ఎన్ని లీకులైతే ఏంటి.. రాజమౌళికి భారీ ప్లాన్ ఉందిగా
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఇండియాలో అతిపెద్ద చిత్రం రూపొందుతోంది. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన రాజమౌళి ప్రస్తుతం ఒడిశాలోని అటవీ ప్రాంతం కోరాపుట్ లో పర్వతాల మధ్య ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు.

Rajamouli
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఇండియాలో అతిపెద్ద చిత్రం రూపొందుతోంది. హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసిన రాజమౌళి ప్రస్తుతం ఒడిశాలోని అటవీ ప్రాంతం కోరాపుట్ లో పర్వతాల మధ్య ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు.
ఎవరూ ఊహించని విధంగా ఆల్మోస్ట్ ఒక సన్నివేశం మొత్తం సోషల్ మీడియాలో లీక్ అయింది. ఎవరో మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలేశారు. అది కాస్త వైరల్ అయింది. 1000 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఇలా లీక్ చేయడం దారుణం అని మహేష్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. విచిత్రంగా ఉన్న వీల్ చైర్ లో ఒక వ్యక్తి ఉంటాడు. బహుశా అతడు విలన్ అని అంటున్నారు.
మహేష్ బాబుని బంధించి రౌడీలు అతడి వద్దకి తీసుకుని వెళతారు. మహేష్ ని నెడుతూ తీసుకుని వెళ్లి అతడి ముందు మోకాళ్లపై కూర్చునేలా చేస్తారు. ఇది లీకైన సన్నివేశం. చుట్టూ భారీగా స్థూపాకారంలో కొన్ని కొన్ని సెట్స్ కనిపిస్తున్నాయి. వీటి గురించి కూడా సమాచారం లీక్ అయింది. కెన్యా అడవుల్లో అరుదైన వృక్ష జాతి ఒకటి ఉందట. ఆ వృక్షాలని స్థూపాల ప్లేస్ లో గ్రాఫిక్స్ లో చూపిస్తారని అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న చిత్రానికి ఇలా లీకులు కాకూడదు అని ఫ్యాన్స్ లబోదిబో మంటున్నారు.
హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించే సమయంలో రాజమౌళి చిత్ర యూనిట్ అందరితో నాన్ డిస్క్లోజల్ అగ్రిమెంట్ కూడా చేయించినట్లు వార్తలు వచ్చాయి. మరి అదేమైందో తెలియదు. అయితే ఎన్ని లీకులు అవుతున్నా జక్కన్న మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. మహేష్ చిత్రం విషయమో రాజమౌళి భారీ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు షూటింగ్ కొనసాగిస్తూనే ఇంటర్నేషనల్ స్టూడియోస్ తో చర్చలు కొనసాగిస్తున్నారట. మహేష్ బాబు చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు రాజమౌళి డిస్ని, సోనీ లాంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది.