MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పూరి జగన్నాధ్ కి బాగా నచ్చిన సినిమా డైలాగ్స్ ఏంటో తెలుసా.. పోకిరి కాదట

పూరి జగన్నాధ్ కి బాగా నచ్చిన సినిమా డైలాగ్స్ ఏంటో తెలుసా.. పోకిరి కాదట

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హీరోయిజాన్ని ప్రత్యేకంగా చూపించడంలో స్పెషలిస్టు. ఆయన చిత్రాల్లో హీరో పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. పూరి జగన్నాధ్ తన హీరోలకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో లాగా భారీ డైలాగులు, బిల్డప్ లు ఇవ్వరు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2024, 08:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హీరోయిజాన్ని ప్రత్యేకంగా చూపించడంలో స్పెషలిస్టు. ఆయన చిత్రాల్లో హీరో పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి. పూరి జగన్నాధ్ తన హీరోలకు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో లాగా భారీ డైలాగులు, బిల్డప్ లు ఇవ్వరు. హీరో పాత్రకి కాస్త ఆకతాయి తనం, పొగరు  జోడించి దానినే హైలైట్ చేసి చూపిస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పోకిరి, బిజినెస్ మాన్ చిత్రాలు అందుకు ఉదాహరణ. పూరి జగన్నాధ్ చిత్రాల్లో వన్ లైన్ పంచ్ డైలాగ్స్ బాగా పేలుతాయి. పోకిరిలో డైలాగ్స్ అయితే అప్పట్లో యువతని ఉర్రూతలూగించాయి. ఎప్పుడొచ్చాం అన్నది కాదు అన్నయ్య.. బులెట్ దిగిందా లేదా లాంటి డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

36

అయితే పూరి జగన్నాధ్ కి తన చిత్రాల్లో తనకి బాగా నచ్చిన డైలాగ్స్ ఉండేది పోకిరిలో కాదట. ఈ విషయాన్ని మహేష్ బాబు ఒక సందర్భంలో చెబుతూ వివరించారు. బిజినెస్ మ్యాన్ కథ రెడీ చేస్తున్నప్పుడు పూరి జగన్నాధ్ మహేష్ కి ఫోన్ చేశారట. 

46

డైలాగులు అద్భుతంగా వచ్చాయి మహేష్.. నా సినిమాలన్నింటి లోకి ఇవే బెస్ట్ డైలాగ్స్ అని తెగ ఎగ్జైట్ అయ్యారని మహేష్ బాబు చెప్పారు. అనుకున్నట్లుగానే బిజినెస్ మ్యాన్ సినిమా డైలాగ్స్ పరంగా సంచలనం సృష్టించింది. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు..కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా లాంటి డైలాగ్స్ బాగా హైలైట్ అయ్యాయి. 

56

పోకిరి, బిజినెస్ మాన్ లాంటి సూపర్ హిట్స్ తర్వాత మహేష్, పూరి కాంబినేషన్ లో జనగణమన అనే చిత్రం రావాల్సింది. కానీ ఆ చిత్రాన్ని మహేష్ ప్రారంభ దశలోనే రిజెక్ట్ చేశారు. 

66

ఆ కథతో ఎప్పటికైనా సినిమా చేస్తానని పూరి జగన్నాధ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ జోరు బాగా తగ్గింది. పూరి చివరగా తెరకెక్కించిన లైగర్ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రం చేస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image2
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image3
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved