MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డాక్టర్లను కూడా విసిగించాను ప్రియాంక చోప్రా కామెంట్స్, ఆక్షణం భయపడ్డానంటోన్న గ్లోబల్ బ్యూటీ.

డాక్టర్లను కూడా విసిగించాను ప్రియాంక చోప్రా కామెంట్స్, ఆక్షణం భయపడ్డానంటోన్న గ్లోబల్ బ్యూటీ.

హాలీవుడ్  లో సెటిల్ అయిన బాలీవుడ్ హీరోయిన్   ప్రియాంక చోప్రా.. అప్పుడప్పుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో .. వార్తల్లో నిలుస్తోంది.  ఏదో ఒక రకంగా వైరల్ న్యూస్ అవుతుంది. ఆమె చేసే కామెంట్స్.. లేక ఆమె చేసే పనులు హార్ట్ టాపిక్స్ అవుతున్నాయి. అయితే ఈమధ్య వరకూ కాంట్రవర్సీ కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన ప్రియాంక..  తాజాగా మరోసారి తన పర్సనల్ విషయాలు పంచుకుని షాక్ ఇచ్చింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 22 2023, 03:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Priyanka chopra

Priyanka chopra

హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా.. బిజీ బిజీ.. తన ఫ్యామిలీని చూసుకోవాలి.. బిడ్డ ఆలనా పాలనాచూసుకోవాలి. అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ లు.మరో వైపు సినిమా ఫంక్షన్లు.. ఇంకోవైపు సోషల్ మీడియా.. ఇన్నిబాధత్యల నడుమ.. టైట్ షెడ్యూల్ లో ఉంది బ్యూటీ. ఆమెకు ఏమాత్రం తీరక లేదంట. కాని అప్పుడప్పుడు బాలీవుడ్ గురించి స్పందిస్తూ.. కాంట్రవర్సీలు మాత్రం చేస్తుంటుంది ప్రియాంక. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

బోల్ట్ స్టేట్ మెంట్స్ ఇవ్వడంతో.. బాలీవుడ్ ను విమర్షించడంలో ఈమధ్య ముందుంటుంది హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆమధ్య ట్రిపుల్ ఆర్ చూడలేదని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆతరువాత తాను ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ గురించి ఓ దర్శకుడిపై ఆరోపణలు చేసింది. ఇక ఇప్పుడు మాత్రం తన పర్సనల్ ఎమోషన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది బ్యూటీ. 
 

36

ఇక ప్రియాంక మాట్లాడుతూ.. అమ్మని అయ్యాక నేను చాలా మారాను అంటున్నది. ఓ బిడ్డకు జన్మనిచ్చాక తనలో వచ్చిన మార్పు గురించి రీసెంట్ గా తాను ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది మాజీ ప్రపంచసుందరి.  ఆమె మాట్లాడుతూ.. నేను తల్లిని కాబోతున్నానని తెలిసిన క్షణంలో ఏదో తెలియని భయం నన్ను ఆవహించింది.  బహుశా అందరు ఆడవాళ్లకూ ఆ ఫీలింగ్‌ ఉంటుందేమో అని రకరకాల ఆలోచనలు నన్ను వెంటాడాయి అన్నారు. 
 

46

అంతే కాదు ఈ అనుమానాలతో చుట్టూ ఉన్నవారిని ఇబ్బంది పెట్టాను..  దానికితోడు లెక్కకు మించిన సందేహాలు. ఖాళీ దొరికితే చాలు హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్ల మెదడు తినేదాన్ని అన్నారు. ఇక తనకు  కూతురు పుట్టింన తరువాత  ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు ప్రియాంక. అంతే కాదు ఆడపిల్లను  కనడం పెద్ద టాస్క్‌. ఎంత టెక్నాలజీ పెరిగినా దాని కష్టం దానికుంటుంది. అది స్త్రీలకి మాత్రమే తెలుసున్నారు.  బిడ్డను కన్న తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు ప్రియాంక. 
 

56

అంతే కాదు  ఏదైనా చేయగలననే ధైర్యం వచ్చింది. బహుశా అమ్మతనంలోనే ఆత్మవిశ్వాసం ఉంటుందేమో. అంతకుముందు శరీరంపై శ్రద్ధ ఉండేదికాదు. ఇప్పుడు తెలీకుండా శ్రద్ధ పెరిగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ఇంకా మట్లాడుతూ ‘ తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే నేను నంబర్‌వన్‌గా నిలిచాను. నేను కూడా నా కూతుర్ని అలాగే పెంచాలనుకుంటున్నాను’ అన్నారు ప్రియాంక.
 

66

ప్రస్తుతం ప్రియాంక బ్యాక్ టు బ్యాక్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదలై మంచి వ్యూవర్ షిప్ ను సాధిస్తుంది. దీనితో పాటుగా లవ్ ఎగేన్ అనే రొమాంటిక్ కామెడీ డ్రామా చేసింది. ప్రస్తుతం ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే సినిమా చేస్తుంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved