MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నువ్వు ఇలా ఉంటావంటే సినిమాకి ఒప్పుకునే వాడిని కాదు.. నాగార్జునని చూసి రజనీకాంత్‌ క్రేజీ రియాక్షన్‌

నువ్వు ఇలా ఉంటావంటే సినిమాకి ఒప్పుకునే వాడిని కాదు.. నాగార్జునని చూసి రజనీకాంత్‌ క్రేజీ రియాక్షన్‌

రజనీకాంత్‌ `కూలీ` మూవీ షూటింగ్‌లో ఫస్ట్ డే షూట్‌లో నాగార్జునని చూసి ఆశ్చర్యపోయారట. ఈ సందర్భంగా ఆయన రియాక్షన్‌ ఏంటో వెల్లడించారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 06 2025, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`కూలీ`లో నాగార్జున విలన్‌..షాక్‌లో రజనీకాంత్‌
Image Credit : Asianet News

`కూలీ`లో నాగార్జున విలన్‌..షాక్‌లో రజనీకాంత్‌

కింగ్‌ నాగార్జున హీరోగా ఇన్నాళ్లు మెప్పించారు. ఇప్పుడు ఆయన కెరీర్‌ పరంగా పెద్ద టర్న్ తీసుకున్నారు. విలన్‌గా మారిపోయారు. ఇటీవల `కుబేర` చిత్రంలో కాస్త నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రని పోషించారు. ఇప్పుడు `కూలీ`లో పూర్తిస్థాయిలో విలన్‌గా మారారు. ఇందులో సైమన్‌గా అత్యంత క్రూరమైన విలన్‌గా నటించారు నాగార్జున. ఆయన ఈ పాత్ర చేస్తున్నారని తెలిసి  రజనీకాంత్‌ కూడా షాక్‌ అయ్యారు. దర్శకుడు లోకేష్‌ ఈ విషయం చెప్పినప్పుడు నిజమేనా, ఆయన ఒప్పుకున్నారా? అని ఆశ్చర్యపోయారట. నాగార్జున ఈ మూవీ చేయడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందన్నారు రజనీకాంత్‌.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగార్జునపై రజనీకాంత్‌ కామెంట్‌
Image Credit : Asianet News

నాగార్జునపై రజనీకాంత్‌ కామెంట్‌

బేసిక్‌గా తాను విలన్‌ కాబట్టి ఇలాంటి పాత్ర చేయాలని తనకు ఆసక్తిగా ఉందని, అలాంటిది ఈ పాత్రలో ఎవరు చేస్తారని ఎంతో క్యూరియాసిటీతో ఉన్నట్టు రజనీకాంత్‌ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన `కూలీ` ఈవెంట్‌లో భాగంగా తాను ఇచ్చిన వాయిస్‌ వీడియోలో తెలిపారు. అయితే ఇదే ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ, మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వైజాగ్‌లో ఫస్డ్ డే షూట్‌ జరుగుతుందని, ఆ సమయంలో రజనీకాంత్‌, తనపై మొదటి షాట్‌ తీయాల్సి ఉందని, రజనీ సెట్‌ మీదకు వచ్చి నన్ను కిందకిపైకి  రెండు మూడు నిమిషాల పాటు చూసి ‘మీరు ఇలా ఉన్నారని తెలిస్తే మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్‌కు చెప్పేవాడిని` అని (నవ్వుతూ) అన్నట్టు తెలిపారు నాగార్జున. అదే తనకు పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నట్టు తెలిపారు నాగ్‌.

