MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Varanasi Movie: మహేష్‌, రాజమౌళి ఎంత కష్టపడ్డా అది సాధ్యం కాలేదు.. వారణాసిపై గ్లోబల్‌ హైప్‌ ఇచ్చిన ప్రియాంక భర్త

Varanasi Movie: మహేష్‌, రాజమౌళి ఎంత కష్టపడ్డా అది సాధ్యం కాలేదు.. వారణాసిపై గ్లోబల్‌ హైప్‌ ఇచ్చిన ప్రియాంక భర్త

మహేష్‌ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న `వారణాసి` మూవీపై ప్రియాంక భర్త స్పందించారు. ఒక్క మాటతో ఆయన గ్లోబల్‌ వైడ్‌గా హైప్‌ ఇచ్చారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 11 2026, 07:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`వారణాసి` ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రాజమౌళి, మహేష్‌
Image Credit : youtube/@ScreenRantPlus

`వారణాసి` ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రాజమౌళి, మహేష్‌

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబల్‌ ఫిల్మ్ `వారణాసి` రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. దీంతోపాటు సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు రాజమౌళి. ఇటీవల పలు ఇంగ్లీష్‌ మీడియా సంస్థలకు గ్రూప్‌ ఇంటర్వ్యూలిచ్చారు. రాజమౌళి కూడా సెపరేట్‌గా ఇంటర్వ్యూలిచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 బిజినెస్‌ చేసే పనిలో వారణాసి టీమ్‌
Image Credit : youtube/@ColliderInterviews

బిజినెస్‌ చేసే పనిలో వారణాసి టీమ్‌

నేషనల్‌ వైడ్‌గా, అంతర్జాతీయంగా సినిమా బిజినెస్‌ చేయడం కోసం ఈ ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు సమాచారం. సినిమా రిలీజ్‌కి ఇంకా ఏడాదికిపైగానే ఉంది. అయినా ఇప్పట్నుంచే ప్రమోషన్స్ షురూ చేశారు రాజమౌళి. సినిమాపై గ్లోబల్‌ వైడ్‌గా హైప్‌ పెంచే ప్రయత్నం చేశారు. బిజినెస్‌కి హెల్ప్ అయ్యేలా చేశారు. అయితే ఇప్పటికే ఓటీటీ డీల్‌ సెట్ అయ్యిందని, నెట్‌ ఫ్లిక్స్ సుమారు రూ.650కోట్లకు ఓటీటీ రైట్స్ తీసుకుందనే ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

35
పెద్దగా ఎగ్జైట్‌ చేయని టీమ్‌ ఇంటర్వ్యూలు
Image Credit : youtube/varanasi movie

పెద్దగా ఎగ్జైట్‌ చేయని టీమ్‌ ఇంటర్వ్యూలు

ఇదిలా ఉంటే ఇటీవల మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అలాగే రాజమౌళి వరుసగా అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిచ్చినా, పెద్దగా ఎగ్జైట్‌ అనిపించలేదు. కొత్తగా వాళ్లేం చెప్పలేదు. వాహ్‌ ఫ్యాక్టర్స్ ఏం లేవు. సినిమా ఎలా ఉంటుందో చెప్పారు, రామాయణం ఎపిసోడ్‌ గురించి వెల్లడించారు. ఒకే పార్ట్ గా మూవీ ఉంటుందన్నారు. రాముడి పాత్ర కోసం మహేష్‌ పడ్డ కష్టాన్ని వెల్లడించారు. ఇవన్నీ మన తెలుగు ఆడియెన్స్ కి కొంత ఎగ్జైటింగ్‌గా అనిపించొచ్చు. కానీ గ్లోబల్‌ ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కలేదనే టాక్‌ వినిపించింది.

45
ఒక్క మాటతో `వారణాసి`పై గ్లోబల్‌ హైప్‌ ఇచ్చిన ప్రియాంక చోప్రా భర్త
Image Credit : instagram/@nickjonas

ఒక్క మాటతో `వారణాసి`పై గ్లోబల్‌ హైప్‌ ఇచ్చిన ప్రియాంక చోప్రా భర్త

కానీ ఒకే ఒక్క మాటతో గ్లోబల్‌ హైప్‌ ఇచ్చాడు ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనాస్‌. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రియాంక నటిస్తున్న `వారణాసి` గురించి వెల్లడించారు. ఆయన ఒకే మాట చెప్పారు. అదిప్పుడు వైరల్‌ అవుతుంది. అదేంటంటే, `ప్రియాంక చోప్రా గత 14 నెలలుగా షూటింగ్‌లో పాల్గొంటుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` దర్శకత్వం వహించిన రాజమౌళి రూపొందిస్తున్న సౌత్‌ ఇండియా మూవీ ఇది. ఆయన చేస్తున్న భారీ చిత్రం. ఇది అద్భుతంగా ఉండబోతుంది` అని వెల్లడించారు. అంతే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు గ్లోబల్‌ వైడ్‌గా చక్కర్లు కొడుతున్నాయి. సినిమాపై మంచి హైప్‌ని తీసుకొస్తున్నాయి.

55
పాప్‌ సింగర్‌గా నిక్‌ జోనాస్‌ వరల్డ్ వైడ్‌గా పాపులర్‌
Image Credit : instagram/@nickjonas

పాప్‌ సింగర్‌గా నిక్‌ జోనాస్‌ వరల్డ్ వైడ్‌గా పాపులర్‌

నిక్‌ జోనాస్‌ పాప్‌ సింగర్. మ్యూజీషియన్‌, నటుడు. ఆయనకు గ్లోబల్‌ వైడ్‌గా ఫాలోయింగ్‌ ఉంది. అనేక దేశాల్లో మ్యూజిక్‌ ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. దీంతో ఆయన ఫాలోయింగ్‌ వేరే లెవల్‌. అలాంటి `వారణాసి` మూవీ గురించి మాట్లాడటంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి. దీంతో అవి సినిమాపై విశేషమైన ప్రచారాన్ని తీసుకొస్తున్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్‌ నారాయణ దాదాపు రూ.1300కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Related Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
SuperStar Krishna కి చుక్కలు చూపించిన వెంకటేష్‌.. `సంక్రాంతి` దెబ్బకి అడ్రస్‌ లేకుండా పోయిన సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved