MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • #GameChanger ‘గేమ్‌ ఛేంజర్‌’కథకు ప్రేరణ ఆయన లైఫ్ స్టోరీయేనా? ఎక్సక్లూజివ్ ఇన్ఫో

#GameChanger ‘గేమ్‌ ఛేంజర్‌’కథకు ప్రేరణ ఆయన లైఫ్ స్టోరీయేనా? ఎక్సక్లూజివ్ ఇన్ఫో

ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. ఈ పాత్రకు ప్రేరణ...

5 Min read
Author : Surya Prakash
Published : Feb 21 2024, 07:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
GameChanger

GameChanger


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసింది.  ‘గేమ్‌ ఛేంజర్‌’ కొత్త షెడ్యూల్‌ షూటింగ్ మొదలైంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో అన్బరివ్‌ నేతృత్వంలో ఫైట్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. మార్చి ఫస్ట్ వీక్ వరకూ ఇక్కడే షూటింగ్ చేయనున్నారు. రామ్‌  చరణ్‌ కు సరపడ మరో పాన్‌ ఇండియా చిత్రమిది.  రాజకీయం నేపథ్యంలో సాగే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు సంభందించిన వివరాలు అంటూ బయిటకు వచ్చిన ఇన్ఫో  అందిస్తున్నాం. అయితే ఈ సమాచారం అఫీషియల్ న్యూస్ కాదు. తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నది మాత్రమే. ఎంతవరకూ నిజం అనేది సినిమా రిలీజ్ అయితేకానీ తెలియదు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
215
game changer movie

game changer movie


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్  ఎన్నికల అధికారిగా కనిపించనున్నారు. చరణ్ పాత్ర పేరు రామ్ నందన్. రామ్ చరణ్ పేరు కలిసి వచ్చేలా  ఈ పాత్రకు పేరు పెట్టారు.ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నియమితులైన రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతోంది.  చరణ్ పాత్ర తెచ్చే మార్పులతో పొలిషియన్స్ గోలెత్తిపోతారట.

315



  చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ పదవిలో పనిచేసి దేశంలో రాజకీయ నాయకులకు చెమటలు పట్టించిన  టి. ఎన్. శేషన్ జీవితంలో కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని ఈ కథ చేసినట్లు వినిపిస్తోంది. దేశ ఎన్నికల రంగంలో సమూల సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా శేషన్ గుర్తింపు పొందారు. ‘ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు’ అని చాలా మంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కానీ శేషన్ మాత్రం దానిని ఆచరించి చూపించారు.
 

415
Game Changer

Game Changer


రాజ్యాంగబద్ధంగా ఎన్నికలను నిర్వహించేందుకు శేషన్ అనేక చర్యలు తీసుకున్నారు. వీటిలో కొన్ని ఏమిటంటే, అర్హులైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయడం, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై పరిమితి విధించడం, ప్రగతిశీలమైన, స్వతంత్ర ఎన్నికల కమిషన్ యంత్రాంగం, ఎన్నికల నిర్వహణకు ఇతర రాష్ట్రాల అధికారులను నియమించడం వంటివి చేసారు.
 

515
Game Changer 2

Game Changer 2


అలాగే ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా డబ్బులు, మద్యం పంపిణీలను అడ్డుకోవడం; ప్రచారం కోసం అధికార యంత్రాంగాల వినియోగాన్ని నియంత్రించడం, కుల, మతాల ఆధారంగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను అడ్డుకోవడం, ప్రార్థనా స్థలాలు, దేవాలయాల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం; ప్రచారం కోసం వాడే లౌడ్‌స్పీకర్లకు ముందస్తు అనుమతి, రాత్రి 10 గంటలకే ఎన్నికల ప్రచారాన్ని ముగించాలి, పోలింగ్ సమయంలో పోలింగ్ బూత్ పరిసరాల్లో పార్టీల గుర్తులు, జెండాలు, బొమ్మలు కనిపించకుండా మూసివేయాలి, వంటి అనేక కట్టుదిట్టమైన నిబంధనలను విధించి, అమలు చేశారు.

615
Game Changer

Game Changer

ఇక ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయడం కోసం ఆయన రాజకీయ పార్టీలతో పెద్ద  యుద్ధమే చేసారు. మధ్యప్రదేశ్‌లో ఓ నియోజకవర్గంలో అప్పటి గవర్నర్ తన కుమారుని గెలుపు కోసం ప్రచారం చేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికలను శేషన్ వాయిదా వేశారు. చివరికి ఆ గవర్నర్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లో ప్రచార గడువు ముగిసిన కొద్ది క్షణాలకు ఓ మంత్రి వేదిక నుంచి దిగిపోవలసి వచ్చింది.
 

715

 టీఎన్ శేషన్‌ పని తీరు ప్రజాస్వామికవాదులను, సాధారణ ప్రజానీకాన్ని ఆకట్టుకుంది.  దళితులు వంటి అణగారిన వర్గాలు స్వేచ్ఛగా ఓటు వేయగలిగాయి. బూత్ క్చాప్చరింగ్ సంఘటనలు బాగా తగ్గాయి.ఇప్పటికీ అందరి మనసుల్లో ఉన్న ఆయన గురించి ఈ సినిమా మరోసారి గుర్తు చేసే అవకాసం ఉందంటున్నారు. ప్రజాస్వామ్యం వర్థిల్లాలంటే స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగడం తప్పనిసరి. ఎన్నికలను సజావుగా నిర్వహించే ఎన్నికల సంఘం అంతకన్నా ముఖ్యం. 

815
Game changer

Game changer

అలాగే అప్పట్లో శంకర్ గతంలో తీసిన “ఒకే ఒక్కడు” చిత్రంలా ఈ సినిమా ఉండబోతోందిట. కార్తీక్ సుబ్బరాజ్ రాసిన ఈ కథ కొత్తగా ఉండటమే కాకుండా మంచి మెసేజ్ ని మోసుకు వస్తుందంటున్నారు.  ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామికవాదులను, ప్రజా సంక్షేమాన్ని కోరుకునేవారిని తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. అందుకే ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సైతం శేషన్ వంటి సమర్థుడి కోసం అన్వేషిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ కథ జనాలకు బాగా నచ్చే అవకాసం ఉంది.

915
Game changer

Game changer


 ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫూజన్ నడుస్తోంది.  దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికి రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. కొన్ని నెలల క్రితం సెప్టెంబర్ చివరి వారంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. మరల ఇప్పుడు డిసెంబర్‌‌లో ఈ మూవీ విడుదల ఉండొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ దేవర మొదట ఏప్రిల్ 5న  రిలీజ్ ప్రకటించిన టీమ్ మళ్లీ డేట్ మార్చి అక్టోబర్ 10 కి విడుదల తేదీ అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ టైంకి గేమ్ ఛేంజర్ విడుదల అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పటికే చిరంజీవి విశ్వంభర, నాగార్జున బంగార్రాజు 2, వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమాలు కూడా వరుసలో ఉండటంతో గేమ్ ఛేంజర్ డిసెంబర్ గడువును కోల్పోతే 2025 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 

1015


ఇ క రీసెంట్ గా  దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ 2024 సెప్టెంబర్‌లో ఉంటుందని కన్ఫామ్ చేశారు. సలార్ సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన దిల్ రాజుని అభిమానులు ప్రశ్నించడంతో దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘They Call Him OG’వస్తూండటంతో గేమ్ ఛేంజర్ సెప్టెంబర్ లో రావటం ప్రశ్నార్దకమే అంటున్నారు. 

1115
game changer telugu movie got 250 crores in ott rights

game changer telugu movie got 250 crores in ott rights


 డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటమే గేమ్ ఛేంజర్ ఆలస్యానికి కారణం. అయితే ఇప్పుడు  ‘ఇండియన్ 2’ఆగస్ట్ 15 రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటోంది. పుష్ప2 వాయిదా పడితుందా లేదా అనే విషయమై ఈ రిలీజ్ డేట్ ఉండచ్చు. అలాగే ‘ఇండియన్ 2’ తర్వాతే గేమ్ ఛేంజర్ రిలీజ్ కు వస్తుంది. సెప్టెంబర్ 27న పవన్ సినిమా  OG వస్తుంది. దసరా కు దేవర వస్తుంది ..అలాగని నవంబర్ లో వద్దామంటే అప్పుడు సినిమాల రిలీజ్ కు సరైన టైమ్ కాదు. ఈ క్రమంలో 2024 క్రిస్మస్ మాత్రమే ఫెరఫెక్ట్ గా కనిపిస్తోంది అంటోంది ట్రేడ్.అది కనుక దాటితే మళ్లీ సంక్రాంతికి అన్ని సినిమాలు  ఫిక్స్ అయ్యిపోయాయి. దాంతో 2025 సమ్మర్ దాకా ఆగాల్సి ఉంటుంది. కాబట్టి క్రిస్మస్ కి వస్తారా లేక ఈ లోగా ఎడ్జస్టమ్మెంట్స్ చేసి ఈ లోగా వస్తారా అని చూడాల్సి ఉంది. 
  

1215


రామ్ చరణ్ మాట్లాడుతూ...‘నేడు వస్తున్న సినిమాలకు.. ‘గేమ్‌ ఛేంజర్‌’ పూర్తి భిన్నమైన చిత్రం. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఇందులోని కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయి. శంకర్‌ గత చిత్రాలైన ‘జెంటిల్‌మెన్‌’, ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’.. సినిమాల ద్వారా చూపించిన సందేశాత్మక కథలకంటే... ఇది మరింత ఆసక్తికరమైన కథనంతో రానుంది. నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది’ అని తెలిపాడు.   

1315


వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది..పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్క షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నారట టీమ్.  ఈ సినిమాలో ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. తిరు ఛాయాగ్రాహకుడు.
 

1415


 తండ్రీ, కొడుకులుగా రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కోసం చెర్రీ ఫ్యాన్స్  ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2021 లో అనౌన్స్ చేసిన ఈ సినిమా నుండి కేవలం టైటిల్ గ్లింప్స్ తప్ప ఎటువంటి అప్ డేట్ లేదు. ధాంతో ప్యాన్స్  #IrresponsibleDilRaju, #WakeUpShankar, #UseLessSVC, #WakeUpDilraju, #GameChangerShelved అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

1515


గేమ్ ఛేంజర్ సినిమాకి ఇంకా 3 నెలల షూటింగ్ మిగిలి ఉందట. త్వరగా షూటింగ్ పూర్తిచేసుకుని డిసెంబర్ 2024 కి కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంపై రెండు నెలల క్రితం శంకర్, రామ్ చరణ్, దిల్ రాజు మీటింగ్ అయ్యారని తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్‌కి మరో 4,5 నెలల సమయం పడుతుంది. కాబట్టి డిసెంబర్ నెలలో లేదా సంక్రాంతికి రామ్ చరణ్ మూవీ రావొచ్చనే టాక్ నడుస్తోంది. కాకపోతే ఇదంతా శంకర్ మీదనే ఆధారపడి వుంటుంది. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image2
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Recommended image3
Vijay Rashmika Video: విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన పనికి అభిమానులు ఫిదా, రౌడీ హీరో మీసం తిప్పిన నేషనల్ క్రష్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved