హనీమూన్ క్యాన్సిల్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ..? కారణం ఏంటంటే..?
పెళ్ళి తరువాత ఏ జంట అయినా.. రెక్కలు కట్టుకుని హనీమూన్ కుఎగరాలి అనుకుంటారు. తాజాగా పెళ్లి చేసుకున్న రకుల్ -జాకీ జంట కూడా అదే అనుకున్నారు. కాని హనీమూన్ కోసం విదేశాలకు వెళ్లాలని భావించగా.. హనీమూన్ వాయిదా పడినట్లు సమాచారం.
ప్రేమించిన ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకుంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రముఖ నిర్మాత, నటుడు జాకీ బగ్నానీ తో పీకల్లోతు ప్రేమలో మునిగిన రకుల్ .. గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. 33 సంవత్సరాల రకుల్.. 39 ఏళ్ళ జాకీని జీవిత భాగవస్వామిగా ఆహ్వానించింది. ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఇక పెళ్లి తరువాత రకుల్-జాకీ జంట విదేశాలకు చెక్కేసి.. హనీమూన్‌కు వెళుతుందని అందరూ భావించగా.. హనీమూన్ ను వారు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా తమ సినిమా పనులపై దృష్టి సారిస్తారని ఈ జంట భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా జాకీ నిర్మించిన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌ల బడే మియాన్ చోటే మియాన్ చిత్రం విడుదలైన తర్వాత, వారు హనీమూన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. అలాగే షాహిద్ కపూర్ హీరోగా జాకీ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.జాకీ బగ్నానీ అక్షయ్ కుమార్ చిత్రాలను నిర్మిస్తూనే ఉన్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన రకుల్ ప్రీతి సింగ్ నటిస్తోంది.
ఈ సినిమా పనులు జరుగుతున్న సమయంలో రాహుల్, జాకీల మధ్య ప్రేమ చిగురించింది. బడే మియాన్ చోటే మియాన్ ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈసినిమా రిలీజ్ అయిన తరువాత విజయోత్సవాలు చేసుకుని.. ఆతరువాత వీరిద్దరూ హనీమూన్ కోసం లాంగ్ ట్రిప్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. ఆమె 2009 కన్నడ చిత్రం గిల్లితో హీరోయిన్ గా ఎంటర్ అయ్యింది. తెలుగులో సందీప్ కిషన్ సరసన మొదటిసినిమా చేసింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది.
Rakul preet singh Wedding Video Out
తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటిస్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది బ్యూటీ. అటు తమిళ్ లో కూడా ఆమె వరుస సినిమాలు చేసింది. బాలీవుడ్ లో ప్రస్తుతం యాక్టీవ్ గా ఉంది రకుల్. తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో తమిళ, హిందీ సినిమాలు చేసుకుంటుంద.