ప్రేరణ నిజ స్వరూపం బయటపెట్టిన శ్రీపాథ్.. టేస్టీ తేజ కన్నీళ్లకి కరిగిన బిగ్ బాస్, అమ్మరాకతో కోరిక తీరిన వేళ
బిగ్ బాస్ తెలుగు 8 శుక్రవారం ఫ్యామిలీ ఎపిసోడ్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగాయి. ముఖ్యంగా తేజ అమ్మని తీసుకురావడం హైలైట్‌గా నిలిచింది.
బిగ్ బాస్ తెలుగు 8 పదకొండో వారం చివరికి చేరుకుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్‌గా సాగిన విషయం తెలిసిందే. శుక్రవారం కూడా అది కొనసాగింది. అంతకు ముందు రావడానికి సాధ్యం కాని వాళ్లు ఈ రోజు ఎపిసోడ్‌లో వచ్చారు. ప్రేరణ భర్త శ్రీపాథ్‌కి కుదరకపోవడంతో ఆయన ముందుగా రాలేకపోయాడు. దీంతో శుక్రవారం ఎపిసోడ్‌లో ప్రేరణని సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు బిగ్ బాస్ కూడా వారి ప్రేమ కోసం లవ్ బెలూన్స్ తో గార్డెన్ ఏరియాని ప్రత్యేకంగా డెకొరేట్ చేయించడం విశేషం.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ సందర్భాన్ని వాళ్లు బాగా ఎంజాయ్ చేశారు. భర్త రావడంతో ప్రేరణ కూడా ఫుల్ హ్యాపీ. ఆమె ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. బాగా ఆడుతున్నావని, కానీ చెప్పే విషయాలను టోన్ తగ్గించుకుని చెప్పాలని ప్రేరణకి సలహా ఇచ్చాడు శ్రీపాథ్. అలాగే ప్రేరణ ఎలా ఆడుతుందని రోహిణి అడగ్గా, బాగా ఆడుతుందని, ఏడాది పాటుగా నన్ను ఆడుకుందిగా అంటూ కామెంట్ చేయడం హైలైట్‌గా నిలిచింది.
ఇక చివరగా వీరిద్దరికి గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇద్దరి మధ్య బెలూన్స్ ఉంచి పగలకొట్టే టాస్క్ ఇవ్వడం ఇది ఆద్యంతం ఫన్నీగా సాగింది. ఇది చూసి జెలసీ ఫీలైన అవినాష్ తన భార్యని మళ్లీ పంపించమని బిగ్ బాస్‌ని కోరడం హైలైట్‌గా నిలిచింది.
అనంతరం టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరు పేరెంట్స్ వచ్చారు. తనకు మాత్రం అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందాడు. మా అమ్మని కూడా పంపించండి బిగ్ బాస్ అంటూ వేడుకున్నాడు. ఇతర కంటెస్టెంట్లు కూడా రిక్వెస్ట్ చేశారు. ఇంతలో ఫోన్ వచ్చింది. రాలేకపోతున్నా నాన్న అని తేజ అమ్మ మాట్లాడింది. కట్ చేస్తే కాసేపటికే వాళ్ల అమ్మ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తేజ ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. సంతోషంలో ఉప్పొంగిపోయాడు.
ఇంతకంటే ఇంకేం అవసరం లేదంటూ కామెంట్ చేశారు. తాను బిగ్ బాస్ హౌజ్‌లోకి రావడం పెద్ద అఛీవ్‌మెంట్ అని, ఇందులోకి మా అమ్మని తీసుకురావాలనేది తన డ్రీమ్ అని, ఇప్పుడు అది సాధించానని, ఇక తాను సక్సెస్ అయ్యానని, ఇదే తన విజయం అంటూ ప్రకటించాడు తేజ. బిగ్ బాస్‌లోకి గత సీజన్‌లో వచ్చాడు తేజ. అప్పుడు అమ్మని తీసుకురాలేకపోయాడు. అయితే ఆ షో తర్వాత నుంచి తాను చాలా బిజీ అయ్యానని, అది బిగ్ బాస్ షో వల్లే సాధ్యమైందంటూ ధన్యవాదాలు తెలిపారు.
ఇదే తన విజయమంటూ వెల్లడించారు. అయితే వాళ్ల అమ్మ చెబుతూ, బాగా ఆడుతున్నాడు. ఇంకా బాగా ఆడాలని, టాప్ 5లో చూడాలని కోరుకుంది. `నీ కోరిక నేను హౌజ్‌లోకి రావడం. అది తీరింది. నా కోరిక నిన్ను టాప్ 5లో చూడటం. ఆ కోరిక నెరవేర్చమని తెలిపింది తేజ అమ్మ. వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా సాగాయి. అంతిమంగా ఫ్యామిలీ వీక్ విజయవంతంగా పూర్తయ్యింది.
చివర్లో తేజ అమ్మ చికెన్, ఆలుగడ్డ ఫ్రై తీసుకొచ్చింది. ఆమెనే స్వయంగా కలిపి హౌజ్‌మేట్స్ కి తినిపించింది. అందరికి పెట్టింది. అయితే ఈ విషయంలో రోహిణి అభ్యంతరం చెప్పడం విశేషం. తేజ అమ్మ వెళ్లిపోయిన తర్వాత రాత్రి పడుకునే సమయంలో ఈ టాపిక్ తీసింది. అందరు ఆమెని తినిపిస్తే తిన్నారని, కానీ ఆమెకి పెట్టాలని ఎవరూ అనుకోలేదని, పైగా మాకు మాకు అంటూ ప్లేట్ కోసం ఎగబడ్డారని చెప్పడం గమనార్హం.
ఇలా మొత్తంగా పదుకొండు వారాల గేమ్ అయిపోయింది. శనివారం ఎపిసోడ్‌కి నాగార్జున రాబోతున్నారు. రేపు ఆయన రియాక్షన్ కోసం అంతా వెయిటింగ్. అదే సమయంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. విష్ణు ప్రియా, తేజ, అవినాష్, పృథ్వీరాజ్, యష్మి, గౌతమ్ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియాల్సి ఉంది.
read more: `కుబేర` గ్లింప్స్ రివ్యూః నాగార్జున, ధనుష్, రష్మిక ఆరాటం దేనికోసం? శేఖర్ కమ్ముల మామూలోడు కాదుగా
also read: