‘పుష్ప -2’హిందీ భాక్సాఫీస్ : 16% డ్రాప్, అయినా షాకింగ్ రికార్డ్
పుష్ప 2 సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే భారీ వసూళ్లు రాబట్టి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. హిందీ వెర్షన్ రెండు రోజుల్లోనే 130 కోట్లకు పైగా వసూలు చేసి, పుష్ప మొదటి భాగం కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది.
పుష్ప 2 తొలిరోజే భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి సక్సెస్ సాధించింది. స్క్రిప్టు కొద్దిగా వీక్ గా ఉందని అన్నా, పుష్ప గా అల్లు అర్జున్ విశ్వరూపం చూడటానికి జనం క్యూలు కడుతున్నారు.
ప్రీమియర్ షోల నుంచే ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు పుష్ప ఎంత వసూల్ చేసిందనే ఓపినింగ్ వసూళ్లు ఎలాగో వస్తాయి. రెండో రోజు ముఖ్యంగా నార్త్ లో పరిస్దితి ఏమిటనే విషయాలను ట్రేడ్ ఆతృతగా గమనిస్తోంది. కాగా రెండో రోజు వసూళ్లతో పుష్ప 2 హిందీ వెర్షన్ అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టింది.
రెండు రోజుల్లో పుష్ప 2 చిత్రానికి హిందీ భాషలో సుమారు 130 కోట్ల కలెక్షన్ నమోదు అయ్యింది. అయితే రెండవ రోజున కొద్దిగా తగ్గాయి కలెక్షన్స్. డిసెంబర్ 6, శుక్రవారం, రెండవ రోజున చిత్రానికి బాక్సాఫీస్‌లో సుమారు 16% తగ్గుదల నమోదైంది.
రెండవ రోజున, ఈ యాక్షన్ చిత్రం 58-60 కోట్ల మధ్య కలెక్షన్ నమోదు చేసింది. 46.39% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. అయితే హైదరాబాద్, ఇతర తెలుగు రాష్ట్రాలలో సాయంత్రం షోలలో సుమారు 75-78% ఆక్యుపెన్సీ కొనసాగింది.
పుష్పా VS పుష్పా 2 భాక్సాఫీస్
రెండు రోజుల్లో, పుష్పా 2 హిందీ బాక్సాఫీస్‌లో సుమారు 130 కోట్ల కలెక్షన్ సాధించింది. ఇది పుష్పా పార్ట్ 1 యొక్క మొత్తం లైఫ్ టైమ్ కలెక్షన్ కంటే సుమారు 25 కోట్లు ఎక్కువ. అలాగే రెండు రోజుల్లోనే, పుష్ప 2 2024 సంవత్సరంలోని టాప్ 10 అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల జాబితాలో చేరింది.
Pushpa 2
ఫస్ట్ రోజు రికార్డ్ లు
ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన రాజమౌళి చిత్రం ఆర్ఆర్ఆర్ ఇండియాలో తొలి రోజు రూ. 133 కోట్లు వసూల్ చేసింది. అలాగే బాహుబలి రూ. 121కోట్లు, కేజీఎఫ్ రూ. 116 కోట్లు వసూల్ చేశాయి. ఈ రికార్డ్స్ ను ఇప్పుడు పుష్ప బీట్ చేసింది. పుష్ప2 సినిమాను హైదరాబాద్‌లో 1549 షోలు వేశారు. కర్ణాటకలో దాదాపు 1072 షోలు , చెన్నైలో ఈ చిత్రానికి 244 షోలు వేశారు. కాగా తొలి రోజు వసూళ్లు రూ.175 కోట్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ.95.1 కోట్లు, హిందీ నుంచి రూ.67 కోట్లు, తమిళం నుంచి రూ.7 కోట్లు, మలయాళం నుంచి రూ.5 కోట్లు, కన్నడ వెర్షన్ నుంచి రూ.1 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Pushpa 2
ఏదైమైనా "పుష్ప 2" సినిమా ఒక అద్భుతమైన ర్యాంపేజ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. మొదటి భాగం "పుష్ప" తోనే గొప్ప విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్, ఈ చిత్రం ద్వారా మరింత పెరిగిన అభిమానాన్ని పొందారు. రెండవ భాగం "పుష్ప 2" విడుదలైన తొలి రెండు రోజులలోనే, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని, ఫుల్ జోష్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. సినిమా లోని యాక్షన్ సీక్వెన్సులు, మ్యూజిక్, డైలాగ్స్, అల్లు అర్జున్, రష్మిక డాన్స్ లు, జాతర సీక్వెన్స్ లు అన్నీ ప్రేక్షకులకు మోహనంగా నిలిచాయి.