డే వన్ ఆల్ ఇండియా హైయెస్ట్ టాప్ 5 గ్రాసర్స్... అన్నీ టాలీవుడ్ చిత్రాలే, అల్లు అర్జున్, ప్రభాస్ ల హవా!
ఇండియన్ బాక్సాఫీస్ టాలీవుడ్ స్టార్స్ షేక్ చేస్తున్నారు. ఫస్ట్ డే టాప్ 5 ఓపెనింగ్ గ్రాస్ రికార్డ్స్ తెలుగు చిత్రాల పేరిట ఉంది. అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 భారీ టార్గెట్ సెట్ చేశాడు.
ఇండియన్ సినిమాను టాలీవుడ్ శాసిస్తుంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ప్రభాస్ తో మొదలైన ఈ ట్రెండ్.. కొనసాగుతుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ బాలీవుడ్ సైతం రాణిస్తున్నారు. తాజాగా పుష్ప 2 తో అల్లు అర్జున్ బాలీవుడ్ పునాదులను కదిలించాడు. ఏకంగా షారుఖ్ ఖాన్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేశాడు. డే వన్ ఆల్ ఇండియా హైయెస్ట్ టాప్ 5 గ్రాసర్స్ టాలీవుడ్ మూవీస్ కావడం విశేషం.
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. సలార్ మూవీ ఫస్ట్ డే రూ. 178 కోట్ల గ్రాస్ రాబట్టింది. పృథ్విరాజ్ సుకుమారన్, శృతి హాసన్ కీలక రోల్స్ చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది.
Kalki 2898 AD
ప్రభాస్ కెరీర్లో మరో అతిపెద్ద హిట్ గా ఉంది కల్కి 2898 AD. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే ఈ మూవీ రూ. 191 కోట్ల గ్రాస్ రాబట్టింది. కమల్ హాసన్, అమితాబ్, దీపికా పదుకొనే, దిశా పటాని వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. కల్కి 2కి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు నాగ్ అశ్విన్.
Bahubali 2
ఇక బాహుబలి 2 ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం 2017లో విడుదలైంది. ఇప్పటికీ బాహుబలి 2 పేరిట ఉన్న అనేక రికార్డ్స్ పదిలంగా ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 218 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. రన్ ముగిసే నాటికి రూ. బాహుబలి 2 రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ వెయ్యి కోట్లు వసూలు చేసిన ఫస్ట్ మూవీ బాహుబలి 2.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మరో విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ ఒకటి. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్ళు ఆర్ ఆర్ ఆర్ రాబట్టింది. ఇక ఫస్ట్ డే ఆర్ ఆర్ ఆర్ రూ. 223 కోట్లు రాబట్టింది. జపాన్ లో కూడా ఈ చిత్రానికి ఆదరణ దక్కించుకుంది.
Pushpa 2
లేటెస్ట్ సెన్సేషన్ పుష్ప 2. హీరో అల్లు అర్జున్ తోటి హీరోలకు భారీ టార్గెట్ సెట్ చేశాడు. పుష్ప 2 వరల్డ్ వైడ్ ఫస్ట్ డే రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టింది. అతిపెద్ద ఇండియన్ ఓపెనింగ్ రికార్డు కైవసం చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప 2 చిత్రానికి ఆదరణ దక్కుతుంది. హిందీలో షారుఖ్ ఖాన్ పేరిట ఉన్న ఫస్ట్ డే హైయెస్ట్ రికార్డును పుష్ప 2 బ్రేక్ చేసింది పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 72 కోట్ల డే వన్ వసూలు చేసింది. మొత్తంగా ఇండియన్ సినిమాను టాలీవుడ్ స్టార్స్ ఏలుతున్నారు..