MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ ప్రశ్న అడగగానే మండిపోయింది రజనీకి, సీరియస్ గా వార్నింగ్

ఆ ప్రశ్న అడగగానే మండిపోయింది రజనీకి, సీరియస్ గా వార్నింగ్

ప్రశ్న అడగగానే   అసహనం వ్యక్తంచేస్తూ అక్కడినుంచి  రజనీకాంత్ వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

2 Min read
Surya Prakash
Published : Sep 20 2024, 05:04 PM IST| Updated : Sep 20 2024, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రజనీకాంత్ ఎప్పుడో కానీ తన ఎమోషన్స్ ని బహిరంగంగా బయిటపడనివ్వరు. అయితే ఆయనకు ప్రస్టేషన్ వచ్చింది. రాజకీయాల గురించి ప్రశ్నించిన విలేకరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు  రజనీకాంత్‌ (Rajinikanth). తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన ఆయన్ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. 
 

26
Rajanikanth

Rajanikanth


తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? అని అడగ్గా.. ‘‘రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు నన్ను అడగవద్దు అని చెప్పానుగా’’ అని అసహనం వ్యక్తంచేస్తూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

36


డీఎంకే (DMK) అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin), తన తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు (Udhayanidhi stalin) ఉప ముఖ్యమంత్రి పదవి పగ్గాలు అప్పగిస్తారని అధికార డీఎంకేలో కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

దీనిపై ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌ స్పందిస్తూ.. ‘ఇది పూర్తిగా ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం. ఆయన మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం’ అని చెప్పారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రి, డీఎంకే పార్టీ యూత్‌ వింగ్‌ సెక్రటరీగా ఉదయనిధి కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

46
Rajanikanth

Rajanikanth


రజనీకాంత్‌ ప్రస్తుత  సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘వేట్టయాన్‌’, ‘కూలీ’ కోసం వర్క్‌ చేస్తున్నారు. టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న ‘వేట్టయాన్‌’లో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు.

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. అక్టోబర్‌ 10న ఇది విడుదల కానుంది. ‘కూలీ’ చిత్రానికి లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున, శ్రుతిహాసన్‌, సత్యరాజ్‌, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

56
Rajanikanth

Rajanikanth

కథానాయకుడు రజనీకాంత్‌ సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు. ఈ దసరా బరిలో ‘వేట్టయాన్‌’తో సందడి చేయనున్న ఆయన.. ఆ వెంటనే ‘కూలీ’తో పలకరించనున్నారు.

ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు ‘జైలర్‌ 2’ను పట్టాలెక్కించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే ఇప్పుడాయన మరో కథ విషయమై ఓ యువ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

 

66

‘కర్ణన్‌’, ‘మామన్నన్‌’ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు మారి సెల్వరాజ్‌. ఆయన ప్రస్తుతం రజనీతో ఓ సినిమా చేసేందుకు కథా చర్చలు జరుపుతున్నట్లు స్వయంగా వెల్లడించారు. ‘‘రజనీకు నేనంటే ఇష్టం. నా గత చిత్రాలు ‘కర్ణన్‌’, ‘మామన్నన్‌’ చూసి ఫోన్‌ చేసి అభినందించారు.

మేమిద్దరం కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి కథా చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు సెల్వరాజ్‌. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘వాజై’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘బైసన్‌’ 70శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Nov 28: వల్లీ గుట్టు రట్టు, నగల దొంగ వల్లీనేనని తేల్చేసిన ప్రేమ
Recommended image2
ఒకే ఏడాది నాలుగు సినిమాలని దెబ్బ కొట్టిన జూ.ఎన్టీఆర్.. వెంకటేష్, మహేష్ బాబు సినిమాల అడ్రెస్ గల్లంతు
Recommended image3
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శ్రీధర్ ని అవమానించిన పారు- దీప ప్రెగ్నెన్సీ పోయేలా కిందపడేసిన జ్యో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved