MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రాంచరణ్, అల్లు అర్జున్ నెపో కిడ్స్ కాదు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాక్, ఇచ్చిపడేసిన నాగవంశీ

రాంచరణ్, అల్లు అర్జున్ నెపో కిడ్స్ కాదు.. కారణం తెలిస్తే మైండ్ బ్లాక్, ఇచ్చిపడేసిన నాగవంశీ

రాంచరణ్, అల్లు అర్జున్ నెపో కిడ్స్ కాదని నిర్మాత నాగవంశీ అన్నారు. తెలుగులో అసలు నెపోటిజం లేదని నాగవంశీ తెలిపారు.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 29 2025, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ram Charan, Allu Arjun

Ram Charan, Allu Arjun

ఒకప్పుడు దిల్ రాజు తరహాలో వరుసగా హిట్స్ కొడుతున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇటీవల కాలంలో నాగవంశీ టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ లాంటి హిట్ చిత్రాలు నిర్మించారు. శుక్రవారం రోజు విడుదలైన మ్యాడ్ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనితో నాగవంశీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ టాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Nagavamsi

Nagavamsi

యాంకర్ నాగవంశీని నెపోటిజం గురించి ప్రశ్నించారు. బాలీవుడ్ లో  నెపోటిజం ఉంది. దాని గురించి దేశం మొత్తం చర్చ జరుగుతోంది. కొంతమంది విమర్శలు కూడా చేస్తున్నారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో, తమిళం, మలయాళం, కన్నడ ప్రతి చిత్ర పరిశ్రమలో నేపోటిజం ఉంది. కానీ బాలీవుడ్ నెపోటిజం గురించి మాట్లాడినంతగా సౌత్ నెపోటిజం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. తెలుగులో నెపోటిజం గురించి మీరేమంటారు అని యాంకర్ ప్రశ్నించారు. దీనితో నాగవంశీ తనదైన శైలిలో ఇచ్చిపడేశారు. 

 

35

ఇతర భాషల గురించి నాకు తెలియదు. కానీ తెలుగులో నెపోటిజం ఉందని నేను అనుకోవడం లేదు. తెలుగులో నిజంగా నెపోటిజం ఉంటే నాని అంత పెద్ద స్టార్ అయ్యేవారు కాదు. విజయ్ దేవరకొండకి అంత క్రేజ్ వచ్చేది కాదు. సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, అడివి శేష్ లాంటి హీరోలు టాలీవుడ్ లో ఉండేవారు కాదు అని నాగవంశీ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెపోటిజం లేదు నన్ను నమ్మండి అని నాగవంశీ అన్నారు. దీనితో యాంకర్ తిరిగి ప్రశ్నించారు. 

 

45

చాలా మంది హీరోలు చిత్ర పరిశ్రమలో ఉన్న కుటుంబాల నుంచి వచ్చారు కదా అని అడిగారు. అల్లు అర్జున్ సార్ ని మీరు ఇంకా నెపో కిడ్ గానే భావిస్తారా అని నాగవంశీ అడిగారు. ఆయన చిత్ర పరిశ్రమలో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా అని యాంకర్ అన్నారు. అది నిజమే, అంత మాత్రాన నెపో కిడ్ అనడం కరెక్ట్ కాదు. రాంచరణ్ సార్ ని నెపో కిడ్ గా భావిస్తారా ? ఆయన మగధీర చిత్రం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారో తెలుసా.. రంగస్థలం చిత్రం కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారో తెలుసా.. అంటూ నాగవంశీ కౌంటర్ ఇచ్చారు. 

 

55
Ram Charan, Allu Arjun

Ram Charan, Allu Arjun

నాగవంశీ తన చిత్రాల గురించి మాట్లాడుతూ.. ఇటీవల తన నిర్మాణంలో వచ్చిన చిత్రాల్లో లక్కీ భాస్కర్ చిత్రం చాలా స్పెషల్ అని తెలిపారు. ఆ చిత్రం హిట్ అవుతుందని తెలుసు. మేం ఆశించిన దానికంటే ఇంకా పెద్ద హిట్ అయింది అని నాగవంశీ తెలిపారు. నెట్ ఫ్లిక్స్ లో దాదాపు 10 వారాలు టాప్ 10 లో ట్రెండ్ అయింది అని నాగవంశీ అన్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
తెలుగు సినిమా
నాగ వంశీ సూర్యదేవర

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Recommended image2
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Recommended image3
Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved