ప్రభాస్ సినిమా మధ్యలో రకుల్ ని తీసేసారు, కారణం చెప్పిన దిల్ రాజు
నాలుగు రోజులపాటు షూటింగ్ లో కూడా పాల్గొందట. ఆ తర్వాత తన షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో ...
Rakul Preet Singh, Prabhas, ntr, Dil raju
ఇండస్ట్రీ రకరకాల లెక్కలతో ముందుకు వెళ్తూంటుంది. అందులోనూ కెరీర్ ప్రారంభంలో డక్కా మొక్కీలు తినాల్సి వస్తుంది. ప్రారంభం అవుతాయనుకున్న ప్రాజెక్టులు ఆగిపోతాయి. ఓకే అనుకున్న సినిమాల నుంచి నటీ,నటులు తొలిగింపబడతారు.
అలాంటి సంఘటన ఒకటి రకుల్ ప్రీతి సింగ్ జీవితంలో జరిగిందిట. అయితే అందలో విశేషం ఏమిటంటే ఆమెను ప్రభాస్ సినిమాలోంచి తీసేయటం. ఈ విషయంపై తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ స్పందించింది.
గతంలో తనకి టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని ఈ క్రమంలో నాలుగు రోజులపాటు షూటింగ్ లో కూడా పాల్గొందట.
ఆ తర్వాత తన షూటింగ్ షెడ్యూల్ ముగియడంతో తన మరో సినిమా షూటింగ్ నిమిత్తమై ఢిల్లీ కి వెళ్లివచ్చేసరికి తనని ఈ చిత్రం నుంచి తప్పించినట్లు తెలిసిందని చెప్పుకొచ్చింది. అయితే తనని ప్రభాస్ చిత్రం నుంచి తప్పించినట్లు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని పేర్కొంది.
రకుల్ మాట్లాడుతూ....‘‘ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చిందని చాలా సంతోషించాను.. కానీ, నాలుగు రోజులు షూటింగ్ తర్వాత ఎలాంటి సమాచారం లేకుండానే మరొకరిని తన స్థానంలో తీసుకున్నారు’’ రకుల్ వెల్లడించింది. అయితే అప్పటికీ ఇంకా టాలీవుడ్‌లోకి రకుల్ ఎంట్రీ ఇవ్వలేదు అని చెప్పుకొచ్చింది.
తాను సరైన బ్రేక్ అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయం అదని , దాంతో ప్రభాస్‌తో నటించే అవకాశం వచ్చిందిని మురిసిపోయానంది.
అయితే ఒకవేళ నటిస్తే అది ప్రభాస్‌తో చేసిన తెలుగు చిత్రం అవుతుంది. కానీ కొన్నిసార్లు, పరిశ్రమ గురించి పెద్దగా తెలియనప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురువుతుందని తనకు ఎదురైన అనుభవాన్ని రకుల్ వెలిబుచ్చింది.
ఏదైనా ఇండస్ట్రీ గురించి తెలియనప్పుడు అలాంటివి జరిగినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించానని రకూల్ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు రకుల్ ని తొలిగించిన ప్రభాస్ సినిమా ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ చిత్రం మరేదో కాదు మిస్టర్ పర్‌ఫెక్ట్.
ఈ చిత్రంలో ముందు రకుల్ ప్రీత్ సింగ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు.. తర్వాత ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నారు అని తెలుస్తోంది. ఈ విషయమై మిస్టర్ ఫెరఫెక్ట్ నిర్మాత దిల్ రాజు వివరణ కూడా ఇచ్చారు.
ఆ మధ్యన దిల్ రాజు మాట్లాడుతూ ‘‘బృందావనం’ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీని స్టార్ట్ చేశాం. ఇందులో ప్రభాస్ హీరో అనే సంగతి అందరికీ తెలిసిందే.
అయితే అప్పటి వరకు నాకు నెగిటివ్ రిజల్ట్ ఎదురు కాలేదు. మున్నా సినిమా విషయంలో అనుకున్న రిజల్ట్ రాకపోయినప్పటికీ నేను నెగిటివ్‌గా తీసుకోలేదు. కానీ జోష్ విషయంలో తేడా కొట్టింది.
తర్వాత బృందావనం, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలను స్టార్ట్ చేశాం. మిస్టర్ పర్‌ఫెక్ట్ మూవీలో ముందుగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. ఐదు రోజుల పాటు షూటింగ్ కూడా చేశాం. ఆ రషెష్ చూశాను. నాకు శాటిస్పాక్షన్‌గా అనిపించలేదు.
ఎందుకంటే మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా అంతా హీరోయిన్ క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉంటుంది. రకుల్ చాలా సన్నగా ఉంది. ఎందుకైనా మంచిదని చెప్పి షూటింగ్ ఆపేశాం. ప్రభాస్‌కు కూడా విషయం చెప్పాను.
మంచి హీరోయిన్ ఉండాలని నేను, ప్రభాస్ అండ్ టీమ్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వెంటనే కాజల్ అగర్వాల్ ఐడియాకి వచ్చింది. విషయాన్ని ప్రభాస్‌కి చెప్పాను.
ఆల్ రెడీ తనతో డార్లింగ్ సినిమా చేస్తున్నానని తను అన్నాడు. డార్లింగ్ మూవీ కథ వేరు. మన కథ వేరు. క్యారెక్టర్స్ వేరు అని పాత సినిమాలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు చెప్పాను. సరే! మీ ఇష్టం అని ప్రభాస్ అన్నాడు.
కాజల్ అప్పటికే మా బ్యానర్‌లో బృందానం సినిమా చేస్తుంది. ఆమెకు కథ చెప్పగానే విపరీతంగా నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకుంది. రకుల్‌ను అలా పక్కన పెట్టడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది.
అయితే నాకు సినిమా కంటే ఏదీ ఎక్కువ కాదు. వ్యక్తుల కంటే సినిమానే వర్కవుట్ కావాలని చూస్తాను. అందుకే రకుల్ ప్లేస్‌లో కాజల్‌ను తీసుకుని సినిమా చేశాం. అటు బృందావనం.. ఇటు మిస్టర్ పర్‌ఫెక్ట్ చిత్రాలు రెండూ పెద్ద హిట్ అయ్యాయి’’ అని అన్నారు .