బాలయ్యతో మా వల్ల కాదన్నారు.. `డాకు మహారాజ్`లో ఊర్వశి రౌతేలాని తీసుకోవడంపై నిర్మాత స్టేట్‌మెంట్
`డాకు మహారాజ్` సినిమాలో బాలయ్య,ఊర్వశి రౌతేలా చేసిన సాంగ్ ట్రోల్‌కి గురయ్యింది. ఈ నేపథ్యంలో ఊర్వశీని తీసుకోవడంపై నిర్మాత స్పందించారు.
బాలకృష్ణ త్వరలో `డాకు మహారాజ్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 12న విడుదల కాబోతుంది. ఇందులో ఊర్వశి రౌతేలాపై స్పెషల్ సాంగ్ చేశారు. బాలయ్య, ఊర్వశి ల మధ్య ఈ పాట వస్తుంది. `దబిడి దిబిడి` అంటూ సాగే ఈ పాట ఇప్పటికే ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులోని బాలయ్య మూమెంట్లని ట్రోల్ చేస్తున్నారు. దారుణంగా ఆడుకుంటున్నారు.
తాజాగా దీనికి సంబంధించిన ప్రశ్న నిర్మాతకు ఎదురయ్యింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నాక మళ్లీ ఊర్వశీని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి నాగవంశీ స్పందన క్రేజీగా ఉంది. ఊర్వశిపై చేసిన `దబిడి దిబిడి` సాంగ్ బాగా ట్రోల్ అవుతుంది.
హీరోయిన్ ని బాలయ్య కొడుతున్నట్టుగా ఉన్న మూమెంట్లని అభ్యంతరం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాగవంశీ చెబుతూ, బాలయ్య చేత ఈ ఇద్దరు హీరోయిన్లు కొట్టించుకోమని చెప్పారు. దీంతో ఊర్వశీని తీసుకొచ్చామంటూ సెటైర్లు పేల్చాడు.
నిర్మాత `డాకు మహారాజ్` గురించి చెబుతూ, `జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ ఈలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశాం. సినిమాని తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్ లో కూడా భారీ స్థాయిలోనే విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ జనవరి 12న విడుదలవుతోంది.
'డాకు మహారాజ్'తో ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఈ సినిమా నేను చూసి నమ్మకంగా చెబుతున్నాను. 'డాకు మహారాజ్' చిత్రం అసలు నిరాశ పరచదు. బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది` అని తెలిపారు.
దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, `మొదటి నుంచి బాలకృష్ణని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, ప్రతి విషయంలో వైవిధ్యం చూపిస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాం. 'డాకు మహారాజ్' చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. బాలకృష్ణ అభిమానులకు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నాగవంశీ డ్రీమ్.
అందుకు తగ్గట్టుగానే సరికొత్తగా ఉండేలా, ఒక మంచి సినిమాని తీశాము. ఇందులో ఐదు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. ప్రతి సీక్వెన్స్ అభిమానులకు ఎంతో హై ఇస్తుంది. యాక్షన్ తో పాటు మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది` అని చెప్పారు.
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, `జనవరి 12న నా పుట్టినరోజు. ఈ చిత్ర విజయాన్ని నా పుట్టినరోజు కానుకగా అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో గుర్తుండిపోయే మంచి పాత్రను పోషించాను` అని చెప్పగా, `సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంపై నాకు చాలా నమ్మకం ఉంది.
నా సినీ ప్రయాణంలో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నా` అని శ్రద్ధా శ్రీనాథ్ తెలిపారు. తన పాత్రలో సస్పెన్స్ ఉందని, దాన్ని రివీల్ చేయలేమని వెల్లడించారు.
also read: `డాకు మహారాజ్` థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు, బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్