- Home
- Entertainment
- Karthika Deepam: శౌర్య, నిరుపమ్‌ను కలిపేందుకు హిమ, ప్రేమ్ ప్రయత్నం.. టెన్షన్ పడుతున్న శోభ, స్వప్న!
Karthika Deepam: శౌర్య, నిరుపమ్‌ను కలిపేందుకు హిమ, ప్రేమ్ ప్రయత్నం.. టెన్షన్ పడుతున్న శోభ, స్వప్న!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ హాస్పిటల్ కి వెళుతూ ఉండగా అప్పుడు సౌందర్య ఎక్కడికి వెళ్తున్నావ్ అనడంతో హాస్పిటల్ కి వెళ్ళాలి కదా నానమ్మ నాకోసం పేషెంట్స్ ఎదురుచూస్తుంటారు అనగా వెంటనే సౌందర్య ఇంట్లో ఉన్న పేషెంట్స్ ని పట్టించుకోవా అని అనడంతో వెంటనే హిమ ఎవరికీ ఏమైంది అనగా మీ తాతయ్యకు బాగాలేదు అనడంతో వెంటనే సౌర్య ఏంటి తాతయ్య బాగాలేదా సరేనా నానమ్మ హాస్పిటల్ కి వెళ్దాం పద అనడంతో వెంటనే సౌందర్య హాస్పిటల్ కి వెళ్దాం పద అంటావేంటి అని అంటుంది.
అప్పుడు సౌందర్య(soundarya), ఆనంద్ రావ్ లు ఇక్కడ ప్లాన్ ఫెయిల్ అవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు ఆనంద్ రావు నటిస్తుండగా సౌర్య హాస్పిటల్ కి వెళ్ళాం పదా అని ఉంటుంది. అప్పుడు హిమ(hima)సరే నేను హాస్పిటల్ కి రావడం లేదు అని వాళ్లకు ఫోన్ చేసి చెప్తాను అంటుంది. అప్పుడు సౌందర్య వాళ్ళు ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆనందపడుతూ ఉంటారు.
ఇంతలో హిమ ఒంటరిగా కూర్చొని సౌర్య(sourya) గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వస్తాడు. అప్పుడు ప్రేమ్ ఎందుకు మూడిగా ఉంటావు ఏదైనా సమస్య వస్తే నాతో షేర్ చేసుకోవచ్చు కదా అని, అయినా నాకు తెలుసులే నన్ను నువ్వు దూరం పెడతావు నా మీద నీకు ఏదో కోపం ఉంది కదా అనడంతో అలా ఏం లేదు బావ అంటుంది హిమ(hima).
అప్పుడు హిమ, సౌర్య(sourya), నిరుపమ్ కీ ఇలా అయినా పెళ్లి చేయాలి బావ అని అంటుంది. ఆ మాటకు ప్రేమ్ సంతోషపడుతూ ఉంటాడు.అప్పుడు వారిద్దరూ సౌర్య, నిరుపమ్ ని కలపడానికి ప్లాన్లు వేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ప్రేమ్,నిరుపమ్(Nirupam)కీ ఫోన్ చేసి రమ్మని చెబుతాడు. మరొకవైపు నిరుపమ్,శోభ కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు.
అప్పుడు శోభ (shobha)నీకేం బాధలు ఉంటాయి నిరుపమ్ అని అనగా వెంటనే నిరుపమ్, హిమ కు క్యాన్సరే లేదు అన్న విషయాన్ని చెప్పడంతో శోభ షాక్ అవుతుంది. అప్పుడు నిరుపమ్ ని ఎలా అయినా సొంతం చేసుకోవాలి అని హిమ మీద నెగటివ్ గా మాట్లాడుతుంది. అప్పుడు ప్రేమ్(pream),నిరుపమ్ కీ ఫోన్ చేసి వెంటనే సౌందర్య ఇంటికి రమ్మని చెబుతాడు. మరొకవైపు సౌందర్య,ఆనంద్ రావ్ లు సౌర్య, హిమ లను ఎలా అయినా కలపాలి అని ప్లాన్ లు వేస్తూ ఉంటారు.
మరొకవైపు శోభ, స్వప్న(swapna) ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు శోభ,నిరుపమ్ గురించి ఆలోచిస్తూ స్వప్నని కూడా టెన్షన్ పెడుతూ ఉంటుంది. అప్పుడు శోభ ఆంటీ మీరు నాకు మాట ఇచ్చారు ఆ మాట నేను నిలబెట్టుకోకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు నిరుపమ్(Nirupam) ,సౌందర్య ఇంటికి వచ్చి ఆనంద్ రావుకి బాగాలేదు అనడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు.
అప్పుడు నిరుపమ్,ఆనందరావు(anand rao)హెల్త్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే సౌర్య కోసం ఆటో టైర్ తీసుకుని రావడంతో సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌందర్య ఆనందరావు ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఒకరి మొఖాలు కూడా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనంద్ రావుని హెల్త్ చెక్ చేయడానికి లోపలికి వెళ్ళగా,బయట ప్రేమ్ సౌందర్య,హిమ(hima),సౌర్యల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత సౌర్య(sourya) ఆటో రెడీ అవ్వడంతో సౌర్య బయటకు వెళ్తూ ఉండగా సౌందర్య వెళ్లొద్దు అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, సౌర్య తో మాట్లాడుతూ నన్ను హిమ(hima)ను ఒకటి చెయ్ అని అనడంతో సౌర్య షాక్ అవుతుంది. ఇంతలోనే అక్కడికి హిమ వచ్చి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఎప్పటినుంచి ఇదే విషయం చెబుతున్నాను అనడంతో శౌర్య వాళ్ళిద్దర్నీ అపార్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే సౌర్య,పసుపు తాడు తీసుకుని వచ్చి మెడలో కట్టండి అని అంటుంది.