కూతురిని వెంటేసుకుని షాపింగ్ చేస్తోన్న ప్రియాంక చోప్రా.. ఏం కొన్నదంటే..?
తన కూతురితో కలిసి జాంమ్ జాంమ్ అంటూ షాపింగ్ చేస్తోంది.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకచోప్రా. ముద్దుల పాప ఫోటోలను తన సోషల్ మీడియా పేజ్ లో.. శేర్ చేసింది.

Priyanka Chopra
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి జంప్ చేసి వెళ్ళిపోయింది స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. హాలీవుడ్ స్టార్ సింగర్ కమ్ యాక్టర్ నిక్ జోనస్ ను పెళ్ళాడిన తరువాత సరోగసి పద్దతిలో ఒక పాపకు కూడా వీరి జన్మనిచ్చారు.
Priyanka Chopra
హాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తుంది బ్యూటీ.. హాలీవుడ్ లో మల్టీ టాలెంట్ తో సత్తా చాటుతుంది. ఇక ప్రియాంక , నిక్ ల గారాల కూతురు పేరు మాల్తీ మేరీ.. తనకు సరోగసి ద్వారా బిడ్డను కనడానికి సహాయం చేసిన వారి పేరు కలిసి వచ్చేలా ఈపేరు పెట్టారట నిక్ దంపతుల. ఇక ప్రియాంక చాలా కాలం తన కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడ్డారు.
ఇక రీసెంట్ గా హాలీవుడ్ లోని ఒక అవార్డు ఫంక్షన్ కి తన కూతురితో హాజరైన ప్రియాంక చోప్రా..ఫస్ట్ టైమ్ తన కూతురు మాల్తీ పేస్ ని రివీల్ చేసింది. అప్పటిలో ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ప్రియాంక తన కూతురితో కలిసి షాపింగ్ చేస్తూ...కనిపించింది.
ఇక చాలా మంది చాలా రకాలుగా అనుకున్నా.. ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు ప్రియాంక. రీసెంట్ గా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిందతి. తనకి ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల సరోగసీకి వెళ్లినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతే కాదు తన సమస్య ఏంటీ అనే విషయం విషయం తెలుసుకోకుండా సోషల్ మీడియాలో ప్రతిఒక్కరు విమర్శలు చేయడం వలనే తన కూతురుని ఎవరికీ చూపింలేదని చెప్పింది బ్యూటీ.
న్యూ జెర్సీలో తన బిడ్డతో కలిసి షాపింగ్ చేసింది ప్రియాంక. మాల్తీ కావాల్సిన బొమ్మలు, ఫుడ్ ఐటమ్స్ కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. కాగా మాల్తీ పుట్టుక విషయంలో చాలా రకాల విమర్షలు ఎదుర్కొంది ప్రియాంక చోప్రా. గ్లామర్ మిస్ అవ్వాల్సి వస్తుందన్న భయంతో ప్రియాంక ఇలా చేసిందని తిట్టిపోశారు జనాలు.