- Home
- Entertainment
- Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుక..సీఎం చంద్రబాబు నుంచి చిరంజీవి వరకు, సెలెబ్రిటీల సందడి
Bandla Ganesh: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థ వేడుక..సీఎం చంద్రబాబు నుంచి చిరంజీవి వరకు, సెలెబ్రిటీల సందడి
నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం సూర్యతేజతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

నిర్మాత బండ్ల గణేష్
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని నిశ్చితార్థం సూర్యతేజ చిలుకూరితో ఆదివారం నాడు అత్యంత వైభవంగా జరిగింది.
బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ కార్యక్రమం
ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో శాస్త్రోక్తంగా ఈ నిశ్చితార్థ కార్యక్రమం పూర్తయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వధూవరులను ఆశీర్వదించి, బండ్ల గణేష్ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో తళుక్కున మెరిశారు. నూతన వధూవరులతో కాసేపు ముచ్చటించి, వారి భవిష్యత్తు బాగుండాలని దీవించారు.
సందడి వాతావరణం
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తనదైన శైలిలో సందడి చేస్తూ వేడుకకు హాజరయ్యారు. ఆయన రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు
సీనియర్ నటుడు మురళీ మోహన్, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు కూడా ఈ నిశ్చితార్థానికి విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ
హీరో శ్రీకాంత్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ వేడుకలో పాల్గొని బండ్ల గణేష్‌తో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.
కమెడియన్ అలీ
ప్రముఖ కమెడియన్ అలీ, సునీల్ తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు.
సుష్మిత కొణిదెల
మెగాస్టార్ కుమార్తె సుష్మిత కొణిదెల కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో కనిపించారు.
అత్యంత సుందరంగా..
నిశ్చితార్థ స్టేజీని అత్యంత సుందరంగా, పూలతో అలంకరించారు. విందు భోజనాలు కూడా అతిథులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కుమార్తె నిశ్చితార్థంలో బండ్ల గణేష్ సందడి
బండ్ల గణేష్ తన కుమార్తె నిశ్చితార్థాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. వచ్చిన అతిథులందరినీ ఆయన స్వయంగా సాదరంగా ఆహ్వానించారు.
ఫోటోలు వైరల్
సోషల్ మీడియాలో ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పెద్ద ఎత్తున ఈ జంటకు విషెస్ చెబుతున్నారు.
రాజకీయ, సినీ ప్రముఖుల కలయికతో ..
రాజకీయ, సినీ ప్రముఖుల కలయికతో ఈ వేడుక ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. త్వరలోనే వీరి వివాహ తేదీని ప్రకటించనున్నారు.

