కూలీలో మైండ్ బ్లాక్ చేసిన రచిత రామ్ గురించి తెలుసా ? వైరల్ ఫోటోస్
రజినీకాంత్ నటించిన కూలీ చిత్రం ఆగష్టు 14న విడుదలయింది. ఈ చిత్రంలో నటించిన రచిత రామ్ పాత్ర ప్రేక్షకులకు ఊహించని సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

భారీ వసూళ్లతో దూసుకుపోతున్న కూలీ
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ ఫస్ట్ టైం తెరకెక్కిన చిత్రం కూలీ. ఆగష్టు 14న రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. టాక్ ఎలా ఉన్నపటికీ రజినీకాంత్ స్టార్ పవర్, లోకేష్ టేకింగ్, ఇతర స్టార్ కాస్టింగ్ తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిత్రానికి వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఈ మూవీలో అక్కినేని నాగార్జున తొలిసారి విలన్ గా నటించారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలో నటించారు.
రహస్యంగా ఆమె పాత్ర
లోకేష్ కనకరాజ్ చిత్రాల్లో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మూవీలో కన్నడ నటి రచిత రామ్ పోషించిన పాత్ర ప్రేక్షకులని మైండ్ బ్లాక్ చేస్తోంది. అసలు ఈ చిత్రంలో ఆమె నటించినట్లు సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికీ తెలియదు. లోకేష్ కనకరాజ్ ఆమె పాత్రని గోప్యంగా ఉంచారు. దీనితో రచిత రామ్ పాత్ర థియేటర్స్ లో థ్రిల్ పంచుతోంది. కళ్యాణి అనే పాత్రలో ఆమె నటించారు.
రచిత రామ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్ల ఆసక్తి
ఐ లవ్ యు చిత్రంలో ఉపేంద్ర తో కలిసి నటించిన ఆమె మరోసారి కూలీతో ఆయనతో నటించారు. కూలీ చిత్రంతో రచిత రామ్ సౌత్ లేటెస్ట్ క్రష్ గా మారిపోయింది. గతంలో రచిత రామ్ బోల్డ్ గా కూడా నటించింది. కూలీ తర్వాత అసలు రచిత రామ్ ఎవరు ? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి ? అనే వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
రచిత రామ్ 1992లో అక్టోబర్ 3న బెంగళూరులో జన్మించారు. రచిత రామ్ అసలు పేరు బిందియా రామ్. సినిమాల్లోకి వచ్చాక తన పేరుని రచిత రామ్ గా మార్చుకున్నారు. రచిత రామ్ తండ్రి కేఎస్ రామ్ భరతనాట్యం డ్యాన్సర్.
భరతనాట్యంలో అద్భుతమైన ప్రతిభ
దీనితో తండ్రి ప్రోత్సాహంతో రచిత కూడా భరత నాట్యం నేర్చుకున్నారు. దాదాపు 50 వరకు స్టేజి పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు ఆమె. మొదట బుల్లితెరపై నటిగా నిరూపించుకున్న రచిత రామ్ 2013లో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లోకి
బుల్ బుల్ మూవీతో ఆమె నటిగా మారింది. తెలుగులో కూడా రచిత రామ్ హీరోయిన్ గా నటించింది. చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి చిత్రంలో హీరోయిన్ గా రచిత నటించింది. కన్నడలో ఆమె దర్శన్, కిచ్చా సుదీప్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్ లతో నటించింది. సినిమాల్లో బోల్డ్ సీన్స్ లో నటించడం గురించి రచిత ఒకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లయ్యాక భార్య భర్తలు ఏం చేస్తారో అదే మేము సినిమాలో చూపిస్తున్నాం అంటూ బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది.
రజినీని కలిసిన రచిత
కూలీ చిత్రంలో ఆమె పాత్ర లోకేష్ కనకరాజ్ విక్రమ్ చిత్రంలోని ఏజెంట్ టీనా పాత్రకి అపోజిట్ వర్షన్ అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. కూలీ చిత్రం రచిత రామ్ కెరీర్ కి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. ఆమె పాత్రని సీక్రెట్ గా ఉంచేందుకు రచిత రామ్ ని కూలీ ప్రమోషన్స్ లో లోకేష్ కనకరాజ్ ఎక్కడా భాగం చేయలేదు. కూలీ రిలీజ్ అయ్యాక రచిత రామ్.. రజినీకాంత్ ని కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.