MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘పుష్ప2’: క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ యాప్, క్రికెటర్ ప్రమోషన్

‘పుష్ప2’: క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ యాప్, క్రికెటర్ ప్రమోషన్

పుష్ప 2 సినిమా టికెట్ల కోసం సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. Wolf7Pay అనే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ప్రమోషన్లో భాగంగా 10,000 పుష్ప 2 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 03 2024, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
pushpa 2

pushpa 2


"పుష్ప 2" క్రేజ్ ని చూసి ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు ఆశ్చర్యపోతున్నాయి.   "పుష్ప: ది రైజ్" (Pushpa: The Rise) సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో, రెండో భాగం "పుష్ప 2: ది రూల్" మీద భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 కథలో పుష్పరాజ్ ఎలా కింగ్ అవుతాడు,

అతన్ని వ్యతిరేకించే వాళ్లతో ఎలా పోరాడతాడు, తన అన్న అజయ్ తో ఏ ఎమోషన్ ప్లే అవనుంది అన్నది  ప్రధాన ప్రశ్నగా ఉంది. ప్రేక్షకులు "తగ్గేదేలే" తరహా డైలాగ్స్ మరియు యాక్షన్ సీక్వెన్సులు కోసం ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ క్రేజ్ ని ఓ బెట్టింగ్ యాప్ క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. 

25


పుష్ప 2 చిత్రానికి బుధవారం (డిసెంబర్ 4) అర్ధరాత్రి నుంచి స్పెషల్ షోలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ల కోసం తెగ వెతుకుతున్న అభిమానుల కోసం సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు.  అతడు Wolf7Pay అనే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ కోసం చేసిన ప్రమోషన్లో భాగంగా ఏకంగా పది వేల పుష్ప 2 టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించటం విశేషం.

35


పుష్ప 2 టిక్కెట్లు తాము అందుకోవటం కోసం ఏం చేయాలో కూడా అతడు ఓ ప్రత్యేకంగా రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో అతడు పోస్ట్ చేశాడు. తగ్గేదేలే అంటూ పుష్ప మూవీలోని డైలాగ్ తో ఆ వీడియోను ఏబీ మొదలుపెట్టాడు.

45


ఆ వీడియోలో ఏముంది అంటే... "అందరికీ హాయ్.. సినిమా లవర్స్ అందరి కోసం నేనో ఉత్సాహకరమైన వార్త తీసుకొచ్చాను. @Wolf7Payలో కనీసం రూ.100, అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసే తొలి 10 వేల మంది డిపాజిటర్లకు ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ పుష్ప 2 టికెట్లు అందుతాయి.

ఏమాత్రం వేచి చూడకండి. ఇది ఈ శనివారం (డిసెంబర్ 7)తో ముగుస్తుంది. బాధ్యతాయుతంగా ఆడి, కింద ఉన్న లింకుపై క్లిక్ చేసి ఈ ప్లేస్ కన్ఫమ్ చేసుకోండి" అనే క్యాప్షన్ తో ఏబీ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
 

55


ఇక నైతికమా, అనైతికమా అనేది ప్రక్కన పెడితే పుష్ప 2 టికెట్లంటూ ఏబీ డివిలియర్స్ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. @Wolf7Pay ప్రపంచంలోనే ప్రముఖ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. ఎంతోమంది సెలబ్రిటీలు ఈ పోర్టల్ ను ఎండార్స్ చేస్తున్నారు.

తాజాగా పుష్ప 2 మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ ద్వారా ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తుండటం విశేషం. గురువారం (డిసెంబర్ 5) రిలీజ్ కాబోతున్న ఈ పుష్ప 2 మూవీ కోసం కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూండటమే అతనికి,అతని యాప్ కు ప్లస్ కాబోతోంది. 
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Teaser Review: `ధురంధర్ 2` టీజర్ రివ్యూ.. 2000 కోట్ల మూవీ లోడింగ్‌? ఆ రేంజ్‌లో ఉందా?
Recommended image2
OTT Film: డైరెక్ట్ ఓటీటీలో ఆనంద్‌ దేవరకొండ మూవీ.. `తక్షకుడు` టీజర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Rajasekhar: నేనేమీ శ్రీరామచంద్రుడిని కాదు, కొన్ని తప్పులు చేశా, జీవిత ముందే ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved