100 కోట్లకు చేరువలో మిరాయ్.. 4వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Mirai Day 4 Collections: యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపుతోంది. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

బాక్సాఫీస్ వద్ద ‘మిరాయ్’ దూకుడు..
Mirai Day 4 Collections: యంగ్ హీరో తేజ సజ్జ - డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన ‘మిరాయ్’(Mirai)సంచనలం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తో దూసుకపోతుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిస్తోంది, పలు రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మిరాయ్ వీకెండ్ నాటికి కలెక్షన్ల తుఫాను సృష్టించింది. ఇక నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది? ఇంతకీ రూ 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందా?
మిరాయ్ లో వైబ్ ఉందిలే..
‘మిరాయ్’(Mirai)సినిమాని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ తెరక్కెకింది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మిరాయ్ లో తేజ సజ్జా సూపర్ పవర్స్ కలిగిన యోధుడి పాత్రలో కనిపించగా, మంచు మనోజ్ బ్లాక్ స్వర్డ్ అనే విలన్ పాత్రలో దుమ్మురేపాడు. ఇక సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ, జగపతి బాబు, జయరామ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ సినిమాకు కృతి ప్రసాద్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
మిరాయ్ కలెక్షన్ల సునామీ
బాక్సాఫీస్ దగ్గర ‘మిరాయ్’ దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన తొలి రోజే మిరాయ్ ఏకంగా రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నాటి నుంచి నేటీ వరకు ఈ సోషల్ ఫాంటసీ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వరుసగా వసూళ్ల పెంచుకుంటూ.. రికార్డులు క్రియేట్ చేస్తుంది. డివోషనల్ సస్పెన్స్ తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్ నాటికి కలెక్షన్ల తుఫాను సృష్టించింది. వర్కింగ్ డేస్ లోనూ అదే జోరును కొనసాగిస్తుంది. ఇక రెండో రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 28.6 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి, రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇక మూడో రోజు ( సండే) కూడా అదే జోరును కొనసాగించింది. ఆదివారం నాడు ఏకంగా రూ. 25.6 కోట్లు వసూలు చేసింది. దీంతో రూ. 81.2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది,
మిరాయ్’ నాలుగో రోజు షాకింగ్ కలెక్షన్స్
ఇక మిరాయ్ నాలుగో రోజు కలెక్షన్లు చూస్తే... మిరాయ్ రెండో రోజు కలెక్షన్ల కంటే మూడో రోజు కలెక్షన్స్ మరింత ఊపందుకున్నాయి. దీని ప్రధాన కారణం వీకెండ్, వరుసగా సెలవు రావడం. ఇక నాలుగో రోజు సోమవారం నాడు మిరాయ్ కలెక్షన్లు కాస్త తగ్గాయనే చెప్పాలి. మండే నాడు కూడా బాక్సాఫీస్ వద్ద మిరాయ్ సునామీ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 10. 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో మిరాయ్ మూవీ నాలుగు రోజులలో 91.45 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది, దీని ప్రకారం మిరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ గా మరో అడుగు వేసింది. ఈ జోరును చూస్తే.. అతి త్వరలోనే మిరాయ్ 100 కోట్ల క్లబ్ లో అడుగువేస్తుందనే చెప్పాలి. ఈ కలెక్షన్లతో ‘మిరాయ్’ తేజ సజ్జా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్గా నిలుస్తోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.