MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ : అప్పన్నగా రాంచరణ్ అదరహో, శంకర్ కంబ్యాక్ కాదు కానీ.. మూవీ హిట్టా ఫట్టా

గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ : అప్పన్నగా రాంచరణ్ అదరహో, శంకర్ కంబ్యాక్ కాదు కానీ.. మూవీ హిట్టా ఫట్టా

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. సంక్రాంతి సంబరాలు పెంచేలా గేమ్ ఛేంజర్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆడియన్స్ లో కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 10 2025, 04:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. సంక్రాంతి సంబరాలు పెంచేలా గేమ్ ఛేంజర్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆడియన్స్ లో కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. ఇటీవల శంకర్ తన కెరీర్ లో టఫ్ ఫేజ్ ఎదుర్కొంటున్నారు. దీనితో గేమ్ ఛేంజర్ చిత్రం శంకర్ కి కంబ్యాక్ అవుతుందని గట్టిగా అంచనాలు వినిపించాయి. రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి నటించారు. ఎస్ జె సూర్య విలన్ గా నటించగా శ్రీకాంత్, జయరామ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

27

రాంచరణ్ ఈ చిత్రంలో ఐఏఎస్ అధికారిగా, ప్రజా నాయకుడిగా డ్యూయెల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత శంకర్ కమర్షియల్ అంశాలతో పొలిటికల్ చిత్రం చేస్తున్నారు. దీనితో వింటేజ్ శంకర్ తిరిగి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆల్రెడీ గేమ్ ఛేంజర్ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఈ చిత్రం నిజంగా శంకర్ కి కంబ్యాక్ ఫిలిం అవుతుందా అనేది ట్విట్టర్ లో వస్తున్న రెస్పాన్స్, ప్రీమియర్ షోల నుంచి ఆడియన్స్ ఇస్తున్న ఫీడ్ బ్యాక్ బట్టి తెలుసుకుందాం. 

37

ఎస్ జె సూర్య, జయరామ్, శ్రీకాంత్, సముద్రఖని పాత్రలతో గేమ్ ఛేంజర్ కథ మొదలవుతుంది. పది నిమిషాల తర్వాత రాంచరణ్ లుంగీ గెటప్ లో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే రా మచ్చా సాంగ్ ఉంటుంది. సాంగ్ లో రాంచరణ్ డ్యాన్స్ మెప్పించే విధంగా ఉంటుంది. ఇలా రెగ్యులర్ కమర్షియల్ స్టైల్ లో ఫస్ట్ హాఫ్ సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో శంకర్ తన స్టైల్ లో అవినీతి అధికారులు, వ్యాపారవేత్తల గురించి చూపించారు. 

 

47

ఫస్ట్ హాఫ్ లో రాంచరణ్, ఎస్ జె సూర్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంజలి పాత్ర పరిచయం కాగానే ఆసక్తికర ట్విస్ట్ ఉంటుంది. పెళ్లి బట్టలు గెటప్ లో పవర్ ఫుల్ ఫైట్ సన్నివేశం, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్ తో ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ సన్నివేశం సెకండ్ హాఫ్ పై అంచానాలు పెంచేలా ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అబౌ యావరేజ్ స్టఫ్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ వర్కౌట్ కాలేదు. 

57

ఇక సెకండ్ హాఫ్ లో తొలి 20 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 20 నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ తెరకెక్కించిన విధానం అద్భుతం. ట్విట్టర్ లో అయితే ఆ 20 నిమిషాలు వింటేజ్ శంకర్ అలా వచ్చి వెళ్లారు అని అంటున్నారు. సినిమా మొత్తాన్ని రాంచరణ్ తన భుజాలపై మోయగా ఎస్ జె సూర్య సహకారం అందించారు. తమన్ బిజియం కూడా సన్నివేశాలని బాగా ఎలివేట్ చేసింది. 

67

ఎస్ జె సూర్య. రాంచరణ్ పెర్ఫామెన్స్, తమన్ బిజియం కోసం గేమ్ ఛేంజర్ చిత్రాన్ని చూడొచ్చని ఆడియన్స్ అంటున్నారు. కానీ శంకర్ ఈ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చినట్లు భావించలేం అని చెబుతున్నారు. చాలా సన్నివేశాలు ఆర్డినరీగా ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ మినహా శంకర్ తన రేంజ్ లో ఇతర సన్నివేశాలు రాసుకోలేదు. కమర్షియల్ అంశాల కోసమే కొన్ని సన్నివేశాలు రాసుకునట్లు అనిపిస్తుంది. యాంగర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ తో తీసిన సీన్లు వర్కౌట్ కాలేదు. 

77

ఓవరాల్ గా రాంచరణ్ మరోసారి అబ్బుపరిచే నటన కనబరిచాడు. గేమ్ ఛేంజర్ చిత్రం అబౌ యావరేజ్ కంటెంట్ తో ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బావుంది. కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శంకర్ రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ 2 లాంటి చిత్రాలకంటే గేమ్ ఛేంజర్ తో బెటర్ అవుట్ పుట్ ఇచ్చారు. సాంగ్స్ చిత్రీకరణ చాలా బావుంది. నిర్మాణ విలువలు తెరపై కనిపిస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు

Latest Videos
Recommended Stories
Recommended image1
రష్మిక మందన్న కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. 250 కోట్లకు పైగా వసులు చేసిన 5 మూవీస్ ఏంటో తెలుసా?
Recommended image2
స్టార్ హీరోయిన్ కొడుకు కోసం డ్రీమ్ రూమ్.. అందులో ఏమున్నాయంటే? 6 ఫోటోలు వైరల్
Recommended image3
Virosh Wedding: పెళ్లిలో విజయ్ రష్మికతో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి ఎవరు? వైరల్ అవుతున్న కొత్త ఫొటోలు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved