SSMB28 : మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘ఎస్ఎస్ఎంబీ28’ రిలీజ్ డేట్ ఫైనల్.. ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ28’. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తవ్వగా.. తాజాగా సెకండ్ షెడ్యూల్, రిలీజ్ డేట్ పై మేకర్స్ అప్డేట్ అందించారు.
అతడు, ఖలేజా.. తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. పదేండ్ల తర్వాత కుదిరిన ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది చివర్లో ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు.
అయితే, మహేశ్ బాబు ఇంట్లో వరుస విషాదాల కారణంగా సినిమా షూటింగ్ బ్రేక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ చేధు నిజాలను మహేశ్ బాబు ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు. ఈ మేరకు గత నెల 25న వేకేషన్ కు వెళ్లి రీసెంట్ గా హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. దీంతో ‘ఎస్ఎస్ఎంబీ28’ షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్య దేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రొడ్యూసర్ నాగవంశీ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో SSMB28పై అదిరిపోయే అప్డేట్ అందించారు. సినిమా షూటింగ్ అప్డేట్, రిలీజ్ డేట్, హీరోయిన్ల విషయంలో క్లారిటీ ఇచ్చారు.
నాగ వంశీ మాట్లాడుతూ.. జనవరి 18న సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే ఆగస్టు 11న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు వెల్లడించారు. ఇక చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooa Hegde), యంగ్ బ్యూటీ శ్రీలీలా (Sree leela) ఇద్దరు నటించబోతున్నారని తెలిపారు.
హీరోయిన్ల విషయంలో ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ అనేది లేదంటూ.. ఇద్దరూ మహేశ్ బాబు సరసన నటిస్తున్నారని తెలిపారు. ఇద్దరి పాత్రలు సమపాళ్లలో ఉండనున్నట్టు పరోక్షంగా తెలిపారు. ఇక సినిమాను ఎలాంటి జాప్యం లేకుండా ఆగస్టు 11నే విడుదల చేస్తామని నొక్కి చెప్పారు. పండగ వేళ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పడం ఖుషీ అవుతున్నారు.
త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబో మూడోసారి సెట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా పూర్తి కాకుండానే.. అప్పుడే ఓటీటీ రైట్స్ కూడా అమ్ముడు పోవడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఇక చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. అన్నీ భాష రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నారు.