Rashmika Mandanna : బ్లాక్ శారీలో నేషనల్ క్రష్ ఒంపుసొంపులు.. అందానికి మరోపేరే రష్మిక మందన్న..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నెక్ట్స్ ‘యానిమల్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. వారంపదిరోజుల్లో సినిమా రిలీజ్ కానుండటంతో నెట్టింట యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (RashmikaMandanna) మొన్నటి వరకు వరుస ప్రాజెక్ట్స్ తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. సౌత్ తో పాటు నార్త్ లోనూ ఈ ముద్దుగుమ్మ హవా చూపించింది. హిందీ చిత్రాలతోనూ అలరించింది. ‘పుష్ప’ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత క్రేజ్ సొంతం చేసుకుంది.
అన్ని భాషల్లో సినిమా అవకాశాలను దక్కించుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. అలాగే ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ నేషనల్ క్రష్ గానూ మారింది. ప్రస్తుతం రష్మిక మందన్న తన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టింది.
మరో పదిరోజుల్లో హిందీలో స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) సరసన ‘యానిమల్’ (Animal) లో నటించిన విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 23న ట్రైలర్ వస్తోంది.
ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించారు. రన్బీర్, సందీప్, రష్మిక కలిసి సినిమాను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రష్మిక తనవంతుగా సోషల్ మీడియాలోనూ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ గా ఫోస్టులు పెడుతూ వస్తోంది.
నేషనల్ క్రష్ తాజాగా చీరకట్టులో పద్ధతిగా మెరిసింది. బ్లాక్ ట్రాన్స్ ఫరెంట్ శారీలో రష్మిక మందన్న మైండ్ బ్లోయింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మత్తెక్కించే ఫోజులతో ఈ ముద్దుగుమ్మ మతులు పోగొట్టింది. కుర్రాళ్లను చూపు తిప్పుకోకుండా చేసింది. చాలా రోజుల తర్వాత క్లాస్ లుక్ లో మెరిసి కట్టిపడేసింది.
అటు ‘పుష్ప2’, ‘రెయిన్ బో’ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇక ఇటీవల రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రష్మికకు సినీ ప్రముకులు, సెలెబ్రెటీలు, పొలిటికల్ లీడర్లు కూడా స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలిచారు.