MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూరి జగన్నాధ్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. అర్థరాత్రి విషెస్ చెప్పిన ఛార్మి, పిక్స్ వైరల్

పూరి జగన్నాధ్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. అర్థరాత్రి విషెస్ చెప్పిన ఛార్మి, పిక్స్ వైరల్

లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ కెరీర్ ఎలా మారుతుంది అనే చర్చ ఎక్కువగానే జరిగింది. కానీ పూరి జగన్నాధ్ అంటే ఎప్పటికీ బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 28 2023, 07:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ కెరీర్ ఎలా మారుతుంది అనే చర్చ ఎక్కువగానే జరిగింది. కానీ పూరి జగన్నాధ్ అంటే ఎప్పటికీ బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు. కాకపోతే ఇటీవల పూరి స్క్రిప్ట్స్ పై దృష్టిపెట్టడం లేదు అనే కామెంట్ ఉంది. ఎలాగోలా పూరి.. ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ సెట్ చేసుకున్నారు. 

26

ప్రస్తుతం పూరి జగన్నాధ్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీ ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా నేడు పూరి జగన్నాధ్ తన 57వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. పూరి బర్త్ డే కావడంతో షూటింగ్ లొకేషన్ లోనే చిత్ర యూనిట్ సెలబ్రేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. 

36

ఇక్కడ మరో క్రేజీ విషయం ఏంటంటే.. పూరి జగన్నాధ్ ప్రొడక్షన్ పార్ట్నర్, నటి ఛార్మి అర్థరాత్రి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టింది. పూరి కేక్ కట్ చేస్తున్న పిక్స్ కూడా షేర్ చేసింది. దీనితో అవి కాస్త వైరల్ గా మారాయి. హ్యాపీ బర్త్ డే పూరి సర్ అని రాసి ఉన్న కేక్స్ ముందు పూరి ఉన్న ఫోటోలని ఛార్మి షేర్ చేసింది. 

46

ఇవి శాశ్వతమైన సెలెబ్రేషన్స్ అంటూ కామెంట్ పెట్టింది. ఇదిలా ఉండగా పూరి జగన్నాద్, ఛార్మి గురించి ఎన్నో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వారిద్దరూ ప్రొఫెషనల్ గా పార్ట్నర్స్ గా కోనసాగుతున్నారు. అదే సమయంలో పర్సనల్ లైఫ్ గురించి కూడా రూమర్స్ ఉన్నాయి. 

56

ఆ మధ్యన బండ్ల గణేష్ ఆకాష్ పూరి నటించిన ఒక చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వద్ద చేసిన కామెంట్స్ ఎలా సంచలనం సృష్టించాయో అందరికి తెలిసిందే. పలు మార్లు పూరితో ఉన్న రిలేషన్ షిప్ రూమర్స్ వల్ల ఛార్మి కూడా ట్రోలింగ్ ఎదుర్కొంది. 

66

అయినా వీరిద్దరూ కలసి సినిమాలు నిర్మిస్తూ ముందుకు వెళుతున్నారు. తన గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా పూరి వాటిని పట్టించుకోని నైజం. తన పని తాను చేసుకుని వెళుతున్నారు. ఇప్పుడు పూరి జగన్నాధ్ లైగర్ ఫ్లాప్ నుంచి బయట  పడి మరోసారి సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో తొలి హిట్ అందుకున్న పూరి.. ఆ తర్వాత ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, చిరుత, దేశముదురు, ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Jan 2: అమూల్యకు పెళ్లిచూపులు, ఈలోపే విశ్వక్ అదిరిపోయే ప్లాన్
Recommended image3
రాజమౌళి కంటే ఎక్కువ సంపాదిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved