Brahmamudi: కావ్య మీద నింద వేసిన రాహుల్.. నిజం తెలుసంటూ షాకిచ్చిన రాజ్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ అని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. తన మీద పడ్డ అపవాదుని చెరిపేసుకొని భర్త కళ్ళు తెరిపించిన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఎందుకు ఇంత ద్రోహం చేశావు నాతో పాటు పెరిగి పెద్దయిన వాడివి ఇలా చేయాలని ఎందుకు అనిపించింది. నేను నా కుటుంబం నీకు ఏం ద్రోహం చేసాము అంటూ నిలదీస్తాడు రాజ్. ఆరోజు నన్ను బెదిరించావు కానీ ఈరోజు దొరికిపోయావు నిజం చెప్పి తీరాల్సిందే అంటుంది కావ్య. ఆ మాటలకి షాక్ అవుతాడు రాజ్. స్వప్నని నువ్వు లేవ తీసుకెళ్లిపోయి ఆ నేరాన్ని కావ్య మీద తోసేసావు.
నా భార్య మాటలు కాకుండా నీ మాటలు నమ్మినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అంటాడు రాజ్. మరోవైపు కూతురిని అలాంటి పెంపకం పెంచారు ఆరోజు పెద్ద కూతురు అలాగా ఈరోజు చిన్న కూతురు ఇలాగా అంటూ కోపంతో చిందులు తొక్కుతుంది అపర్ణ. మీరు అన్న మాట నిజమే కానీ కావ్య బలమైన కారణం లేకుండా బయటకు వెళ్ళదు అంటాడు కృష్ణమూర్తి.
కుటుంబాన్ని కంట్రోల్లో పెట్టకుండా కూతుర్లని ఇష్టం వచ్చినట్లు మా ఇంటి మీద వదిలేసావు అంటూ కృష్ణమూర్తిని తిడుతుంది అపర్ణ. ఏం మాట్లాడుతున్నావు వెళ్ళిపోయింది కావ్య ఒక్కతే కాదు నీ కొడుకు కూడా.. ఏం పెంపకం పెంచావు అని వాళ్ళు నిన్ను అడిగితే ఏం చేస్తావు అంటూ భార్యని మందలిస్తాడు సుభాష్. జరిగింది చాలు ఇంక బయలుదేరండి అంటుంది అపర్ణ.
కనకం చేతులు జోడించి అలా చేయకండి అసలే ఆడపిల్ల తాళిబొట్టు తీసి పసుపు తాడుతో ఉంది కార్యక్రమాన్ని మధ్యలో ఆపొద్దు అంటూ బ్రతిమాలుకుంటుంది. చిట్టి, ధాన్యలక్ష్మి వాళ్ళు కూడా అపర్ణని కాసేపు వెయిట్ చేద్దాం అంటూ ఒప్పిస్తారు. మరోవైపు నిజం చెప్పమంటూ రాహుల్ ని నిలదీస్తాడు రాజ్. ఇంకేం మాట్లాడుతాడు అడ్డంగా దొరికిపోయిన తర్వాత తప్పు ఒప్పుకొని తీరాల్సిందే అంటుంది కావ్య.
నువ్వు మధ్యలో మాట్లాడొద్దు నోరు ముయ్ అంటాడు రాహుల్. నోరు ముయ్యమనటమేంటి.. మొహం పగిలిపోద్ది ఇప్పుడు తనకి మాట్లాడే హక్కు ఉంది ఇది నీకు నాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు తనకి తన అక్కకి కూడా సంబంధించిన విషయం. అయినా తను నా భార్య అంటాడు రాజ్. మీరిద్దరూ ఒకటైపోయారని నాకు బాగా అర్థమైంది నాకు కావలసింది కూడా అదే.
అయినా చిన్నప్పటినుంచి నీతో పాటు పెరిగిన నన్ను అపార్థం చేసుకున్నావు అదే నాకు చాలా కష్టంగా ఉంది. నిజానికి స్వప్న ఇక్కడికి ఎందుకు రమ్మందో నాకు తెలియదు కావాలంటే కాల్ లిస్ట్ చూడు తనే చాలాసార్లు ఫోన్ చేసింది అంటూ మాట మార్చేస్తాడు రాహుల్. కాల్ లిస్ట్ చూసిన రాజ్ నిజమే తనే ఫోన్ చేసింది అయినా ఎంతమంది ఉండగా నీకు మాత్రమే ఎందుకు చేసింది అయినా నువ్వు ఎందుకు ఈ విషయం నాకు చెప్పలేదు అంటూ నిలదీస్తాడు రాజ్.
ఆ విషయం కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను ఏ కష్టంలో ఉందో ఏమో అనుకున్నాను. నీ భార్య నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు తన అక్క నన్ను ట్రాప్ చేయాలని చూస్తుందేమో అంటూ ప్లేట్ ఫిరాయించేస్తాడు రాహుల్. ఆ మాటలకి కోపంతో రగిలిపోయిన కావ్య రాహుల్ ని కొట్టటానికి చెయ్యెత్తుతుంది. ఆ చేతిని అడ్డుకుంటాడు రాజ్. మరోవైపు కావ్య వాళ్ళు ఇంకా రాకపోవడంతో అసహనానికి గురవుతుంది అపర్ణ.
ఫంక్షన్ మధ్యలో నుంచి వెళ్లిపోవడం మీ వంశాచారమా ఎలాంటి కూతుర్లని కన్నారు అంటూ ఈసడించుకుంటుంది. అమ్మాయితో పాటు మీ అబ్బాయి కూడా వెళ్ళాడు కదా అంటుంది మీనాక్షి. అంటే తప్పుని మా అబ్బాయి మీదికి నెట్టేస్తున్నారా అంటూ కోప్పడుతుంది మీనాక్షి. ఆవిడ అన్న దాంట్లో తప్పేముంది అంటాడు సుభాష్. వాళ్లు రాకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా లాభం లేదు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అంటాడు కృష్ణమూర్తి.ఆయన చెప్పింది సమంజసం గానే ఉంది అంటూ సమర్థిస్తాడు సీతారామయ్య.
ఈ పెళ్లి జరిగిన దగ్గర నుంచి దరిద్రం మన ఇంటిని పట్టుకొని పీడిస్తుంది అంటూ చిరాకు పడుతుంది అపర్ణ. తరువాయి భాగంలో ఈ అక్క చెల్లెలు ఇద్దరు నిన్ను మానిప్యులేట్ చేయడానికి చూస్తున్నారు అని రాజ్ ని ఏమార్చటానికి ప్రయత్నిస్తాడు రాహుల్. నిజం నాకు తెలుసు అంటూ షాక్ ఇస్తాడు రాజ్. మరోవైపు వేదిక దగ్గరికి వచ్చిన కావ్య వాళ్ళని ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారు అంటూ నిలదీస్తుంది రుద్రాణి. నిజాన్ని మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా అంటుంది కావ్య.