- Home
- Entertainment
- సుమ స్థానానికి ఎసరు పెట్టిన లేడీ యాంకర్ ఎవరో తెలుసా, అనసూయ కాదు.. ఆమె తప్పుకోవడం నా అదృష్టం అంటూ కామెంట్స్
సుమ స్థానానికి ఎసరు పెట్టిన లేడీ యాంకర్ ఎవరో తెలుసా, అనసూయ కాదు.. ఆమె తప్పుకోవడం నా అదృష్టం అంటూ కామెంట్స్
సుమ యాంకర్ గా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. అయితే ఒకప్పుడు సుమకి మరో లేడీ యాంకర్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చారట. కానీ చివరికి ఆమె యాంకరింగ్ నుంచి తప్పుకోవడం తన అదృష్టం అంటూ సుమ తెలిపారు.

టాలీవుడ్ టాప్ యాంకర్ గా సుమ
టాలీవుడ్ లో టాప్ యాంకర్ ఎవరంటే వెంటనే సుమ కనకాల పేరు చెబుతారు. ఆ తర్వాత శ్రీముఖి, యాంకర్ రవి, ప్రదీప్ మాచిరాజు ఉంటారు. అనసూయ, శ్యామల గతంలో యాంకర్లుగా రాణించారు. కానీ ప్రస్తుతం యాంకరింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. సుమ కనకాల మాత్రం దశాబ్దాలుగా యాంకర్ గా దూసుకుపోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, టీవీ ప్రోగ్రామ్స్ లో ఆమె హవానే కనిపిస్తూ ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సుమ యాంకరింగ్ ఒక సెంటిమెంట్ లా మారిపోయింది.
సుమ కనకాలని భయపెట్టిన మరో యాంకర్
యాంకర్ గా అగ్ర స్థానంలో ఉన్న సుమ ఒకప్పుడు తనకి కాంపిటీషన్ గా ఉన్న మరో యాంకర్ ని చూసి భయపడిందట. ఆమె ఎక్కడ తన స్థానానికి ఎసరు పెడుతుందో అని టెన్షన్ పడిందట. ఆమె యాంకరింగ్ అంటే తనకి కూడా చాలా ఇష్టం అని సుమ తెలిపింది. సుమ చెబుతున్నది నటి స్వాతి రెడ్డి గురించి. నటి స్వాతి కలర్స్ స్వాతిగా గుర్తింపు పొందింది.
యాంకర్ గా రాణించిన స్వాతి రెడ్డి
కెరీర్ బిగినింగ్ లో తన అద్భుతమైన వాయిస్, క్యూట్ లుక్స్ తో యువతని బాగా ఆకర్షించింది. మహేష్ బాబు లాంటి స్టార్లని సైతం ఇంటర్వ్యూలు చేసింది. టీవీ ప్రోగ్రామ్స్ లో ఆమె యాంకరింగ్ స్టైల్ ప్రతి ఒక్కరినీ మెప్పించేది. సుమ మాట్లాడుతూ.. స్వాతి నాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఆమెకి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు చిన్న పెద్ద అని తేడా లేదు.. ఎవరితో అయినా చాలా సరదాగా మాట్లాడేసేది అని స్వాతిపై సుమ ప్రశంసలు కురిపించారు.
అదృష్టం కొద్దీ ఆమె హీరోయిన్ అయింది
ఇదే జోరు కొనసాగిస్తే స్వాతి తప్పకుండా నాకు పోటీ అవుతుందని అనుకున్నా. లక్కీగా స్వాతికి హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో యాంకరింగ్ వదిలేసింది అని సుమ పేర్కొంది. వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలో స్వాతి పోషించిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత అష్టాచమ్మా చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
స్వాతి రెడ్డి చిత్రాలు
అక్కడి నుంచి స్వాతి కెరీర్ మలుపు తిరిగింది. స్వామి రా రా, కార్తికేయ లాంటి హిట్ చిత్రాల్లో స్వాతి హీరోయిన్ గా నటించింది. ఇటీవల స్వాతికి అవకాశాలు తగ్గాయి. సుమ మాత్రం యాంకర్ గా ఇంకా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.