- Home
- Entertainment
- కరెంట్ పోయిందని ప్రియురాలినే వదిలేసిన సూపర్ స్టార్.. రజనీకాంత్ క్రేజీ లవ్ స్టోరీ!
కరెంట్ పోయిందని ప్రియురాలినే వదిలేసిన సూపర్ స్టార్.. రజనీకాంత్ క్రేజీ లవ్ స్టోరీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఫస్ట్ లవ్ స్టోరీ బయటకు వచ్చింది. కరెంట్ పోవడంతో తన లవ్ ప్రపోజల్ చేయకుండానే వచ్చేశాడట.

రజనీకాంత్ ఎవరికీ తెలియని లవ్ స్టోరీ
శ్రీదేవిని భారతీయ సినిమా తొలి లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె, తన అందం, నృత్యం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అప్పట్లో దాదాపు అందరు స్టార్స్ తో కలిసి నటించింది శ్రీదేవి. అయితే వారిలో రజనీకాంత్‌తో కెమిస్ట్రీ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఈ ఇద్దరు కలిసి వివిధ భాషల్లో 17కి పైగా చిత్రాల్లో కలిసి నటించారు. దీంతో ఈ వీరి జోడి విశేషంగా పాపులర్ అయ్యింది.
KNOW
శ్రీదేవిపై రజనీలో ఇష్టం స్టార్ట్ అయ్యింది ఇక్కడే
శ్రీదేవి, రజనీకాంత్ మొదటిసారి 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'మూండ్రు ముడిచ్చు' చిత్రంలో కలిసి నటించారు. అప్పట్లో శ్రీదేవి వయసు కేవలం 13 సంవత్సరాలు. ఆ సినిమాలో రజనీకాంత్‌కి సవతి తల్లిగా నటించారు! మొదటి సినిమాలోనే విచిత్రమైన కాంబినేషన్. అయితే, వారి కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంది. అది అనేక చిత్రాల్లో కొనసాగింది. తర్వాతి సంవత్సరాల్లో వీరి బంధం మరింత బలపడింది. రజనీకాంత్ శ్రీదేవి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపేవారు. శ్రీదేవి కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా ఆమె తల్లితో సన్నిహితంగా ఉండేవారు.
శ్రీదేవికి లవ్ ప్రపోజల్ చేయాలనుకున్న రజనీకాంత్
కాలక్రమేణా, రజనీకాంత్‌కి శ్రీదేవిపై ఆకర్షణ పెరిగింది. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తన కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ రజనీకాంత్ శ్రీదేవికి ఎందుకు ప్రేమను వ్యక్తపరచలేదు? అనేది కె. బాలచందర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రజనీకాంత్ శ్రీదేవిని చాలా ప్రేమించేవారు. ప్రేమను చెప్పడానికి శ్రీదేవి ఇంటికి కూడా వెళ్లారు. అప్పట్లో శ్రీదేవి రజనీ కంటే 13 సంవత్సరాలు చిన్నవారు. రజనీ శ్రీదేవి ఇంటికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కరెంటు పోయింది. ఈ ఊహించని సంఘటన రజనీని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కరెంట్ పోవడంతో ప్రియురాలినే వదిలేసుకున్న రజనీకాంత్
రజనీ ఎప్పుడూ శకునాలను నమ్మేవారు. కరెంటు పోవడాన్ని చెడు శకునంగా భావించారు. ఈ సంఘటన రజనీకాంత్ మనసును మార్చేసింది. శ్రీదేవికి ప్రేమను చెప్పకుండా, ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు. రజనీకాంత్ తన ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరచకపోయినా, ఆయన, శ్రీదేవి చాలా కాలం స్నేహితులుగా ఉన్నారు. 2018లో శ్రీదేవి అకాల మరణం వరకు వారి స్నేహం కొనసాగింది. శ్రీదేవి 1996లో నిర్మాత-దర్శకుడు బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. రజనీకాంత్ 1981లో లతను వివాహం చేసుకున్నారు. రజనీకాంత్ శ్రీదేవి గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. కానీ వారి సన్నిహితులకు శ్రీదేవిని ఆయన ఎంతగానో ప్రేమించారనేది తెలుసు. మొత్తంగా కరెంట్ కారణంగా తన ప్రియురాలినే వదిలేసుకున్నారు రజనీ.