- Home
- Entertainment
- చీరకట్టులో రాశీ ఖన్నా సింగారం.. రెట్టింపు అందంతో అట్రాక్ట్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ..
చీరకట్టులో రాశీ ఖన్నా సింగారం.. రెట్టింపు అందంతో అట్రాక్ట్ చేస్తున్న గ్లామర్ బ్యూటీ..
టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా (Raashi Khanna) నయా అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ వేర్ లో అందానికే అసూయ పుట్టేలా చేసింది రాశీ ఖన్నా.. చీరకట్టులో ఆకట్టుకుంటోంది.

ఢిల్లీ భామా రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ మూవీల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
తెలుగులో తను నటించిన ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) మూవీ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేశాడు. గోపీచంద్ (Gopichand) ప్రధాన పాత్రలో నటించారు. రాశీఖన్నా హీరోయిన్ గా అందాలు ఆరబోసింది.
ఈ చిత్రంతో అటు గోపీచంద్, ఇటు రాశీఖన్నా ఎలాగైనా హిట్ కొట్టాలనే హోప్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాఖీ ఖన్నా మరియు గోపీచంద్ కూడా ‘పక్కా కమర్షియల్’లో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.
రెండ్రోజుల కింద పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల శిల్పాకలా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవిగా కూడా హాజరై సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గోపీచంద్, మారుతీ, చిత్ర మేకర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
అయితే ఈ మెగా మ్యాచో ఈవెంట్ కు అందాల హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) చీరకట్టులో హాజరై ఆకట్టుకుంది. పింక్ శారీలో రాశీ ఈవెంట్ కు అట్రాక్షన్ గా నిలిచింది. తాజాగా ఆ పిక్స్ ను తన అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది. పిక్స్ ను నెటిజన్లు, అభిమానులు లైక్ లు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.
మరోవైపు రాశీ ఖన్నా గతం కన్నా ప్రస్తుతం మరింత గ్లామర్ గా కనిపిస్తోంది. టాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నా.. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతోంది.