- Home
- Entertainment
- కింగ్డమ్, వార్ 2 చిత్రాలతో నిర్మాతకి బ్యాక్ టు బ్యాక్ షాక్ లు.. పెట్టింది ఎంత, పోయింది ఎంత ?
కింగ్డమ్, వార్ 2 చిత్రాలతో నిర్మాతకి బ్యాక్ టు బ్యాక్ షాక్ లు.. పెట్టింది ఎంత, పోయింది ఎంత ?
నిర్మాత నాగవంశీకి ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలతో పెద్ద దెబ్బ తగిలింది. ఒకటి నాగవంశీ నిర్మించినది కాగా మరొకటి కొన్నది. ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

నిర్మాత నాగవంశీ
నిర్మాత నాగవంశీ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుసగా నాగవంశీ సినిమాలు నిర్మిస్తున్నారు. తన బాబాయ్ సూర్యదేవర రాధాకృష్ణ అండదండలతో నాగవంశీ నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. రాధాకృష్ణ హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఎప్పుడో కానీ సినిమాలు నిర్మించడం లేదు. కానీ నాగవంశీ మాత్రం సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో చిన్న సినిమాలు, మీడియం బడ్జెట్ చిత్రాలు, భారీ చిత్రాలు నిర్మిస్తున్నారు.
KNOW
వరుస విజయాలు
గత ఏడాది లక్కీ భాస్కర్, ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ ఇలా వరుస హిట్స్ అందుకున్నారు. నాగవంశీ తన సినిమాలతో మాత్రమే కాకుండా.. కామెంట్స్ తో కూడా వార్తల్లో నిలుస్తుంటారు. రీసెంట్ గా నాగవంశీకి రెండు ఊహించని ఎదురుదెబ్బలు తగలడం చర్చనీయాంశంగా మారింది.
భారీ బడ్జెట్ లో కింగ్డమ్
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం భారీ అంచనాలతో జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో సత్తా చూపలేకపోయింది. ఈ చిత్ర బడ్జెట్ 100 కోట్ల వరకు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనితో మంచి ఓపెనింగ్స్ దక్కినప్పటికీ ఆ తర్వాత కలెక్షన్స్ బాగా డ్రాప్ కావడంతో నష్టాలు తప్పలేదనే టాక్ వినిపిస్తోంది.
వార్ 2 తో పెద్ద షాక్
ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ వార్ 2 మూవీతో నాగవంశీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఈ చిట్టా తెలుగు హక్కులని నాగవంశీ 80 కోట్లకు దక్కించుకున్నారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఈ మూవీలో చాలా అంశాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
నష్టాలు తప్పవు
ఈ చిత్రం సగం బడ్జెట్ ని వెనక్కి తీసుకురావడం కూడా కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో నాగవంశీ మరోసారి టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారారు. మరోవైపు నాగవంశీ నిర్మిస్తున్న నెక్స్ట్ మూవీ మాస్ జాతర కూడా వాయిదా పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.