- Home
- Entertainment
- ఆడోళ్లకి ఆమడ దూరం అంటూ సుధీర్ దగ్గరికి రాజ్ తరుణ్..వీళ్ళ డిస్కషన్ ప్రజెంట్ సిట్యుయేషన్ సింక్ అవుతోందే
ఆడోళ్లకి ఆమడ దూరం అంటూ సుధీర్ దగ్గరికి రాజ్ తరుణ్..వీళ్ళ డిస్కషన్ ప్రజెంట్ సిట్యుయేషన్ సింక్ అవుతోందే
యువ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలు, వివాదాలతో వార్తల్లో నలిగిపోతున్నాడు. రాజ్ తరుణ్ రిలేషన్ షిప్, ప్రేమ వ్యవహారం ఎంతటి వివాదంగా మారిందో చూస్తున్నాము.

యువ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ వ్యవహారాలు, వివాదాలతో వార్తల్లో నలిగిపోతున్నాడు. రాజ్ తరుణ్ రిలేషన్ షిప్, ప్రేమ వ్యవహారం ఎంతటి వివాదంగా మారిందో చూస్తున్నాము. రాజ్ తరుణ్ తాను గతంలో రిలేషన్ లో ఉన్న లావణ్య అనే యువత బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తోంది. రాజ్ తరుణ్ పై కేసు కూడా నమోదు చేసింది.
తామిద్దరం దాదాపు 11 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు లావణ్య ప్రకటించింది. తనకి రాజ్ తరుణ్ రెండు సార్లు అబార్షన్ చేయించినట్లుగా కూడా ఆధారాలు చూపిస్తోంది. దీనితో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. తనకి రాజ్ కావాలని లావణ్య డిమాండ్ చేస్తోంది. కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల రాజ్ తనని వదిలేస్తున్నాడని ఆమె వాపోతోంది. ఈ వ్యవహారంలో రాజ్ తరుణ్ కి ఇబ్బందులు తప్పేలా లేవు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Raj Tarun and Lavanya
లావణ్య.. రాజ్ తరుణ్ గతంలో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ల పేర్లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంత రచ్చ జరుగుతున్నా రాజ్ తరుణ్ తన సినిమా కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు, తిరగబడరా సామీ చిత్రాలు త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్నాయి. తిరగబడరా సామీ చిత్రంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కూడా రాజ్ కి ఎఫైర్ ఉందని లావణ్య ఆరోపించింది.
Bhale Unnade
రాజ్ తరుణ్ నటిస్తున్న మరో చిత్రం భలే ఉన్నాడే. ఫంక్షన్స్ కి అమ్మాయిలకు చీరలు కట్టే ప్రొఫెషన్ లో ఉండే కుర్రాడిగా రాజ్ తరుణ్ ఈ చిత్రంలో ఫన్నీగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా రీసెంట్ గా చిత్ర యూనిట్ ఫ్యామిలీ స్టార్స్ షోలో మెరిశారు. చిత్ర దర్శకుడు శివసాయి వర్ధన్, రాజ్ తరుణ్, అలాగే హీరోయిన్ షోలో మెరిశారు.
ఫ్యామిలీ స్టార్స్ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో సుధీర్, రాజ్ తరుణ్, డైరెక్టర్ మధ్య నవ్వులు పూయించేలా భలే సంభాషణ జరిగింది. డైరెక్టర్ మాట్లాడుతూ ఈ చిత్రంలో రాజ్ తరుణ్ చీరలు కట్టే వ్యక్తిగా నటిస్తున్నారు అని చెప్పారు. వెంటనే రాజ్ తరుణ్ మీకు అపోజిట్ బ్రో అంటూ సుధీర్ ని ఉద్దేశించి సెటైర్ వేశాడు.
సుధీర్ కి అర్థం కాక తికమకపడుతుంటే.. ఆయన చీర కడతారు.. కానీ మీది వేరు కదా అని డైరెక్టర్ కూడా సెటైర్ వేశారు. ఈ షోలోకి ఎంట్రీ ఇస్తూ రాజ్ తరుణ్, డైరెక్టర్, హీరోయిన్.. ఆడోళ్లకి ఆమడదూరం అనే సాంగ్ కి స్టెప్పులు వేస్తూ వచ్చారు. దీనితో నెటిజన్లు రాజ్ తరుణ్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదేదో రాజ్ తరుణ్ ప్రజెంట్ సిట్యుయేషన్ కి భలే సింక్ అవుతోందే అని కామెంట్స్ చేస్తున్నారు.
డైరెక్టర్ మాట్లాడుతూ అమ్మాయిలకి చీర కట్టి అందంగా తయారు చేస్తాడు. కానీ అమ్మాయిలు అంటే కొంచెం దూరంగా ఉంటాడు అని తెలిపారు. షోలో రాజ్ తరుణ్ ఒక వ్యక్తికి సరదాగా చీర కట్టి చూపించాడు. ఆ తర్వాత సుధీర్ ని పిలిచి విప్పమని చెప్పడంతో అంతా పగలబడి నవ్వేశారు.