MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్ విషయంలో బాధపడుతున్న వేద.. రాజాకి గుండెపోటు రావడంతో టెన్షన్ పడుతున్న రాణి?

Ennenno Janmala Bandham: యష్ విషయంలో బాధపడుతున్న వేద.. రాజాకి గుండెపోటు రావడంతో టెన్షన్ పడుతున్న రాణి?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 9వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Navya G
Published : Jan 09 2023, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో వేద అయినా యశోదర్ లో తప్పేముంది. నేను ఏమి అడిగాను అదే చేశారు. ఏం చేసినా నా సంతోషం కోసమే చేశారు నేను అడిగిందే చేశారు. నా మాటకి గౌరవం ఇస్తున్నారు నా సంతోషానికి గౌరవం ఇస్తున్నారు. కానీ ఆయన ఇచ్చే గౌరవం విలువ ప్రేమ అన్ని ఖుషికి తల్లిగా మాత్రమే ఇస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది వేద. మా ఇద్దరి మధ్య ఒప్పందం కూడా అదే కదా మేము కూడా అలాగే ఉండాలి అనుకున్నాము కదా అంటూ తనకు తాను నచ్చదు చెప్పుకుంటూ ఉంటుంది వేద. ఎందుకు ఇప్పుడు నేను ఏడవాలి ఎందుకు నేను బాధపడాలి అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వేద. బిడ్డలు కనలేని నాకు ఆ దేవుడు బిడ్డను ఇచ్చాడు. ఖుషి ని ఇచ్చి తనకు అమ్మ ప్రేమను పంచమని చెప్పాడు.

27

బిడ్డ ప్రేమను పొందాలి అనుకున్న నేను భర్త ప్రేమను కూడా పొందాలి అనుకోవడం అత్యాశే కదా తప్పు నాదే తప్పు ఎవరెవరో ఏదో చెప్పారని ఊహించుకుని అని అనుకోవడం నాదే తప్పు అని అనుకుంటూ ఉంటుంది వేద. తనకు తానుగా నచ్చు చెప్పుకుంటూనే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది వేద. మరొకవైపు రాజారాణి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాజా అబ్బాయి ఆకరిలో ఏమన్నాడు నీ కోసం నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను వేద అని అన్నాడా లేదా? అది చాలాదా వారి మధ్య ప్రేమ మళ్ళీ చిగురించడానికి, ఒకటి చాలు వారిద్దరిని మళ్లీ ఒకటి చేయడానికి అని అంటాడు రాజా. నువ్వు అనడానికి నేను వినడానికి బాగానే ఉంటుంది రాజా కానీ ఇవన్నీ జరగాలి కదా అని అంటుంది.
 

37

జరగాలి రాని జరుగుతాయి అవి జరగడానికి ఆ దేవుడు వారిని ఇక్కడికి పంపించాడు అని అంటాడు రాజా. వాళ్ళిద్దరూ కలిసి పోతారంటావా రాజా అనడంతో కలిసి పోతారు కానీ వారిద్దరి మధ్య ఏదో అడ్డుపడుతుంది అనడంతో ఆ ఒక్కటి ఏంటో తెలుసుకోవాలి అంటుంది రాణి. దానికోసం మనం ప్రయత్నం గా మనం ఏం చేయాలో అది చేద్దాము తర్వాత ఆ దేవుడు చూసుకుంటాడు అని అంటాడు. మరొకవైపు యష్, వేద ఇద్దరు పడుకుని ఉంటారు. అప్పుడు వేద లేచి కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఈ విషయంలో నేను యశోదర్ గారిని తప్పు పట్టకూడదు. నా అంగీకారంతోనే కదా ఇలా జరిగింది కాబట్టి ఆయన్ని ఈ విషయంలో తప్పు పట్టకూడదు అనుకుంటూ ఉంటుంది వేద.

47

నాకు ఆయనకు భార్యగా మారాలని ఉన్న ఆయనకు నా భర్తగా మారాలని ఉండాలి కదా. అయినా మేము అనుకున్న ప్రయాణం ఇష్టమైన కష్టమైన కలిసే ప్రయాణం చేయాలి ఇద్దరు చేతులు పట్టుకొని ఎదుర్కొని నిలబడాలి అని అనుకుంటూ ఉంటుంది వేద. పరిస్థితులు వచ్చినా కూడా చేతిని విడవకూడదు అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే యష్ నిద్రలేస్తాడు. ఏమైంది వేద ఎందుకు పడుకోకుండా అలాగే కూర్చున్నావు అనడంతో ఏదో పీడకల వచ్చింది అందుకే లేచాను అని అబద్ధం చెబుతుంది వేద. నువ్వేదో ఆలోచిస్తున్నావు ఆ విషయం గురించి నాకు చెప్పు అని అనడంతో అదేం లేదు సడన్గా ఖుషి గుర్తుకు వచ్చింది అందుకే ఇలా సడన్గా లేచి కూర్చున్నాను అని అంటుంది వేద.
 

57

అక్కడ ఖుషి కూడా నిన్ను మిస్ అవుతూ ఉంటుంది ఫోన్ చేయనా మాట్లాడతావా అనడంతో వద్దు నేను మార్నింగ్ మాట్లాడతాను అని అంటుంది. సరే పడుకో అని అంటాడు యష్. మరోవైపు ఖుషి అమ్మ అని నిద్ర లేవడంతో ఏమైంది ఖుషి అని అడగగా అమ్మ గుర్తుకు వచ్చింది నానమ్మ అని అంటుంది. పొద్దున్నే ఫోన్ మాట్లాడుదువు సరే వచ్చి పడుకో అని అంటుంది. మరొకవైపు వేద నిద్రపోతూ ఉండగా వేదనీ చూసి మురిసిపోతూ ఉంటాడు. ఈ సృష్టిలో ఎంతమంది కోడళ్ళు అమ్మలు భార్యలు ఉంటారు కానీ నీలాంటి వేదలు మాత్రం ఎవరూ ఉండరు నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కానీ నీ గురించి మాత్రం నువ్వు పట్టించుకోవు అని అనుకుంటూ ఉంటాడు.
 

67

 నేను నువ్వు కోరుకున్నది అందించలేకపోతున్నానా, లేదా నువ్వు నన్ను అడగడానికి భయపడుతున్నావా, మన మధ్య ఈ ఎడబాటు ఎందుకు అని అనుకుంటూ ఉంటాడు యష్.  అప్పుడు యష్ మంచం దిగి వేదకి దుప్పటి కప్పుతాడు. ఆ తర్వాత వేదకు వెంట్రుకలు అడ్డం రావడంతో వాటిని పక్కకు అని వేదన చూసి మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు వేద తల నిమిరి వెళ్లి ఆనందంగా పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం రాజా జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు యష్ అన్న తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి రాణి వస్తుంది. అప్పుడు వేదల గురించి తలుచుకొని ఏడుస్తూ మన బంగారు తల్లి వేదకు ఆ దేవుడు అన్ని కష్టాలు ఇచ్చాడు.
 

77

దేవత లాంటి వేదకు ఆ దేవుడు పిల్లల్ని కలగకుండా చేయడం ఏంటి అని బాధపడుతూ ఉంటాడు రాజా. అప్పుడు రాణి కూడా బాధపడుతూ ఉంటుంది. దానికి పెళ్లయిందని సంతోషం దొరుకుతుందని అనుకున్నాము కాని దానికి జీవితంలో నిజమైన సంతోషంగా దొరకలేదు అని బాధపడుతూ మాట్లాడుతాడు రాజా. వేద గురించి ఎక్కువగా ఆలోచిస్తూ గుండెపోటు రావడంతో కింద పడిపోతాడు. అప్పుడు వేద అక్కడికి వస్తుంది. అ తర్వాత యష్ రాజని లోపలికి పిలుచుకుని వెళ్లి మీకేం కాదు గ్రాండ్ ఫా దైర్యంగా ఉండండి అని అంటూ ఉండగా రాని టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రాజాని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved