Priyanka Arul Mohan : పవన్ కళ్యాణ్ పై ప్రియాంక మోహన్ ఆసక్తికరమైన కామెంట్స్.. ‘ఓజీ’ షూటింగ్ పైనా.!
తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై అప్డేట్ అందించింది. పవన్ పైనా ఆసక్తికర కామెంట్స్ చేసింది.
కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుం తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘ఓజీ’ (OG) చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో బిగ్ స్టార్ సరసన నటించడం ఆమెకు ఇదే తొలిసారి..
ఇప్పటికే They Call Him OGపై భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వం వహిస్తుండటం భారీ తారాగణం చిత్రంలో నటిస్తుండంతో ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
రీసెంట్ గానే విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పై ప్రియాంక మోహన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది. షూటింగ్ వివరాలతో పాటు.. పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
‘ఓజీ... కోసం నేను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మేము దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నాం. కొంత భాగం మాత్రం షూట్ చేయాల్సి ఉంది. మళ్లీ షూటింగ్ కోసం కూడా సిద్ధంగా ఉన్నాం’.. అంటూ చెప్పుకొచ్చింది. అంటే మరికొద్దిరోజుల్లోనే సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని తెలుస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్ సార్ చాలా పెద్ద సూపర్ స్టార్. జెంటిమెన్, గౌరవమైన వ్యక్తి, స్వీట్’ అంటూ పవర్ స్టార్ ను ఆకాశానికి ఎత్తింది. పవర్ స్టార్ సరసన ఈ ముద్దుగుమ్మ ఏ మేరకు మెప్పించిందనేది చూడాలి.
పవన్ - సుజీత్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న OG Movieని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2024 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.