Brahmamudi: భర్తతో సారీ చెప్పించుకున్న కావ్య.. స్వప్నని రెచ్చగొడుతున్న రాహుల్!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తనని అపార్థం చేసుకుంటున్నా భర్తకి నిజం నిరూపించాలని తపన పడుతున్న భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేసి ఆఫీస్ కి క్యారియర్ తీసుకువెళ్తుంది కావ్య. అదే చూసినా రుద్రాణి పాపం మొగుడి కోసం చాలా తాపత్రయపడుతుంది. వెళ్ళు వెళ్ళు అటు నుంచి వచ్చేటప్పటికి నీకోసం మీ అత్త కోసం ఒక మంచి గిఫ్ట్ సిద్ధం చేశాను అనుకుంటుంది. మరోవైపు ఆఫీసులో వర్క్ కంప్లీట్ అవ్వలేనందుకు టెన్షన్ పడుతూ ఉంటాడు రాజ్.
డిజైన్ త్వరగా కంప్లీట్ చేయమని డిజైనర్ మీద కేకలు వేస్తాడు. టిఫిన్ చేయకపోవడంతో ఆకలిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతలోనే కావ్య క్యారియర్ తీసుకొని రావటం చూస్తాడు రాజ్. కావ్య ఆఫీసులోకి వస్తుంటే సెక్యూరిటీ వాళ్లు అడ్డుకుంటారు. అపాయింట్మెంట్ ఉందా అంటూ నిలదీస్తారు. నేను రాజ్ సర్ భార్యని అని చెప్పినా నమ్మరు. అలా అయితే సార్ కి ఫోన్ చేసి చెప్పించండి అంటారు.
నా దగ్గర ఫోన్ లేదు అంటుంది కావ్య. రాజ్ సార్ భార్య దగ్గర ఫోన్ లేకపోవడం ఏంటి అయినా రాజ్ సార్ భార్య ఇలాంటి చీరలు ఎందుకు కట్టుకుంటుంది అంటూ వేళాకోళంగా మాట్లాడుతారు. అవి చూసి బయటికి వచ్చినా రాజ్ సెక్యూరిటీ వాళ్ళ మీద కోప్పడతాడు. మర్యాదగా మాట్లాడమంటూ హెచ్చరిస్తాడు. రోజంతా ఎండలోనే ఉండి డ్యూటీ చేయమని పనిష్ చేస్తాడు.
కావ్యని తనతో పాటు రమ్మని కారులో ఎక్కించుకొని బయటికి తీసుకువెళ్తాడు. ఎక్కడికి అని అడిగిన వినిపించుకోడు. చెప్తే గాని రావా అంటూ కేకలు వేస్తాడు. ఇక తప్పదని కారులో బయలుదేరుతుంది కావ్య. కార్ లో డ్రైవర్ అమ్మగారు మీకోసం క్యారేజ్ తీసుకొచ్చారు అని చెప్తాడు. తను చేసిన ఉప్మా పెసరట్టు గురించి వర్ణించి చెప్తుంది కావ్య. అసలే ఆకలి మీద ఉన్న రాజ్ టెంప్ట్ అవుతూ ఉంటాడు.
బట్టల షాపు ముందు డ్రైవర్ కార్ ఆపుతాడు. డ్రైవర్ని కార్ పార్క్ చేసి రమ్మని కావ్య తో పాటు బయలుదేరుతాడు రాజ్. అప్పుడే పూలు కొనుక్కోమంటూ ఒక ఆవిడ వస్తుంది. అక్కర్లేదు అంటాడు రాజ్. ఇంత అందమైన పెళ్ళానికి పువ్వులు కొని ఇవ్వకపోవడం ఏమిటి అంటుంది పూలావిడ. అప్పటికే చిరాకు మీద ఉన్న రాజ్ ఈవిడ నా భార్య కాదు అసలు నాకు పెళ్లి కాలేదు అంటాడు.
కావ్యని తనతో పాటు షాప్ లోకి రమ్మంటే మీ భార్యని కాదన్నారు కదా నేను రాను అంటుంది. బలవంతంగా ఆమె చేయి పట్టుకొని లాక్కొస్తాడు రాజ్. అది చూసిన ఒక కానిస్టేబుల్ ఏం చేస్తున్నావు నడిరోడ్డు మీద ఒక ఆడపిల్ల చేయి పట్టుకుంటావా అంటూ మందలిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తను నా భార్య అని చెప్పుకుంటాడు రాజ్. ఆ ముక్క ఆవిడని చెప్పమను అంటాడు కానిస్టేబుల్. కావ్య ని చెప్పు అంటాడు రాజ్.
ఇందాక మీ భార్యని కాదు పొమ్మన్నారు కదా ఇప్పుడు నాకు సారీ చెప్పండి అప్పుడే నిజం ఒప్పుకుంటాను అంటుంది కావ్య. ఇక తప్పించుకోలేక కావ్యకి సారీ చెప్తాడు రాజ్. ఆ మాటలకి సంతోషించిన కావ్య ఆయన నా భర్త అని ఒప్పుకుంటుంది. కానిస్టేబుల్ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో రాజ్ వాళ్ళు బట్టల షాప్ లోకి వెళ్తారు. మీ అమ్మగారికి చీరలు కొంటారా అంటుంది కావ్య.
కాదు నీకే అంటాడు రాజ్. నాకా అంటూ షాక్ అవుతుంది కావ్య. ఆమె కేకలకి అందరూ ఆమె వైపు చూస్తారు. అరవొద్దు అంటూ కోప్పడతాడు రాజ్. కావ్య చీరలు సెలెక్ట్ చేస్తుంటే అందులో ఒక చీర రాజ్ కి బాగా నచ్చుతుంది. ఆ చీరని సేల్స్ విమెన్ కావ్యకి కట్టి చూపిస్తుంది. కావ్య అందానికి మెస్మరైజ్ అయిపోతాడు రాజ్. కావ్య చీరలకి బిల్ కడుతూ బయటికి వచ్చినప్పుడు ఇలాంటి చీరలే కట్టుకో రిచ్ గా కనబడాలి అంటాడు.అప్పుడు రాజ్ చీరలు ఎందుకు కొన్నాడో అర్థం చేసుకుంటుంది కావ్య.
మరోవైపు అదే సమయానికి స్వప్న అక్కడికి వస్తుంది. రాహుల్ కూడా కారులో వస్తూ ఉంటాడు. రాహుల్, స్వప్న షాప్ నుంచి బయటికి వస్తున్న రాజ్ వాళ్లని చూస్తారు కానీ వాళ్ళు స్వప్న వాళ్ళని గమనించరు. తరువాయి భాగంలో మన పెళ్లి జరగదు మా ఇంట్లో మన గురించి మీ చెల్లెలు చాలా బాడ్ గా చెప్పింది అసలు శత్రువు ఎవరో కాదు మీ చెల్లెలే అంటూ స్వప్నని పొల్యూట్ చేస్తాడు రాహుల్. ఆటోలో వెళ్తున్న కావ్య వీళ్ళిద్దరిని చూస్తుంది.