- Home
- Entertainment
- దాసరి రిజెక్ట్ చేసిన మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రాజేంద్రప్రసాద్.. నటకిరీటి సెట్ కాడన్నారు, ఏకంగా నంది అవార్డు సొంతం
దాసరి రిజెక్ట్ చేసిన మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన రాజేంద్రప్రసాద్.. నటకిరీటి సెట్ కాడన్నారు, ఏకంగా నంది అవార్డు సొంతం
దాసరి నారాయణరావు రిజెక్ట్ చేసిన ఒక మూవీని రాజేంద్రప్రసాద్ చేశారు. బ్లాక్ బస్టర్ కొట్టాడు. మోహన్‌బాబుని కాదని సినిమా చేసి ఉత్తమ నటుడిగా నంది అవార్డుని అందుకున్నారు.

దాసరి చేయాల్సిన మూవీతో రాజేంద్రప్రసాద్
సినిమాల్లో తెరవెనుక చాలా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక హీరోతో చేయాలనుకున్న సినిమా మరో హీరోతో చేయడం చాలా సందర్భాల్లో చోటు చేసుకుంటుంది. కాకపోతే అవి విన్నప్పుడు మనకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అలా దాసరి నారాయణరావు, రాజేంద్రప్రసాద్‌ల విషయంలో జరిగింది. ఆ కథేంటో చూద్దాం.
KNOW
రాజేంద్రప్రసాద్‌తో `ఆ నలుగురు` మూవీ
`ఆ నలుగురు` సినిమాలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించారు. చంద్ర సిద్ధార్థ దర్శకత్వం వహించారు. ఇందులో రాజేంద్రప్రసాద్‌తోపాటు ఆమని, కోట శ్రీనివాసరావు, రాజా, శుభలేఖ సుధాకర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. 2004లో విడుదలైన ఈ మూవీ మూడు నంది అవార్డులను అందుకుంది. బెస్ట్ యాక్టర్‌గా రాజేంద్రప్రసాద్‌కి నంది అవార్డు వరించింది. అలాగే కోట శ్రీనివాసరావుకి సహాయనటుడు విభాగంలో నంది దక్కించుకున్నారు. ఈ మూవీ నటకిరీటి కెరీర్‌లో ఒక మైలు రాయిగా, టాప్ మూవీస్‌లో ప్రధానంగా నిలుస్తుంది.
దాసరితో చేయాల్సిన `ఆ నలుగురు`
ఇదిలా ఉంటే ఈసినిమాకి నిర్మాత అట్లూరి పూర్ణ చంద్రరావు మొదట అనుకున్న హీరో రాజేంద్రప్రసాద్ కాదు. దాసరి నారాయణరావుతో ఈ మూవీ చేయాలనుకున్నారు. ఆయనకు కథ చెప్పగా, ఆ సమయంలో దాసరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఆ బిజీలో ఆయన ఉన్నారు. అలాంటి సమయంలో ఈ ఆఫర్ చేయగా, కథ నచ్చింది, కానీ చేయలేకపోయారు. మంత్రి పదవి రావడంతో దాసరి ఈ స్క్రిప్ట్ ని వదులుకున్నారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ ఆసక్తిని చూపించారు. అయితే దీనికి నువ్వు సెట్ కావని నిర్మాత అట్లూరి పూర్ణచంద్రావు అన్నారు. తన సినిమాలు చూశావా అని రాజేంద్రప్రసాద్ అడగడంతో తాను చూడలేదని చెప్పాడట. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ మూవీస్ చూశాక తన అభిప్రాయం మార్చుకొని ఆయనతోనే సినిమా చేశారు నిర్మాత.
`ఆ నలుగురు` చేసేందుకు ముందుకు వచ్చిన మోహన్ బాబు
అయితే మధ్యలో మోహన్ బాబు ఆసక్తి చూపించారట. దాసరిని నిర్మాత అట్లూరి అడగడంతో ఆ సమాచారం మోహన్ బాబు వద్దకు వెళ్లింది. ఆయన కూడా నటించేందుకు ఆసక్తి చూపించారు. కానీ నువ్వు సెట్ కావని మోహన్ బాబుకి కూడా చెప్పారు అట్లూరి. అలా ఈ మూవీ నుంచి అటు దాసరి, ఇటు మోహన్ బాబు తప్పుకోవాల్సి వచ్చింది. ఫైనల్‌గా రాజేంద్రప్రసాద్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మొదట ఈ చిత్రానికి మిశ్రమ స్పందన రాబట్టుకున్నా, నెమ్మదిగా కోలుకుని సూపర్ హిట్ అయ్యింది. నంది అవార్డులను తెచ్చిపెట్టింది.
అల్లూరి పూర్ణచంద్రరావు నిజ జీవిత కథతో `ఆ నలుగురు`
ఇదిలా ఉంటే ఈ కథ అందించింది నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు. ఆయన జీవితంలోని సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ కథని రెడీ చేశారు. ఈ మూవీని రూపొందించారు. ఇది క్రిటికల్‌గానూ ప్రశంసలందుకుంది. మంచి వసూళ్లని రాబట్టుకుంది. మొత్తంగా దాసరి నారాయణరావు చేయాల్సిన మూవీతో రాజేంద్రప్రసాద్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఏకంగా నంది అవార్డు అందుకుని నటుడిగా తానేంటో నిరూపించుకున్నారు.