MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చెత్తరికార్డ్ సొంతం చేసుకున్న రజినీకాంత్, మరీ ఇంత దారుణమా..?

చెత్తరికార్డ్ సొంతం చేసుకున్న రజినీకాంత్, మరీ ఇంత దారుణమా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే అది ఎలా ఉన్నా సరే హాట్ కేక్ లా అమ్ముడుపోతుంది. సనిమా నిలబడే విధంగా అయినా కలెక్షన్లు వస్తాయి. కాని ఓ సినిమాతో రజినీకాంత్ ఓ చిత్తర రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 02 2024, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో 70 ఏళ్ళు దాటిన తరువాత కూడా మాస్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో రజినీకాంత్ ఒకరు అయితే.. వచ్చే ఏడాదికి రజినీతో పాటు చిరంజీవిని కూడా ఆ లిస్ట్ లో కలిపేయవచ్చు. ఇక ఈ ఏజ్ లో కూడా ఇలా దూసుకుపోతు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారంటే.. అది మామూలువిషయం కాదు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే మినిమమ్ ఉంటుంది. ఆయన సినిమా అంటే ఎగిరి గంతేసి కొనుకుంటారు బయ్యార్లు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఓటీటీ వారు అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. కలెక్షన్లు కూడా ఎంత చెత్త సినిమా అనిపించుకున్నా.. నష్టం రావడం మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. కాని రజినీకాంత్ కెరీర్ లో పరమచెత్త సినిమాగా రికార్డ్ కు ఎక్కిందట ఓ మూవీ. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు లాల్ సలాం. విష్ణు విశాల్ హీరోగా నటించిన ఈసినిమలో రజినీకాంత్ పెద్దరికంగా ఓ పాత్రలో నటించాడు. 

36

అది కూడా  లాల్ సలాం సినిమాను రజినీకాంత్ కూతురు డైరెక్ట్ చేయడంతో తలైవా ఈ పాత్రకు ఒప్పుకున్నారు. కాని ఈసినిమా ఎంత ధారుణంగా డిజాస్టర్ అయ్యిందంటే.. ఈ ఏడాది దారుణాలలో ఇది ఒకటిగా నిలిచింది. అంతే కాదు కనీసం స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ చేస్తే వచ్చినంత కలెక్షన్లు కూడా ఈసినిమాకు రాలేదంటే అర్ధం చేసుకోవచ్చు లాల్ సలాం ఏ రేంజ్ డిజాస్టర్ గా నిలిచిందో.

46
Rajinikanth

Rajinikanth

ఓవర్ ఆల్ గా ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన గ్రాస్ 18 కోట్లు మాత్రమే. ఇక శాటిలైట్. డిజిటల్ రైట్స్ ఏమైనా వెలిగిపోయాయా అంటే.. అది కూడా లేదు. ఇంత వరకూ ఏ సంస్థ ఈ సినిమా హక్కులు తీసుకోలేదు. రజినీకాంత్ సినిమా అంటే ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటువంటిది ఏ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను తీసుకోలేదంటే  అర్ధం చేసుకోవచ్చు. 

వందల కోట్ల టేబుల్ ప్రాఫిట్ రావల్సిన రజినీకాంత్ సినిమా.. హాట్ కేకుల్లా రైట్స్ అమ్ముడు పోవల్సిన తలైవా మూవీకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా ఆశ్చర్యం అనే అనాలి. ఏమాత్రం హైప్ లేకపోవడంతో ఎవరు ఈసినిమాను కొనడానకి ముందు రావడంలేదట. ఇక ఇదే పరిస్థితితి తెలుగులో అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాకు కూడా ఉంది. 
 

56

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈసినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. అంతే కాదు ఓటీటీ నుంచి కూడా ఎవరు ఈసినిమాను కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదట. సోనీ లీవ్ ముందుగా ఈ రైట్స్ దక్కించుకుంది. కాని ఆర్ధికంగా విభేదాలు రావడంతో మళ్ళీ సీన్ మొదటికి వచ్చింది. ఇక ప్రస్తుతం ఈసినిమాను ఏ ఓటీటీ సంస్థ కొనుగోలు చేయలేదని తెలుస్తోంది.  
 

66

ఇక ఈ విషయాలు పక్కన పెడితే రజినీకాంతం ప్రస్తుతం కూలీ నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. జైలర్ సినిమాతో ప్రభంజనం సృస్టించాడు అదే ఊపుతో మరో రెండుసినిమాలు లైన్ చేశారు తలైవా. మరి ఈసినిమాను ఏం అవుతాయో చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Salman Khan: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన.. సల్మాన్ ఖాన్ సపోర్ట్, అసలేం అన్నారంటే?
Recommended image3
Ravi Teja: నన్ను తీసేసి కొందరు వేస్ట్ గాళ్ళని తీసుకున్నారు, అదే నా బాధ.. రవితేజ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved