- Home
- Entertainment
- ఆ దర్శకులకు రాజమౌళి భయపడడానికి కారణం ఇదేనా, అలాంటి సినిమాలు చేయను అంటూ పూరి కామెంట్స్
ఆ దర్శకులకు రాజమౌళి భయపడడానికి కారణం ఇదేనా, అలాంటి సినిమాలు చేయను అంటూ పూరి కామెంట్స్
యాంకర్ రవి అడిగిన ప్రశ్నకి రాజమౌళి సమాధానం ఇస్తూ ఒక దర్శకుడిని మరో దర్శకుడితో పోల్చడం సరికాదని అన్నారు. ఎందుకంటే నేను తీసే సినిమాలు పూరి జగన్నాథ్ గారు తీయలేరు.. పూరి తీసే సినిమాలు వివి వినాయక్ గారు తీయలేరు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తెలుగు సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ పాన్ వరల్డ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు సినిమాకి రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ కి ధీటుగా సౌత్ లో సినిమాలు వస్తున్నాయంటే రాజమౌళి ప్రభావమే కారణమని చాలా మంది సినీ ప్రముఖులు అభిప్రాయపడుతుంటారు.
పోల్చడం సరికాదు
అంతటి స్థాయికి ఎదిగిన రాజమౌళి తన సాటి దర్శకుల నుంచి పోటీని ఎలా భావిస్తారు అనే విషయంపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. యాంకర్ రవి అడిగిన ప్రశ్నకి రాజమౌళి సమాధానం ఇస్తూ ఒక దర్శకుడిని మరో దర్శకుడితో పోల్చడం సరికాదని అన్నారు. ఎందుకంటే నేను తీసే సినిమాలు పూరి జగన్నాథ్ గారు తీయలేరు.. పూరి తీసే సినిమాలు వివి వినాయక్ గారు తీయలేరు. ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది అని రాజమౌళి అన్నారు.
భయపెట్టింది ఇద్దరే
కానీ ఇద్దరు దర్శకుల విషయంలో మాత్రం తాను కంగారు పడ్డట్లు రాజమౌళి తెలిపారు. ఆ ఇద్దరు దర్శకులు సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్. వీళ్ళిద్దరూ మాస్ చిత్రాల కంటే క్లాస్ టచ్ చిత్రాలని ఎక్కువగా తీస్తుంటారు. వీళ్ళిద్దరిలో చాలా స్టఫ్ ఉంది. వీళ్ళు సరిగ్గా దృష్టి పెట్టి మాస్ సినిమాలు చేస్తే నేను సర్దుకోవాల్సిందే అనే ఫీలింగ్ కలిగింది అని రాజమౌళి అన్నారు.
సుకుమార్ మొదలుపెట్టారు
బహుశా రాజమౌళి మాటల్ని సుకుమార్ సీరియస్ గా తీసుకున్నట్లు ఉన్నారు. పుష్ప చిత్రం నుంచి సుకుమార్ మాస్ ఎలిమెంట్స్ తో సినిమాలు చేయడం ప్రారంభించారు. పుష్ప 2 మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. త్రివిక్రమ్ నుంచి ఇంకా ఆ రేంజ్ మాస్ మూవీ పడలేదు.
అలాంటి సినిమాలు చేయలేను
ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ కి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రాజమౌళి తరహాలో బాహుబలి లాంటి భారీ చిత్రం చేయొచ్చు కదా అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. పూరి జగన్నాథ్ సమాధానం ఇస్తూ.. అలాంటి సినిమాలు నేను చేయలేను. ఎందుకంటే అన్నేళ్ల పాటు ఒకే స్క్రిప్ట్ పై కూర్చుంటే నాకు విసుగు వచ్చేస్తుంది. పైగా ఒక్క చిత్రం కోసం అంత టైం కేటాయించడం సరికాదు. అందరికీ టైం వేస్ట్ అవుతుంది అని పూరి జగన్నాథ్ తెలిపారు.