35
`అన్నమయ్య` చేస్తుంటే విమర్శించారు
Image Credit : Asianet News

`అన్నమయ్య` చేస్తుంటే విమర్శించారు

తాను నెగటివ్ రోల్‌ చేయడం గురించి మాట్లాడుతూ, ``నిన్నేపెళ్లాడతా’ చేసిన తర్వాత ‘అన్నమయ్య’ చేస్తుంటే.. ‘ఇప్పుడెందుకు ఇలాంటి కథ’ అని కొందరు నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. నాకు కొత్తదనం ఇష్టం. సెట్‌కు వెళ్లాక బోర్‌ కొట్టకూడదంటే డిఫరెంట్ పాత్రలు చేయాలి. ఆ ప్రయత్నంతోనే ఇంతకాలం పని చేశాను. కొన్ని దెబ్బలు తిన్నా. మంచి మంచి విజయాలూ అందుకున్నాను. ఒకరోజు లోకేశ్‌ నన్ను కలిసి ‘మీరు విలన్‌గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నారు. లోకేష్ `ఖైదీ`, `విక్రమ్` నా ఫేవరట్ ఫిలిమ్స్. ఆ సినిమాలు చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని బలంగా అనుకున్నా. ‘కూలీ’ కథ చెప్పిన తర్వాత నాకు చాలా నచ్చింది. ‘రజనీ సర్‌ ఈ కథ ఒప్పుకొన్నారా’ అని అడిగా. ఎందుకంటే ఈ కథలో ‘సైమన్‌’ పాత్ర కథలో ఆల్ మోస్ట్ హీరోలాంటిది. లోకేష్ హీరో విలన్స్ ని ఈక్వెల్ గా చూపిస్తాడు.

45
నాలో కూడా ఈవిల్‌ ఉన్నాడన్నాడు లోకేష్‌
Image Credit : Asianet News

నాలో కూడా ఈవిల్‌ ఉన్నాడన్నాడు లోకేష్‌

నా కెరీర్‌లో మొదటిసారి లోకేష్‌ కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నా. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నా. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పా. మరొకరైతే, ఈజీగా తీసుకుంటారు. కానీ, నేను చెప్పిన విషయాలు పరిగణనలోకి తీసుకుని ‘సైమన్‌’ పాత్రను లోకేశ్‌ తీర్చిదిద్దిన విధానం నాకు నచ్చింది. రజనీ సర్‌ చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా (నవ్వుతూ). వైజాగ్‌లో మా ఫస్ట్‌ షూట్‌ జరిగింది. రెండో రోజు షూటింగ్‌ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్‌మీడియాలో లీకై వైరల్ అయింది. అది సీన్ చూసి ‘మనుషులు ఇంత ఈవిల్ గా ఉంటారా?’ అని లోకేష్ ని అడిగాను. ఇంతకంటే ఈవిల్ గా ఉంటారని చెప్పారు. మీ లోపల కూడా ఒక ఈవిల్ ఉన్నారని చెప్పారు. క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కి అది కాంప్లీమెంట్ గా తీసుకున్నాను` అని వెల్లడించారు నాగ్‌.

55
ఆగస్ట్ 14న గ్రాండ్‌గా `కూలీ` రిలీజ్‌
Image Credit : X/@sunpictures

ఆగస్ట్ 14న గ్రాండ్‌గా `కూలీ` రిలీజ్‌

లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన `కూలీ` చిత్రంలో రజనీకాంత్‌తోపాటు నాగార్జున, అమీర్‌ ఖాన్‌, ఉపేంద్ర, శృతిహాసన్‌, సత్యరాజ్‌, సౌబిన్‌ వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు. పూజా హెగ్డే మోనికా సాంగ్‌లో రచ్చ చేసింది. సన్‌ పిక్చర్స్ నిర్మించిన ఈమూవీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగులో సునీల్‌ నారంగ్‌, దిల్ రాజు, సురేష్‌ బాబు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు రైట్స్ రూ.50కోట్లకు కొన్నట్టు సమాచారం. గోల్డ్ వాచ్‌ స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగబోతుందని దర్శకుడు లోకేష్‌ ఇప్పటికే వెల్లడించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aishwarya Lekshmi: ఆ చెత్త పనుల వల్లే ఇన్‌స్టాగ్రామ్‌కు గుడ్‌బై చెప్పా.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్
Recommended image2
Gangster Stories: గ్యాంగ్‌స్టర్ కథలకు అడ్డా.. ఆ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీస్తే హిట్టే!
Recommended image3
Posani: ఇండస్ట్రీ హిట్ విషయంలో త్రివిక్రమ్ ని తిట్టేసిన పోసాని.. 4 రోజుల పాత్రతో క్రెడిట్ మొత్తం అతడికే
Related Stories
Recommended image1
`వార్‌ 2` ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్‌.. ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌, కియారా అద్వానీ ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?
Recommended image2
ఛీ ఛీ ఫీలింగ్స్ చచ్చిపోయాయి.. పెళ్లిపై బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శ్రీ సత్య బోల్డ్ కామెంట్, ఇంత ఓపెన్‌గానా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved