- Home
- Entertainment
- Brahmamudi: కావ్య, కళ్యాణ్ లను సేవ్ చేసిన రాజ్.. కృష్ణమూర్తికి వార్నింగ్ ఇచ్చిన సేటు?
Brahmamudi: కావ్య, కళ్యాణ్ లను సేవ్ చేసిన రాజ్.. కృష్ణమూర్తికి వార్నింగ్ ఇచ్చిన సేటు?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ టీఆర్పి ని సంపాదించుకుంటుంది. ఓకే ఇంటికి కోడళ్ళుగా వచ్చిన భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు అక్కచెల్లెళ్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 12 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాజ్ దగ్గరికి డిజైనర్ డిజైన్స్ తీసుకొని వస్తుంది. ఆ డిజైన్స్ చూసిన రాజ్ ఫ్రెస్టేట్ అవుతాడు. అసలు నీకు ఏమైంది ఒకసారి అద్భుతంగా వేస్తావు ఇంకొకసారి పిచ్చిపిచ్చి డిజైన్స్ వేస్తావు. మొన్న డిజైన్స్ వేసింది నువ్వేనా అని అనుమానంగా ఉంది అంటాడు రాజ్. నేనే వేసాను సార్ అంటుంది డిజైనర్. మరి ఆ టాలెంట్ ఇప్పుడేమైంది నెక్స్ట్ వీక్ మనం ఈ డిజైన్స్ అన్నింటిని మ్యానుఫ్యాక్చరింగ్ కి పంపించాలి కాబట్టి నన్ను టెన్షన్ పెట్టకుండా ఆ పని పూర్తి చేయు.
టైం సరిపోకపోతే నీకు అసిస్టెంట్ గా ఎవరినైనా పెట్టుకో అని చెప్తాడు. ఇంతలో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావటంతో డిజైనర్ని అక్కడ నుంచి పంపించేసి పోలీస్ తో మాట్లాడుతాడు రాజ్. మీ భార్య మీ తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు అని ఎస్ఐ చెప్పడంతో మళ్లీ ఈ తింగరిది ఏం చేసిందో అనుకుంటూ స్టేషన్ కి పరిగెడతాడు రాజ్. సీన్ కట్ చేస్తే అపర్ణ చిట్టి ధాన్యలక్ష్మి టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న రిమోట్ తీసుకొని చానల్స్ మారుస్తూ ఉంటుంది.
ఎందుకు అలా చేస్తున్నావు అంటుంది చిట్టి. నిలకడ లేని మనిషి అత్తయ్య అంటుంది అపర్ణ. అలాగే అనండి నా భర్త సరిగ్గా ఉంటే మీరందరూ ఇలా అనేవారా అంటుంది స్వప్న. ఒకసారి పడకగదిని హాల్ వరకు తీసుకొచ్చావు ఇప్పుడు పడకనే హాల్లోకి తీసుకొస్తున్నావా అంటూ చిరాకు పడుతుంది అపర్ణ. నాకేమీ మీకు లాగా పెళ్లయి 30 సంవత్సరాల అవ్వలేదు నాకు కూడా సరదాగా ఉంటాయి కదా అంటుంది స్వప్న. ఇప్పుడు నీకు వచ్చిన కష్టమేంటో డైరెక్ట్ గా చెప్పు అంటుంది చిట్టి.
మీరందరూ అసలు మా హనీమూన్ గురించి ఆలోచిస్తున్నారా అంటుంది స్వప్న. ఈ మాటలు అన్నీ విన్న రుద్రాణి హనీమూన్ వెళ్ళటానికి నువ్వేమీ కొత్తగా పెళ్లి చేసుకొని రాలేదు కడుపుతో వచ్చావు అంటూ చిరాగ్గా మాట్లాడుతుంది. అందుకు కారణం మీ అబ్బాయి ఏ కదా అయినా ఎన్ని కబుర్లు చెప్పాడు. గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ అన్నాడు ఫారెన్ లో ఫస్ట్ నైట్ అన్నాడు అంటుంది స్వప్న. అవన్నీ నమ్మేసి నిన్ను నువ్వు అర్పించుకున్నావా అంటుంది అపర్ణ.
అయినా దానివల్ల నీకు న్యాయమే జరిగింది కదా ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు నువ్వు కడుపుతో ఉన్న విషయం మర్చిపోయానట్లుగా ఉన్నావు ముందు పండంటి బిడ్డ నీకు అను తర్వాత నేనే ఫారిన్ పంపిస్తాను అని చిట్టి సర్ది చెప్తుంది. బయటికి సరే అని చెప్పినా స్వప్న మనసులో మాత్రం లేని కడుపు కోసం సరదాలని వదులుకోవాల్సి వస్తుంది అని బాధపడుతుంది. మరోవైపు పోలీస్ స్టేషన్ కి వచ్చిన రాజ్ విషయం తెలుసుకుని ఎస్ఐ గారితో మాట్లాడటానికి వెళ్తాడు రాజ్.
మీ ఆవిడ నన్ను చెప్పుకోలేని ప్లేస్ లో గుద్దేసింది నేను వదిలిపెట్టను అంటాడు ఎస్సై. ఎంతోకొంత అమౌంట్ ఇస్తాను అంటాడు రాజ్. కుదరదు నా సీట్లో నన్ను కూర్చొనియకుండా చెప్పుకోలేని ప్లేస్ లో గుద్దేసింది అంటాడు ఎస్సై. మమ్మల్ని ఎలాగైనా కాపాడు అంటూ కళ్యాణ్, కావ్య ఇద్దరు రాజ్ ని రిక్వెస్ట్ చేస్తారు. రాజ్ కమిషనర్ తో మాట్లాడి ఎస్ఐకి చెప్పి ఒప్పించి మరీ భార్యని తమ్ముడిని విడిపించుకుని వస్తాడు. మరోవైపు చేతిలో డబ్బులు లేనప్పుడు ఈ సూడిదలు అవి ఎందుకు కనకం ఎప్పుడు ఇలాగే చేస్తుంది అని పెద్దమ్మ తో చెప్తుంది అప్పు.
పేగు బంధం కదా అప్పు.. వదులుకోలేము. రేపు నీకు పెళ్లి అయ్యి పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది అంటుంది పెద్దమ్మ. అది సరే పెద్దమ్మ ఇప్పుడు డబ్బులు ఎలాగా అంటుంది అప్పు. ఇంతలో కనుక ఉండి తెచ్చి ఇందులో బోలెడు డబ్బులు ఉన్నాయి అని పగలగొడుతుంది తీరా చూస్తే అందులో చిల్లర డబ్బులు మాత్రమే ఉంటాయి. అది చూసి వేళాకోళం ఆడుతుంది అప్పు. ఇంతలోనే ఒక కస్టమర్ వచ్చి పదివేల రూపాయలు ఇచ్చి ఒక బొమ్మ తీసుకువెళ్తాడు.
సూడుదలకి సరిపోతాయి అనుకొని ఆనందంతో డాన్స్ వేస్తుంది కనకం. ఇంతలో అప్పుల వాళ్ళు వచ్చి ఆ డబ్బులు వసూలు చేసి తీసుకొని వెళ్ళిపోతారు. చేతిలో 500 మాత్రం మిగులుతాయి. ఇది మాత్రం నేనేం చేసుకుంటాను పెద్దమ్మకి దగ్గు మందు తే అని చెప్పి కూతురికి చెప్పి మళ్ళీ చిల్లర లెక్కపెట్టుకుంటూ ఉంటుంది కనకం. తల్లి ప్రవర్తనకి చిరాకు పడుతుంది అప్పు. మరోవైపు పోలీస్ స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వేరే ప్లేసులు ఉంటాయి.
ఇలా మెయిన్ రోడ్డు మీద ఎవరు నేర్చుకోరు అయినా అతనికి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది అని భార్యని తమ్ముడిని మందలిస్తాడు రాజ్. తరువాయి భాగంలో ఫోన్లో తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది కావ్య. ఇంతలో కృష్ణమూర్తి దగ్గరికి వచ్చిన సేటు తీసుకున్న అప్పుకి రేపటికల్లా బాకీ కట్టమని లేకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటానని వార్నింగ్ ఇస్తాడు. ఫోన్ లోంచి ఆ మాటలు విన్న కావ్య షాక్ అవుతుంది.