- Home
- Entertainment
- Ram Charan Video Viral: యాక్టింగ్ స్కూల్‌లో చరణ్‌కి అవమానం, అంతా నవ్వుకున్నారు.. ఏం చేశాడో తెలుసా?
Ram Charan Video Viral: యాక్టింగ్ స్కూల్‌లో చరణ్‌కి అవమానం, అంతా నవ్వుకున్నారు.. ఏం చేశాడో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ `చిరుత` చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన యాక్టింగ్ స్కూల్‌కి సంబంధించిన అరుదైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

చిరంజీవి కొడుకు నుంచి గ్లోబల్ స్టార్ గా చరణ్
రామ్ చరణ్ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌గా, గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంతో ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం `నాటు నాటు` పాటకి ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. `చిరుత` చిత్రంతో ఆయన హీరోగా పరిచయం అయ్యారు. కానీ రాజమౌళితోనే మొదట అనుకున్నారు. తొలి చిత్రమే హిస్టారికల్ మూవీ అయితే వర్కౌట్ కాదేమో అనే చిరంజీవి అభిప్రాయంతో దాన్ని పక్కన పెట్టారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `చిరుత` మూవీ చేశారు. ఇందులో యాక్షన్‌తో, డాన్సులతో అదరగొట్టారు చరణ్. అనుభవం ఉన్న యాక్టర్‌గానే మెప్పించారు. అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడ ప్రారంభమైన ఆయన సినిమా కెరీర్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ, ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నారు. నటుడిగా తనని తాను మలుచుకుంటూ వస్తున్నాడు. `రంగస్థలం`తో తానేంటో నిరూపించుకున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` అందరిని మెస్మరైజ్ చేశారు.
18 ఏళ్లు పూర్తి చేసుకున్న రామ్ చరణ్
రామ్ చరణ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 18ఏళ్లు పూర్తి చేసుకున్నారు. `చిరుత` విడుదలై 18 ఏళ్లు అవుతుంది. 2007 సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదలైంది. చిరంజీవి కొడుకు హీరోగా ఎంట్రీ అంటే భారీగా హైప్ ఉంటుంది. అలాంటి భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలై ఆకట్టుకుంది. చరణ్‌కి బెస్ట్ ఎంట్రీ మూవీగా నిలిచింది. ఇలా సరిగ్గా 18ఏళ్ల క్రితం ఇదే రోజు చరణ్ వెండితెరకు పరిచయం అయిన నేపథ్యంలో ఆయన జర్నీని గుర్తు చేసుకుంది `పెద్ది` మూవీ టీమ్. `పెద్ది` సినిమా నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో రైల్వే ట్రాక్‌పై బీడీ తాగుతూ స్టయిల్‌గా పోజ్ ఇచ్చారు చరణ్. ఊర మాస్ లుక్‌లో ఉన్నారు. ఆయన ఓ బ్యాగ్‌ని తగిలించుకున్నారు. దానిపై చెక్క బ్యాట్ ఉంది. చూడబోతుంటే క్రికెట్ ఆడేందుకు ఆయన వెళ్తున్నట్టుగా ఉంది. లుక్ మాత్రం ఊరమాస్‌గా ఆకట్టుకుంటోంది. ఇది ఇంట్రెన్సిటీ ఉన్న యాక్షన్ డ్రామా అని, గ్రామీణ నేపథ్యంలో సాగే మూవీ అని, ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయని, భావోద్వేగాల సమాహారంగా సినిమా ఉండబోతుందని టీమ్ తెలిపింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కాబోతుంది.
