MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Varanasi 2 Parts: రాజమౌళి ఊహించని ట్విస్ట్, రెండు పార్ట్‌ లుగా `వారణాసి`.. టైటిల్స్ ఇవే

Varanasi 2 Parts: రాజమౌళి ఊహించని ట్విస్ట్, రెండు పార్ట్‌ లుగా `వారణాసి`.. టైటిల్స్ ఇవే

`వారణాసి` సినిమా విషయంలో రాజమౌళి `బాహబలి` స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారట. ఈ మూవీని కూడా రెండు పార్ట్ లుగా తీసుకురాబోతున్నారట. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 02 2026, 08:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా `వారణాసి` మూవీ
Image Credit : youtube/varanasi movie

భారీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా `వారణాసి` మూవీ

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో `వారణాసి` మూవీ రూపొందుతుంది. భారీ ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకధీరుడు. విజువల్ వండర్‌గా దీన్ని తెరమీదకు తీసుకురాబోతున్నారు. దాదాపు నాలుగైదు కాలాలను టచ్‌ చేస్తూ ఈ మూవీ సాగబోతుందని ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌లో వెల్లడించారు. అన్ని కాలాల్లోకి హీరో ప్రయాణించడమే ఇందులో హైలైట్‌గా నిలవబోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాముడిగా కనిపించబోతున్న మహేష్‌ బాబు
Image Credit : youtube/varanasi movie

రాముడిగా కనిపించబోతున్న మహేష్‌ బాబు

రాజమౌళి ఈ మూవీని మొదట్నుంచి గ్లోబల్‌ ట్రోటర్‌గా చెబుతూ వచ్చారు. ప్రపంచ అన్వేషకుడి అర్థంలో ఈ టైటిల్‌ని వాడతారు. ఇందులో హీరో పాత్ర ప్రపంచ అన్వేషకుడిగా ఉండబోతుందట. ఆ జర్నీనే ఈ సినిమా అని, ఆ జర్నీని తెరపై మ్యాజికల్‌గా ఆవిష్కరించబోతున్నారట రాజమౌళి. అంతేకాదు ఇందులో రామాయణం పార్ట్ ని కూడా చూపించబోతున్నారు. లంక దహనాన్ని చూపించనున్నట్టు రాజమౌళినే తెలిపారు. ఇందులో రాముడిగా మహేష్‌ బాబు కనిపించబోతున్నారు. మొదటిసారి ఆయన పౌరాణిక పాత్ర పోషిస్తున్నారు.  రాముడిగా మహేష్‌ ఎలా ఉంటారనేది చూసేందుకు అభిమానులు, సాధారణ ఆడియెన్స్ ఆతృతగా ఉన్నారు.

Related Articles

Related image1
Ram Charan కొడుకు ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్ స్టార్ కిడ్‌
Related image2
Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
35
`బాహుబలి` స్ట్రాటజీ ఫాలో అవుతున్న రాజమౌళి
Image Credit : Asianet News

`బాహుబలి` స్ట్రాటజీ ఫాలో అవుతున్న రాజమౌళి

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు రాజమౌళి. ఏదైతే అభిమానులు వద్దు అని కోరుకుంటారో అదే చేస్తున్నారు. `బాహుబలి`   స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. `వారణాసి` మూవీని కూడా రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది చాలా పెద్ద స్టోరీ అని, ఒక్క పార్ట్ లో చెప్పడం చాలా కష్టం. వివిధ కాలాలు, ప్రాంతాల్లో సినిమా సాగుతుంది. వాటిని ఒక్క సినిమాలో చూపించడం కష్టమని భావించిన జక్కన్న ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

45
`వారణాసి` రెండు భాగాల టైటిల్స్
Image Credit : Asianet News

`వారణాసి` రెండు భాగాల టైటిల్స్

అంతేకాదు `వారణాసి` రెండు పార్ట్ లకు సంబంధించిన టైటిల్స్ కూడా ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. `వారణాసి` మూవీ కాన్సెప్ట్ టీజర్‌ విడుదల చేసినప్పుడే రాజమౌళి రెండు టైటిల్స్ రివీల్‌ చేశారు. ఒకటి మొదట్నుంచి చెబుతున్నట్టుగా `వారణాసిః గ్లోబల్‌ ట్రోటర్‌` అని, రెండోది టైమ్‌ ట్రావెల్‌ని ప్రతిబింబించేలా `వారణాసిః టైమ్‌ ట్రోటర్‌` అని సమాచారం. ఇలా రెండు పార్ట్ లకు  ఈ టైటిల్స్ ని ఫిక్స్ చేశారని అంటున్నారు. మొదటి పార్ట్ 2027 సమ్మర్‌లో ఏప్రిల్‌ 9న, రెండో పార్ట్ 2029 సమ్మర్‌లో రానుందని సమాచారం. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

55
రూ.1200కోట్ల బడ్జెట్‌తో `వారణాసి`
Image Credit : varanasi movie

రూ.1200కోట్ల బడ్జెట్‌తో `వారణాసి`

ఇక మహేష్‌ బాబు హీరోగా రూపొందుతున్న `వారణాసి` చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె మందాకిని పాత్రలో కనిపించబోతున్నారట. పాత్ర కీలకంగానే ఉంటుందని, కాకపోతే కొన్ని సీన్లలో మహేష్‌ కి లవ్‌ ఇంట్రెస్ట్ గా కనిపిస్తుందని సమాచారం. అలాగే విలన్‌ గా పృథ్వీరాజ్‌ సుకుమార్‌ పోషిస్తున్నారు. ఆయన `కుంభ` పాత్రలో కనిపించనున్నారు. రుద్రగా మహేష్‌ కనిపిస్తారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ పతాకంపై కేఎల్‌ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమారు రూ.1200కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఐమాక్స్ ఫార్మాట్‌లో సినిమాని రూపొందిస్తుండటం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi: వారణాసి అసలు కథేంటో చెప్పేసిన రాజమౌళి.. కళ్ళు చెదిరే విజువల్స్, యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా
Recommended image2
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image3
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Related Stories
Recommended image1
Ram Charan కొడుకు ఎన్ని వేల కోట్లకు వారసుడో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్ స్టార్ కిడ్‌
Recommended image2
Sankranti Movies 2027: వచ్చే సంక్రాంతికి చిరంజీవి, బాలయ్య, వెంకీ, రజనీ మధ్య బాక్సాఫీసు పోరు.. మొత్తం 7 సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved