మిరాయ్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. తేజ సజ్జా కి నిర్మాత సర్‌ప్రైజ్..
Mirai Movie: "మిరాయ్" బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని విజయవాడలో గ్రాండ్ వేడుక జరిగింది. ఈ వేడుకపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి లగ్జరీ కారు గిప్ట్ గా ఇస్తానని ప్రకటించారు.

మిరాయ్ సన్సేషన్
Mirai Movie : యంగ్ హీరో తేజ సజ్జ - డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన ‘మిరాయ్’(Mirai)సంచనలం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తో దూసుకపోతుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన అందుకుంది. దేశ, విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సక్సెస్ ఈవెంట్
యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ తెరకెక్కిన మిరాయ్ మూవీ కలెక్షన్ల తుఫాను సృష్టించింది. నాలుగు రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్ కు చేరువైంది. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఘనంగా వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, ప్రభుత్వం ప్రతినిధులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
నిర్మాత సర్‌ప్రైజ్
మిరాయ్ సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ చేశారు. "మిరాయ్" సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి తలా ఒక రేంజ్ రోవర్ లగ్జరీ కారు ను బహుమతిగా ప్రకటించారు. ఈ సర్రైజ్ అనౌన్స్ మెంట్ వినగానే అటు హీరో, ఇటు డైరెక్టర్ షాక్ అయ్యారు.
బాక్సాఫీస్ లో మిరాయ్ వైబ్
"మిరాయ్" కలెక్షన్లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ రూ. 81.56 కోట్లు వసూలు చేయగా. వర్క్ డేస్ లో కూడా అదే జోరు సాగిస్తోంది. సోమవారం, మంగళవారం కూడా సాలిడ్ వసూళ్లు సాధించి, ₹100 కోట్లకు చేరువలో నిలిచింది.
విదేశీ మార్కెట్లోనూ అద్భుత రన్ కొనసాగుతుండగా, ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌లో USD $2 మిలియన్ చేరువలో ఉంది. ఈ ఫిగర్స్ "మిరాయ్" కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, పాన్-ఇండియన్ లెవెల్‌లో ఘన విజయం సాధిస్తోందని స్పష్టంచేస్తున్నాయి. "మిరాయ్" బ్లాక్‌బస్టర్ తేజ సజ్జా కెరీర్‌లో మరో మైలురాయి అనే చెప్పాలి.