటంతో వర్మ ఫుల్ గా ఖుషీ అవుతున్నాడు.