పుష్ప 2 టికెట్ రేట్లపై హైకోర్టులో పిటిషన్
‘పుష్ప 2’ టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ధరలు పెంపుపై కోర్టు కల్పించుకోవాలని పిటిషనర్ కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చాయి.
Pushpa 2, Telangana High Court, allu arjun, ticket rates
అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప2’ టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేసాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
‘పుష్ప2’ ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో విడుదలకానుంది. ‘‘అత్యధిక థియేటర్లలో ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్ యాప్ సహాయంతో ఏ భాషలోనైనా ఈ సినిమాని ఆస్వాదించే అవకాశం ఉంది’’ అని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపధ్యంలో తెలంగాణా లో పెంచిన టిక్కెట్ల రేట్లపై కోర్టులో కేసు నమోదు అయ్యింది.
Pushpa 2, allu arjun, sukumar, OTT Release
తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలు (pushpa 2 ticket price) పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచింది.
ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్ ధరకు అదనంగా రూ.800 చెల్లించాల్సిందే. ఈ పెంపుతో సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా అవుతోంది.
allu arjun movie Pushpa 2 The Rule
అలాగే అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అదనపు షోలకు కూడా అనుమతి ఇచ్చారు. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
pushpa 2
అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా టిక్కెట్ రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా ధరలు పెంపుపై కోర్టు కల్పించుకోవాలని.. సామాన్యుడికి అందుబాటులోకి వినోదం తీసుకురావాలని పిటిషనర్ తన ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఈ రోజు (మంగళవారం) విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పిటిషన్ దాఖలవడంతో పుష్ప 2 ది రూల్ చిత్ర టీమ్ షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది.
allu arjun movie Pushpa 2 The Rule
మరో ప్రక్క ఆంధ్ర ప్రదేశ్ లోనూ టిక్కెట్ రేట్లు పెంపుపై జీవో ఇచ్చారు. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇచ్చింది. రాత్రి 9.30 షోకు టికెట్ ధరను రూ.800గా నిర్ణయించారు (జీఎస్టీ అదనం). ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే రూ.800+GST చెల్లించాల్సిందే. (Pushpa2 Ticket Rates)