- Home
- Entertainment
- భార్య సుజాతతో గొడవ.. ఓదార్పు కోసం వర్ష వద్దకి వెళ్లిన రాకేష్.. తన భర్తతో ఆ పనిచేస్తావా అంటూ కొట్టుకున్న వైనం
భార్య సుజాతతో గొడవ.. ఓదార్పు కోసం వర్ష వద్దకి వెళ్లిన రాకేష్.. తన భర్తతో ఆ పనిచేస్తావా అంటూ కొట్టుకున్న వైనం
జబర్దస్త్ షోలో భార్యాభర్తలు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత తమ స్కిట్లతో నవ్వులు పూయిస్తున్నారు. అలాంటి ఈ ఇద్దరు జుట్లుపట్టుకుని కొట్టుకోవడం ఓ ఎత్తైతే, ఇందులో వర్షని లాగు ఆమెని చితకబాదిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. రచ్చ చేస్తుంది.

జబర్దస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్, సుజాతలు కలిసి ఓ టీమ్‌గా స్కిట్లు చేస్తూ నవ్విస్తున్నారు. వీరికి ప్రవీణ్ మెయిన్‌గా ఉన్నారు. రాకేష్ టీమ్ లీడర్‌గా ఈ టీమ్ నవ్వులు పూయిస్తుంటుంది. తాజాగా ఇందులో రాకేష్ లేడీ గెటప్ వేశారు. రాకేష్, సుజాతలు పక్క పక్కనే టిఫిన్ సెంటర్లు నడిపిస్తున్నారు. ఉదయాన్నే లేచి రెచ్చిపోయారు.
ఎదురెదురుగా ఉన్న వీరిద్దరు మార్నింగ్ లేచినప్పట్నుంచి శోకాలు పెడుతూ తిట్టుకుంటున్నారు. పొద్దు పొద్దునే ఓ దరిద్రపు మోహం దాన్ని చూడాల్సి వచ్చిందంటూ గొడవ స్టార్ట్ చేశాడు లేడీ గెటప్‌లో ఉన్న రాకేష్ తిట్ల పురాణం స్టార్ట్ చేసింది. దీనికి సుజాత కూడా రియాక్ట్ అవుతూ నేను కూడా దరిద్రపు మొహాన్నే చూసిన్నే దరిద్రపుకొట్టుదాన అంటూ రెచ్చిపోయింది. అంతటితో ఆగలేదు. గొడవ పెరిగి పెద్దదయ్యింది. ఇద్దరు జట్లు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు.
ఇంతలో కల్పించుకుని ప్రవీణ్ వీరిద్దమధ్య మరింత అగ్గి రాజేశాడు. ఇదే ఇదే నాకు కావాల్సింది. ఈ స్టేజ్‌పై ఏదైతే చూడాలనుకున్నానో, అదే చూస్తున్నా. ఇన్ని రోజులు ఆ మెట్ల మీద కూర్చొని ఎన్ని దారుణాలు చేశారండి అంటూ రెచ్చిపోయాడు. అంతేకాదు వీరిద్దరిని విడిపించే ప్రయత్నం చేశారు. దీంతో కాసేపు కూల్ అయ్యారు. అనంతరం సుజాత మరింతగా ఫైర్ అయ్యింది. రెండు కాళ్లు లేపి మెట్లకు కొడతా ఏమనుకుంటున్నావో అని తిట్ల పురాణం కొనసాగించింది.
దీంతో సింపతి ప్రయత్నం చేశాడు రాకేష్. నేను ఏమన్నానని ఇన్ని మాటలు అంటున్నారని వాపోయాడు. ఏడ్చుకుంటూ, మరోవైపు తిట్టుకుంటూ వెళ్లి స్టేజ్‌కి దూరంలో ఉన్న వర్ష ఒళ్లో కూర్చున్నాడు రాకేష్. దీనికి వర్ష షాక్ అయ్యింది. రాకేష్ తన ఒళ్లో కూర్చోవడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నది. ఇది చూసిన సుజాతకి మండిపోయింది. ఇంతటి దారుణం తనకళ్ల ముందు జరుగుతుండటంతో చూడలేకి ఆమె హుటాహుటిన ఆవేశంతో పరుగెత్తుకుంటూ వచ్చి `ఏందే నా మొగుడు ని పట్టుకుని అలా చేస్తావా అంటూ వర్ష జట్టు పట్టుకుని కొట్టింది. చితకబాదినంత పనిచేసింది.
ఇది చూసి తట్టుకోలేక ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుజాతలను, వర్షలను విడిపించాడు. అయ్యో అమ్మాయిని పట్టుకుని కొడుతున్నారే అంటూ, నీకు నేనున్నా అంటూ ఆయన కూడా హగ్ చేసుకోవడం విశేషం. దీంతో మరోసారి వర్ష ఆశ్చర్యపోయింది. తనచుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక బిత్తరమోహం వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో ఆది వచ్చే శుక్రవారం ప్రసారం కానుంది.