పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు, సుమతో విడాకుల వార్తలపై స్పందించిన రాజీవ్ కనకాల
గత కొంత కాలంగా తనపై.. తన కుటుంబంపై వస్తున్న రూమర్స్ విషయంలో స్పందించారు ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల. ముఖ్యంగా రాజీవ్ సుమ విడాకుల విషయంపై క్లారిటీ కూడా ఇచ్చాడు.

టాలీవుడ్ లో యాంకర్ గా స్టార్ డమ్ తో దూసుకుపోతుంది యాంకర్ సుమ. స్టార్ హీరోల ఈవెంట్లకు హోస్టింగ్ చేస్తూ.. స్టార్ లను మించిన స్టార్ గా మారిపోయింది సుమ కనకాల. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లాడింది సుమ. రాజీవ్ కు సరైనా అవకాశాలు లేక అడపాదడపాసినిమాలు చేసుకుంటూ ఉన్నాడు. సుమ మాత్రం స్టార్ డమ్ తో దూసుకుపోయింది.
ఈక్రమంలో సుమ - రాజీవ్ కనకాల మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, ఇద్దరూ కూడా విడాకులు తీసకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు చాలా కాలంగా సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఈ విషయంలో సుమ చాలా సార్లు క్లారిటీ ఇచ్చినా.. వచ్చే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఈక్రమంలో రాజీవ్ కనకాల ఈ పుకార్లపై స్పందించారు.
తాజాగా ఒ మీడియా సంస్థకు ఇంటర్వయూ ఇచ్చిన రాజీవ్ కనకాలకు ఈ విషయాన్ని గురించిన ప్రశ్ననే ఎదురైంది. అందుకు ఆయన తనదైన శైలిలో స్పందించాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. సుమ - నేను విడాకులు తీసుకోనున్నామనే వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. అలాంటిదేమీ లేదని చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ఇదే టాక్ మా అమ్మానాన్నలు ఉన్నప్పుడు వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ బాధ ఉండేదేమో అన్నారు.
అయితే సుమ ఇలాంటి వార్తలను పెద్దగా పట్టించుకోదు. కాని తాను మాత్రం . అంత తేలికగా నేను తీసుకోలేను అన్నారు. ఎందుకంటే ఈ విషయంలో తన పిల్లలు బాగా సఫర్ అయ్యారి. ఈ విషయంపై స్కూల్లో పిల్లలు కాస్త ఇబ్బంది పడ్డారు" అని అన్నాడు. వాళ్లకు ఎదురయ్య ప్రశ్నల వల్ల ఎంత ఇబ్బంది పడి ఉంటారు.. ప్రతీ ఒక్కరు ఆలోచించాలి. క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా ఇలాంటి వార్తలురావడం బాధేస్తోందన్నారు.
అంతే కాదు నేను .. సుమ విడిపోలేదు. కలిసే ఉన్నామని చెప్పడం కోసం, తన షోస్ కి నేను వెళ్లాను .. తన ఈవెంట్స్ కి వెళ్లాను. ఇటీవల యూఎస్ వెళ్లినప్పుడు రీల్స్ కూడా చేశాము. ఆ రీల్ బాగా వైరల్ అయింది కూడా. ఇలా మేము కలిసే ఉన్నాం బాబోయ్ అని చెప్పుకోవడం మాకు కష్టమైపోతోంది" అని అన్నాడు. ప్రస్తుతం రాజీవ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.