యాక్టింగ్ స్కూల్‌లో రామ్ చరణ్ రేర్ వీడియో వైరల్
ఈ క్రమంలో ఇప్పుడు రామ్ చరణ్‌కి సంబంధించిన ఒక అరుదైన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో మీసాలు లేకుండా క్లీన్ షేవ్‌తో ఉన్నారు చరణ్. చాలా కుర్రాడిలా కనిపిస్తున్నారు. ఇది యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లిన్నప్పటి వీడియో కావడం విశేషం. యాక్టింగ్ స్కూల్‌లో ఫస్ట్ డే రోజు రామ్ చరణ్ ఏం చేశారనేది ఇందులో ఉంది. ఆయనకు యాక్టింగ్ నేర్పిస్తూ మొదటగా బాడీని ఫ్రీ చేయిస్తున్నారు. అందులో భాగంగా చరణ్ రెండు చేతులను రైట్‌కి, లెఫ్ట్ కి ఊపుతున్నారు. పదే పదే అదే చేస్తున్నారు. చుట్టూ చాలా మంది కూర్చొని ఉన్నారు. చరణ్‌నే చూస్తున్నారు. చరణ్ మూమెంట్స్ ని చూసి నవ్వుతున్నారు. ఇందులో చరణ్ కొంత ఇబ్బంది పడుతూ కనిపించారు. దాన్ని అధిగమిస్తూ ఫేస్‌లో చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇది రామ్ చరణ్ యాక్టింగ్ స్కూల్‌లో మొదటి రోజు వీడియో కావడం విశేషం. ఇదిప్పుడు వైరల్ అవుతుంది. అందరిని ఆకట్టుకుంటుంది.
విమర్శలు, పరాజయాల నుంచి ఇండస్ట్రీ హిట్ల వరకు చరణ్ జర్నీ
యాక్టింగ్ స్కూల్‌లో రామ్ చరణ్ చేసిన తొలి మూమెంట్స్ ఇదే అని అంటున్నారు. అయితే దీనిపై విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ రోజు ఇలా చేతులు ఊపడంతో రామ్ చరణ్ యాక్టింగ్ జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు `పెద్ది` వరకు వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో మైల్ స్టోన్స్ అధిగమించారు చరణ్. ఎన్నో విమర్శలు ఫేస్ చేశాడు. ఎన్నో పరాజయాలు చవిచూశాడు. అదే సమయంలో ఇండస్ట్రీ హిట్లు అందుకున్నారు. చిరంజీవి తనయుడు అనే ట్యాగ్ నుంచి హీరో రామ్ చరణ్‌గా, మెగా పవర్ స్టార్‌గా, స్టార్ హీరోగా, గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు.
చరణ్ హిట్లు, పరజాయాలు.. `పెద్ది`పైనే ఆశలన్నీ
`చిరుత` చిత్రంతో హిట్ అందుకున్న చరణ్ `మగధీర` చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశారు. రెండో సినిమాతోనే ఇంతటి సంచలనాలు సృష్టించిన ఏకైక హీరో చరణ్ అనే చెప్పాలి. ఆ తర్వాత `ఆరేంజ్`తో పరాజయం చవిచూశాడు. `రచ్చ` మూవీ ఫర్వాలేదనిపించింది. `నాయక్` మూవీ ఆకట్టుకుంది. బాలీవుడ్‌లో చేసిన `జంజీర్` పరాజయం చెందింది. `ఎవడు` హిట్ ఇచ్చింది. `గోవిందుడు అందరి వాడేలే`, `బ్రూస్ లీ`తో పరాజయాలు ఫేస్ చేశాడు. `ధృవ`తో హిట్ అందుకున్నాడు. `రంగస్థలం`తో నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేశాడు. `వినయ విధేయ రామ`తో మరో డిజాస్టర్ చవిచూశాడు. `ఆర్‌ఆర్‌ఆర్`తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. `ఆచార్య`తో మరో డిజాస్టర్ ఫేస్ చేశాడు. చిరంజీవి, చరణ్ కలిసి నటించిన తొలి చిత్రమిది. ఆ తర్వాత ఈ ఏడాది `గేమ్ ఛేంజర్`తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు `పెద్ది` మరోసారి తన సత్తా చాటేందుకు రాబోతున్నారు.