- Home
- Entertainment
- Brahmamudi: నిప్పు పెట్టి ఆనందిస్తున్న తల్లి, కొడుకులు.. భార్యను పుట్టింటికి వెళ్లమని గెంటేసిన రాజ్?
Brahmamudi: నిప్పు పెట్టి ఆనందిస్తున్న తల్లి, కొడుకులు.. భార్యను పుట్టింటికి వెళ్లమని గెంటేసిన రాజ్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్ తో టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. కొడుకుని, కోడల్ని కలవనీయకుండా చేస్తున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 19 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నీ కొడుకుని నీ కంట్రోల్ లోకి తెచ్చుకోకపోతే ఇలా చూస్తూ ఉండడం తప్పితే మరేమి చేయలేవు. నీ స్థానం లాక్కొని నిన్ను ఒక మూలన కూర్చోబెడుతుంది అంటూ ఆపర్ణని రెచ్చగొడుతుంది రుద్రాణి. కోపంతో రెచ్చిపోయిన అపర్ణ కొడుక్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని ఆర్డర్ వేస్తుంది. వదిన కోపం చూస్తుంటే కావ్య పీక మీద కాలు వేసి తొక్కేసేలా ఉంది.
అయినా మనం వచ్చిన పని అయిపోయింది అనుకుంటూ కామ్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి. సీన్ కట్ చేస్తే ఇంటికి వచ్చిన కావ్యని మెట్ల దగ్గరే ఆపుతుంది అపర్ణ. ఈరోజు ఏం తప్పు చేశాను అని అడుగుతుంది కావ్య. ఏం చేసావో నీకు తెలియదా మీ ఇంటికి వెళ్లి నువ్వు ఏం చేసుకుంటావో నాకు అనవసరం అంతేకానీ నా కొడుకుని మీ కుటుంబంలో కలిపేసుకుని పని వాడిని చేసి మట్టిని తొక్కిస్తానంటే నేను ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ.
అప్పుడు కావ్య రుద్రాణి వైపు రాహుల్ వైపు చూస్తుంది. వాళ్ళ మొహంలో ఆనందం చూసి వాళ్లే ఈ పని చేశారని గ్రహిస్తుంది. అంటే మా ఇంటి మీద నిగా పెట్టారనమాట. అయినా అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి ఎలా తెలుస్తుంది. మీడియా వాళ్లకి మా ఇంటి గురించి తప్పితే వేరే న్యూస్లు ఏమి ఉండవా? ఇదంతా మీరు చేస్తున్న పనే మా అత్తగారిని రెచ్చగొట్టి మా మధ్య చిచ్చు పెట్టి వినోదం చూస్తున్నారు అంటూ రాహుల్తో కలిపి రుద్రాణి పై కేకలు వేస్తుంది కావ్య.
మధ్యలో నేనేం చేశాను అయినా ఇంటి అల్లుడు చేత మట్టితొక్కించటానికి వాడేమైనా సాధారణమైన మనిషా..దుగ్గిరాల వారసుడు, మహారాజు బిడ్డ అంటుంది రుద్రాణి. అయినా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయే అంత అమాయకురాలని కాదు. అయినా మా వాడితో మట్టి తొక్కించి మీ స్థాయికి దిగజార్చేస్తున్నావు అంటూ కోప్పడుతుంది అపర్ణ. అసలు ఏంటి మీ సమస్య? డిజైన్స్ వేసి మా ఇంటికి డబ్బు పంపిస్తాను అంటే తప్పు.. మా ఇంటికి వెళ్లి మా నాన్నగారికి సాయం చేసి వస్తుంటే రోజు ఇదొక గోల. అయినా మీకు భయం మీ కొడుకు నన్ను భార్యగా ఎక్కడ ఒప్పుకుంటాడో అని..
మేమిద్దరం ఎక్కడ కలిసిపోతామేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. అసలు మీరు ఆయనకి కన్న తల్లేనా అంటూ కావ్య కూడా గట్టిగానే మాట్లాడుతుంది. ఏమన్నావ్ అంటూ కావ్య ని కొట్టడానికి చెయ్యెత్తుతాడు రాజ్. మరోవైపు వర్షం కమ్ముకొని వస్తుంటే గబగబా బొమ్మలు తీసి ఇంట్లో పెడుతూ ఉంటాడు కృష్ణమూర్తి. కనకాన్ని పిలిచి త్వరగా రా బొమ్మలు లోపలి పెట్టు లేదంటే వర్షానికి తడిచిపోతే రంగులు వెలిసిపోతాయి అని చెప్పటంతో కనకం కంగారుగా బొమ్మలు తీసి లోపలి పెడుతుంటే ఒక బొమ్మ పగిలిపోతుంది.
అది అపశకునం గా భావిస్తుంది కనకం. ఏమి కాదులే పొరపాటున చేయి జారింది అంటూ ధైర్యం చెప్తాడు కృష్ణమూర్తి. సీన్ కట్ చేస్తే మా అమ్మని అంత మాట అంటావా నీకు అంత స్థాయి ఉందా.. అయినా నువ్వు ఈ ఇంట్లో ఉండడం మా అమ్మకే కాదు నాకు కూడా ఇష్టం లేదు అని కావ్యని ఇంట్లోంచి బయటికి గెంటేసి తలుపులు వేసేస్తాడు రాజ్. నువ్వైనా చెప్పు బావ. మనవడు ఆవేశంలో ఉన్నాడు అంటుంది చిట్టి. నీ పెద్దరికం పోయింది ఇక నా పెద్దరికం కూడా పోగొట్టుకోమంటావా అంటూ బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సీతారామయ్య.
ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు అంటుంది కావ్య. నీ పుట్టింటికి వెళ్ళు అంటాడు రాజ్. ఇదే నా ఇల్లు ఇప్పుడు నేను పుట్టింటికి వెళ్లి ఆ ఇంటికి, ఈ ఇంటికి కూడా మచ్చ తీసుకురాలేదు నేను ఇక్కడే ఉంటాను అంటూ అక్కడే నుంచుంటుంది కావ్య. ఇంట్లో ఇంత గొడవ జరుగుతున్నందుకు తల్లి కొడుకులు ఆనందపడతారు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. బయట బోరున వర్షం పడుతుంది. రాజ్ దగ్గరికి వచ్చిన కళ్యాణ్ నువ్వు తప్పు చేసావ్ అన్నయ్య.
వదిన తప్పు చేసింది అనిపిస్తే ఒక భర్తగా మందలించు అంతేకానీ అలా బయటికి గెంటయ్యకు. అది మహా పాపం అంటాడు కళ్యాణ్. నీకు అంత బాధగా అనిపిస్తే వెళ్లి పుట్టింట్లో దింపి రా అంటాడు రాజ్. నేను ఆనాటి లక్ష్మణుడిని కాదు. నేను అలా చేయలేను. నాకు అంత గుండె ధైర్యం లేదు అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. తరువాయి భాగంలో కావ్య తల్లిదండ్రులు కావ్య ఇంటికి వస్తారు. వర్షంలో తడుస్తున్న కావ్యని చూసి నీకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా అంటూ ఆవేశంగా ఇంటి తలుపులు తీస్తారు.