MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప 2 క్రేజ్: లేడీస్ స్పెషల్ షోలు!..ఏ హీరో సినిమాకు ఇలా లేదు

పుష్ప 2 క్రేజ్: లేడీస్ స్పెషల్ షోలు!..ఏ హీరో సినిమాకు ఇలా లేదు

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం కేరళలో విడుదలకు ముందే భారీ క్రేజ్‌ను సృష్టిస్తోంది. 55 ఫ్యాన్ షోలతో పాటు, మహిళా అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ బీహార్‌లో ప్రారంభం కానున్నాయి.

2 Min read
Author : Surya Prakash
Published : Nov 07 2024, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అల్లు అర్జున్ కు తెలుగు ఇండస్ట్రీతో పాటు కేరళలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.  అక్కడ బన్నికి ఎంత క్రేజ్ అంటే తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కేరళలో బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అలాగే అక్కడ బన్నీకి ఉన్న మార్కెట్ మామూలుగా ఉండదు.

అక్కడ ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విన్నూత కార్యక్రమం ప్లాన్ చేస్తూంటారు. ఈ నేపధ్యంలో అక్కడ పుష్ప సినిమాకు ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు. అలాగే రిలీజ్ కూడా మామూలుగా ఉండటం లేదు.

26
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.  ఇదే కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప ది రైజ్‌' సంచలన విజయం సాధించడంతో  ఈ సినిమాకు క్రేజ్ మామూలుగా లేదు.

దాంతో చిత్రం టీమ్ సైతం సినిమా అవుట్ ఫుట్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ  చిత్రంలోని అల్లు అర్జున్‌ మేనరిజం, స్టయిల్‌, సినిమా మేకింగ్‌, సుకుమార్‌ బ్రిలియంట్‌ స్క్రీన్‌ప్లే అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసిన సుకుమార్ ఇప్పుడు ప్రమోషన్, రిలీజ్  పై దృష్టి పెట్టారు. 

36
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


 
కేరళ మీడియా నుంచి అందుతున్న సమాచారం మేరకు...రిలీజ్ కు  ఇంకా నెల రోజుల సమయం ఉన్నా ఇప్పటికే కేరళలో 55 ఫ్యాన్ షోలకు  ప్లాన్ చేసారు. వీటికి టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టేశారు. తెల్లవారుఝామున 4 నుంచి 7 మధ్యలో వరసగా స్క్రీనింగ్ కాబోతున్నాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన షోలు కూడా వేస్తున్నారు.

46
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అక్కడ అమ్మాయిల్లో అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అందుకే కేవలం లేడీ ఫ్యాన్స్ కోసం కొన్ని ప్రీమియర్లు వేస్తున్నారు.  కేవలం అమ్మాయిలు మాత్రమే ఎంజాయ్ చేసే షోలు అవి. కొట్టరక్కారలో ఉన్న మినర్వా ఎంపైర్ థియేటర్లో ఉదయం 7 గంటలకు గర్ల్స్ ఫాన్స్ షో పేరిట ప్రత్యేకంగా ఒక ఆటను ప్రదర్శించబోతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ని బట్టి మరికొన్ని ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

56


డిసెంబరు 5న 'పుష్ప-2' ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఇంకా నెలరోజులు లోపే  ఉంది. ప్రస్తుతం  షూటింగ్ దశలో వున్న ఈ చిత్రం మరో వైపు శరవేగంగా నిర్మాణానంతర పనులను కూడా జరుపుకుంటోంది.   త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

అలాగే పుష్ప 2 చిత్రం మొత్తం 11,500 స్క్రీన్లలో విడుదల కానుంది. సినీ పరిశ్రమ చరిత్రలో ఇదే అతిపెద్ద రికార్డు. పుష్ప2 సినిమా భారతదేశంలో 6000 స్క్రీన్లలో విడుదల కానుంది. అంతే కాకుండా విదేశాల్లో కూడా 5500 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ సైతం భారీగా ప్లాన్ చేసారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ పుష్ప 2 సినిమా క్రేజ్ పెరిగిపోవటమే అందుకు కారణం. ఇక ఈ చిత్రం  ప్రమోషన్స్ ని బీహార్ నుంచి మొదలుపెట్టటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. 

66
Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


నార్త్ ఇండియా మార్కెట్ ని దున్నేయటానికి దర్శకుడు సుకుమార్ కొత్త ప్రమోషన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఫస్ట్   ప్రమోషన్ ఈవెంట్ ని బీహార్ లోని పాట్నాలో  ప్లాన్ చేస్తున్నారు.

చాలా గ్రాండ్ గా అక్కడ ఈ సినిమా  ప్రమోషన్స్ జరగనున్నాయి. బీహార్ లో పుష్ప సినిమా బాగా ఆడటమే అందుకు కారణం. అలాగే నార్త్ లోని మరికొన్ని కీ సెంటర్స్ ని ఎక్సప్లోర్ చేసి కొత్తగా ఈవెంట్స్ చేయబోతున్నారు. ముంబై, డిల్లీ వంటి నగరాలని ప్రక్కన పెట్టబోతున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Cocktail Party: అయ్యప్ప దీక్షలో పార్టీకి చరణ్.. ట్రోలర్స్ నోరు మూయించిన అల్లు శిరీష్
Recommended image2
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image3
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved