MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గన్‌మెన్స్ తో సెట్‌కి కంగనా రనౌత్‌.. వణికిపోయిన లారెన్స్.. అసలేం జరిగిందంటే..?

గన్‌మెన్స్ తో సెట్‌కి కంగనా రనౌత్‌.. వణికిపోయిన లారెన్స్.. అసలేం జరిగిందంటే..?

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై హీరో రాఘవ లారెన్స్ బోల్డ్ కామెంట్స్ చేశారు. ఆమెని చూస్తే భయమేసిందన్నారు. సెట్‌కి గన్‌మెన్స్ తో వచ్చిందని, దీంతో టెన్షన్‌ పడ్డాడట.

4 Min read
Aithagoni Raju
Published : Aug 26 2023, 08:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీని ఇచ్చింది. ఆమె చేసే బోల్డ్ కామెంట్లతో ఆపద ఉంటుందని భావించి జెట్‌ సెక్యూరిటీని ఇచ్చింది. కానీ ఆ తర్వాత తగ్గించింది. ఇప్పుడు ఆమెకి గన్‌మెన్ల భద్రత ఉంది. అయితే ఆమె తన గన్‌మెంట్లతో సెట్‌కి కూడా వస్తుందట. చిత్రీకరణ సమయంలో సెట్‌లో పక్కనే గన్‌మెంట్లు ఉండే వారట. దీంతో తాను వణికిపోయినట్టు తెలిపారు హీరో రాఘవ లారెన్స్. `చంద్రముఖి2` షూటింగ్‌ సమయంలో కంగనా వచ్చినప్పుడు చాలా టెన్షన్‌ పడ్డానని తెలిపారు. లారెన్స్ చేసిన కామెంట్లు ఆసక్తిని పెంచడంతోపాటు నవ్వులు పూయించాయి. 
 

211

ఇక లారెన్స్, కంగనా రనౌత్‌ కలిసి `చంద్రముఖి 2`లో నటిస్తున్నారు. రజనీకాంత్‌తో `చంద్రముఖి` చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పి వాసు ఈ సినిమాకి కూడా దర్శకత్వ వహించారు. ఇందులో కంగనా టైటిల్‌ రోల్‌ చేసింది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు. సెప్టెంబర్‌ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నైలో ఆడియో ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈవెంట్‌ చేశారు. ఇందులో కంగనా గురించి లారెన్స్ కామెంట్స్ ఆకట్టుకున్నాయి. అంతేకాదు తాను స్టేజ్‌పై ఉన్నంతసేపు నవ్వులు పూయిండమే కాదు, ఫ్యాన్స్ లో జోష్‌ నింపారు, ఈవెంట్‌కి కళ తీసుకొచ్చారు. 
 

311

ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ, పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసే సుభాస్కరన్‌గారు నాతో సినిమా చేస్తారా? అని అనుకున్నాను. కానీ `చంద్ర‌ముఖి 2` వంటి ఓ గొప్ప సినిమాను లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీలా నిర్మించారు. నేను చిన్న సైడ్ డాన్స‌ర్‌గా ఉన్నప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు దర్శకుడు పీ వాసు డైరెక్ట‌ర్‌గా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ‘చంద్రముఖి 2’ను కూడా ఎంతో గొప్ప‌గా తెర‌కెక్కించారు. ఈ సినిమా సాధించే విజ‌యం ఆయ‌న‌కే ద‌క్కుతుంది. 

411

కంగనా ర‌నౌత్‌ ఈ సినిమాలో నటిస్తార‌ని తెలియ‌గానే ఆశ్చ‌ర్య‌పోయాను. ఆమె చాలా బోల్డ్ ప‌ర్స‌న్‌. ఆమె ఎలా ఉంటారోన‌ని టెన్ష‌న్ ప‌డ్డాను. ఆమె సెట్స్‌లోకి గ‌న్‌మెన్స్‌తో స‌హా వ‌చ్చింది. అప్పుడు నాలో ఇంకా భ‌యం పెరిగిపోయింది. త‌ర్వాత నా రిక్వెస్ట్ మేర‌కు ఆమె గ‌న్ మెన్స్‌ను సెట్ బ‌య‌టే ఉంచారు. అప్ప‌టి నుంచి ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయటం ప్రారంభించాను. అద్భుతంగా పాత్ర‌లో ఒదిగిపోయారు. ఇక కీర‌వాణిగారి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. సినిమాటోగ్రాఫ‌ర్ రాజ శేఖ‌ర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ తోట‌త‌ర‌ణి, ఎడిట‌ర్ ఆంటోని స‌హా ఎంటైర్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులతో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేశాం. త‌ప్ప‌కుండా ఈ సినిమా అంద‌రినీ ఎంట‌ర్ టైన్ చేస్తుంది` అని తెలిపారు.
 

511

 కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ , నేను నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్ల‌లో ‘చంద్రముఖి 2’ వంటి గొప్ప సినిమా చేయలేదు. ఇప్పటి వరకు నేను ఎవరినీ అవకాశం ఇవ్వమని అడగలేదు, మొదటిసారి దర్శకుడు పి వాసుని అడిగా.  ఈ సినిమాలో వాసుగారు నా పాత్ర‌తో పాటు ప్ర‌తీ పాత్ర‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించారు. లారెన్స్ మాస్ట‌ర్ చాలా మందికి పెద్ద ఇన్‌స్పిరేష‌న్‌. ఆయ‌న చిన్న డాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు హీరో, ద‌ర్శ‌కుడు రేంజ్‌కు ఎదిగారు.  వ‌డివేలుకి నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న ఈ సినిమాలో త‌న‌దైన స్టైల్లో అంద‌రినీ న‌వ్విస్తారు. కీర‌వాణిగారి గురించి   ప్ర‌పంచమంతా  గొప్ప‌గా మాట్లాడింది. ఆయ‌న‌కు ఆస్కార్ అవార్డ్ వ‌స్తే నాకే వ‌చ్చిన‌ట్లు సంతోష‌ప‌డ్డాను. ఆయ‌న మ్యూజిక్ డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌టం ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఇక సుభాస్క‌ర‌న్‌గారు ఎంతో మంచి వ్య‌క్తి. చాలా ప్యాష‌న్‌తో గొప్ప సినిమాలను నిర్మిస్తున్నారు. ఇది పెద్ద విజయం సాధించాల`న్నారు.
 

611

ఈ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణిని సత్కరించారు. అనంతరం కీరవాణి మాట్లాడుతూ, ఆస్కార్ అవార్డ్ త‌ర్వాత నేను మ్యూజిక్ చేసిన సినిమా `చంద్ర‌ముఖి 2`.ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్ పి.వాసుగారికి థాంక్స్‌. వాసు మంచి డైరెక్ట‌రే కాదు.. మంచి సింగ‌ర్ కూడా. ఆయ‌న‌కు నా నెక్ట్స్ మూవీలో సింగ‌ర్‌గా అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకుంటున్నాను. రాఘ‌వ లారెన్స్ స‌పోర్ట్‌తో మంచి సాంగ్స్ వ‌చ్చాయి. వడివేలు కామెడీనే `చంద్ర‌ముఖి 2` సినిమాకు పెద్ద హైలైట్‌. కంగ‌నా ర‌నౌత్ నా ఫేవ‌రేట్ ఆర్టిస్ట్‌. ఆమెతో క‌లిసి వ‌ర్క్ చేయటం హ్య‌పీగా ఉంది` అని చెప్పారు.

711

డైరెక్ట‌ర్ పి.వాసు మాట్లాడుతూ, డైరెక్ట‌ర్‌గా ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌తో పోటీ ప‌డాల‌నే ఆలోచిస్తుంటాను. ఆ కోణంలో ఆలోచించే `చంద్ర‌ముఖి 2`ను రూపొందించాను. లైకా ప్రొడ‌క్ష‌న్స్ అంటేనే అద్భుతం. బ్ర‌హ్మాండ‌మైన సినిమాల‌ను నిర్మించారు. సుభాస్క‌ర‌న్‌ త‌మిళ చిత్ర సీమ‌కు దొరికిన గొప్ప నిధి. ఓ టెక్నీషియ‌న్‌గా నా జ‌ర్నీ ప్రారంభ‌మై నాలుగు ద‌శాబ్దాలు అయిన విష‌యం మీరు చెప్పేంత వ‌ర‌కు నాకు తెలియ‌లేదు. ద‌ర్శ‌కుడిగా నేను చేసిన‌ ప్ర‌యాణంలో నాకు త‌మ స‌పోర్ట్ అందించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు, న‌టుడిగా న‌న్ను ఆద‌రించిన వారికి ధ‌న్య‌వాదాలు. 
 

811

`చంద్ర‌ముఖి 2`ని లారెన్స్‌తో చేస్తున్నామ‌ని ర‌జినీకాంత్‌కి చెప్ప‌గానే సినిమా గొప్ప విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఆయ‌న అన్నారు.  క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసిన త‌ర్వాత పూర్తి క‌థ‌ను ముందుగా విన్న‌ది వ‌డివేలుగారే. ఆయ‌న‌కు వెంట‌నే న‌చ్చింది. ఆయ‌న‌లాంటి కమెడియ‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. న‌వ్వించి మ‌న బాధ‌ల‌ను తొల‌గించే డాక్ట‌ర్ ఆయ‌న‌. కీర‌వాణి ఆస్కార్ సాధించి ప్ర‌పంచం అంత త‌న‌వైపు తిరిగేలా చేసుకున్నారు. అయితే త‌ను మాత్రం చాలా నెమ్మ‌దిగా త‌న పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ సినిమాకు ఆయ‌న మ్యూజిక్ పెద్ద ఎసెట్. 
 

911

సినిమా అంతా ఓకే అయ్యింది కానీ, చంద్ర‌ముఖి పాత్ర‌కు ఎవ‌రికీ తీసుకోవాలా? అని అర్థం కాలేదు. ఆ స‌మ‌యంలో కంగ‌నా ఓ క‌థ చెబుదామ‌ని వెళ్లిన‌ప్పుడు ఆమె `చంద్ర‌ముఖి 2` గురించి అడిగారు. ఆ పాత్ర‌లో ఎవ‌రు నటిస్తున్నార‌ని అన్నారు? ఇంకా ఎవ‌రినీ తీసుకోలేద‌ని చెప్ప‌గానే.. మీకు అభ్యంత‌రం లేక‌పోతే నేను న‌టిస్తాను అని అన‌గానే నా ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. ఆమె ఆ పాత్ర‌ను అంత గొప్ప‌గా చేసింది. ఇక లారెన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఆయ‌న రెండు డైమ‌న్ష‌న్స్‌లో అద్భుతంగా న‌టించారు. ఈ సినిమా ప్ర‌యాణంలో స‌పోర్ట్‌గా నిలిచిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్య‌వాదాలు` అని అన్నారు.
 

1011

ఇక `చంద్రముఖి2` ఈవెంట్‌లో వడివేలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన స్టేజ్‌పైకి రాగానే అభిమానులు అరుపులు, ఈలలతో హోరెత్తించారు. దీంతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా కమెడియన్‌ వడివేలు మాట్లాడుతూ, నేను ఈ మ‌ధ్య కాలం సినిమా రంగానికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు మ‌ళ్లీ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాను. `మామ‌న్న‌న్` సినిమా త‌ర్వాత `చంద్ర‌ముఖి 2` సినిమాతో అల‌రించ‌బోతున్నాను. కంగ‌నా ర‌నౌత్‌ అద్భుతంగా న‌టించారు` అని తెలిపారు.

1111

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్‌.డి.రాజశేఖ‌ర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ తోట త‌ర‌ణి, స‌హా మ‌హిమ‌, సృష్టి త‌దిత‌రులు `చంద్ర‌ముఖి 2` పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరారు. ఇందులో దర్శకుడు పి వాసుని కూడా సన్మానించారు.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Recommended image2
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Recommended image3
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved