- Home
- Entertainment
- బుచ్చిబాబు, సుక్కు చిత్రాల తర్వాత రాంచరణ్ మైండ్ బ్లోయింగ్ లైనప్.. అసలు సిసలైన పాన్ ఇండియా కాంబో రెడీ
బుచ్చిబాబు, సుక్కు చిత్రాల తర్వాత రాంచరణ్ మైండ్ బ్లోయింగ్ లైనప్.. అసలు సిసలైన పాన్ ఇండియా కాంబో రెడీ
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు.

ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయింది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. శంకర్ గతంలో సక్సెస్ అయిన ఫార్ములాతో రాజకీయాలు, అవినీతి, సిన్సియర్ ఆఫీసర్ కాన్సెప్ట్ తో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదేమి సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం కాదు. అయినా శంకర్ 350 కోట్ల బడ్జెట్ ఎందుకు ఖర్చు చేయించారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
రాంచరణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఆర్సీ 16పై ఫోకస్ పెట్టాడు. ఈ చిత్రం గురించి ఆల్రెడీ కొన్ని ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. పీరియాడిక్ డ్రామాగా క్రీడల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాంచరణ్ లుక్, స్టోరీ ప్రతి అంశం గూస్ బంప్స్ తెప్పించేలా పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించేలా బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
బుచ్చిబాబు చిత్రం తర్వాత రాంచరణ్.. మరోసారి సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నారు. రంగస్థలం తర్వాత రాంచరణ్, సుకుమార్ కలసి వర్క్ చేస్తే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుచ్చిబాబు, సుకుమార్ చిత్రాల తర్వాత రాంచరణ్ నటించబోయే చిత్రాలు ఇంకా అంచనాలు పెంచేస్తున్నాయి. రాంచరణ్ సినిమాల విషయంలో క్రేజీ లైనప్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
సౌత్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ గా ఉన్న లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ లతో రాంచరణ్ 18, 19 చిత్రాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అలాంటి ఇలాంటి కాంబినేషన్ కాదు. వీళ్ళిద్దరూ రాంచరణ్ కి పర్ఫెక్ట్ డైరెక్టర్స్ అని మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజినీకాంత్ కూలి చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఏమో ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.