- Home
- Entertainment
- ఒకే ఏడాది ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లకు సూపర్ హిట్లు.. అంచనాలు లేకుండా ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ
ఒకే ఏడాది ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లకు సూపర్ హిట్లు.. అంచనాలు లేకుండా ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ
Tollywood 2007 Movies: రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లకు ఒకే ఏడాది మెమొరబుల్ హిట్స్ పడ్డాయి. ఆ సినిమాలు ఏంటి ? ఎందుకు అవి మెమొరబుల్ హిట్స్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

స్టార్ హీరోలకు కలిసి వచ్చిన 2007
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముగ్గురికీ 2007 సంవత్సరం చాలా మెమొరబుల్ అనే చెప్పాలి. ఈ ముగ్గురికీ ఆ ఏడాది సూపర్ హిట్లు పడ్డాయి. వీళ్ళకి ఆ విజయాలు ఎంతో ప్రత్యేకమైనవి. వీరితో పాటు మరికొందరు స్టార్లు కూడా 2007లో విజయాలు అందుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
యమదొంగ
జూనియర్ ఎన్టీఆర్ కి యమదొంగ చిత్ర విజయం చాలా కీలక దశలో దక్కింది. రాజమౌళి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సింహాద్రి తర్వాత అలాంటి క్లీన్ హిట్ చిత్రాన్ని ఎన్టీఆర్ కి రాజమౌళి ద్వారానే దక్కింది. సింహాద్రి తర్వాత తారక్ కెరీర్ ఎటు వెళుతుందో ఫ్యాన్స్ కి కూడా అర్థం కాలేదు. ఆంధ్రావాలా నుంచి రాఖీ వరకు ఒక్క సరైన విజయం లేదు. పైగా తారక్ లుక్స్ పై విమర్శలు వచ్చాయి. ఆ టైంలో యమదొంగ చిత్రం ఘన విజయం సాధించింది.
దేశముదురు
హ్యాపీ చిత్రం పరాజయం కావడంతో అల్లు అర్జున్ కాస్త నిరాశలో ఉన్నారు. ఆ టైంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన దేశ ముదురు చిత్రంతో అల్లు అర్జున్ అదిరిపోయే కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఈ మూవీలో బన్నీ ఎనెర్జిటిక్ పెర్ఫార్మెన్స్ యువతని బాగా ఆకట్టుకుంది. అల్లు అర్జున్, యాపిల్ బ్యూటీ హన్సిక జోడీ బాగా క్లిక్ అయింది.
చిరుత
చిరు తనయుడు రాంచరణ్ చిరుతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది 2007లోనే. ఈ మూవీ కూడా పూరి జగన్నాధ్ దర్శకత్వంలోనే తెరకెక్కింది. చిరంజీవి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పూరి జగన్నాధ్ రాంచరణ్ ని మెగా అభిమానులు కోరుకునే విధంగా ప్రజెంట్ చేశారు. చిరుత మూవీ మంచి విజయం సాధించింది. రాంచరణ్ డ్యాన్సులు, ఫైట్స్, నటనలో అంచనాలు అందుకున్నారు.
విజయాలు అందుకున్న మరి కొందరు హీరోలు
2007లోనే మరికొందరు హీరోలు విజయాలు అందుకున్నారు. విక్టరీ వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి చిత్రాలతో రెండు విజయాలు అందుకున్నారు. డాన్ శీనుతో రవితేజ, లక్ష్యం మూవీతో గోపీచంద్ విజయాలు అందుకున్నారు.
అంచనాల్లేకుండా వచ్చి షేక్ చేసిన మూవీ
2007లో ఒక చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించింది. ఆ మూవీ మరేదో కాదు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్. అందరూ కొత్తవాళ్లతో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం యువతని విపరీతంగా ఆకట్టుకుంది. రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం థియేటర్స్ లో ఏకంగా 19 కోట్లు వసూలు చేసింది.