- Home
- Entertainment
- Karthika Deepam: సౌందర్య కూతురు రాక్షసత్వం.. జ్వాలపై కోపంతో ఆటోను తగలబెట్టిన స్వప్న!
Karthika Deepam: సౌందర్య కూతురు రాక్షసత్వం.. జ్వాలపై కోపంతో ఆటోను తగలబెట్టిన స్వప్న!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

జ్వాల (Jwala)తో సహా ఫ్యామిలీ మొత్తం జోకులు వేసుకుంటూ ఎవరు ఊహల్లో వాళ్ళు ఉంటారు. కానీ స్వప్న అవేమి జీర్ణించుకోలేక చిరాకు పడుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ (Prem) డిజైన్ చేసిన ఫోటోను ఒక ఆమె మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేస్తుంది. దాంతో ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు.
ఇక ప్రేమ్ (Prem) దీనంతటికీ కారణం మా నాన్న మా నాన్న నాకు బాగా సపోర్ట్ చేశారు అని చెబుతాడు. దాంతో స్వప్న (Swapna) కొంత జెలసీ గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అంత కలిసి ఒక ఫోటో దిగుతారు. ఈ క్రమంలో జ్వాల స్వప్న ను సత్య పక్కన ఉంచుతుంది.
మరోవైపు ఆనంద్ (Anand) హోటల్ దగ్గర చదువుకుంటూ నాకెవరూ బంధువులు లేరు అని బాధపడుతూ ఉంటాడు. ఒక వైపు జ్వాల, ప్రేమ్ లు గిఫ్ట్ విషయంలో గొడవ పడుతూ ఉంటారు. ఇక ప్రేమ్ ఆ గిఫ్ట్ లో హిమ (Hima) ఫోటో ఉందని అందరికీ తెలిసిపోతుందని భయపడుతూ ఉంటాడు.
ఆ తరువాత నిరూపమ్ (Nirupam) జ్వాలకు ఫ్యామిలీ ఫోటో దిగేలా చేసినందుకు థాంక్స్ చెబుతాడు. ఇక దాంతో స్వప్న ఎలాగైనా తన కొడుకులకు జ్వాలను దూరం పెట్టాలనే ఆలోచనలో ఉంటుంది. ఇక సత్య నువ్వు బలవంతంగా నన్ను తీసుకొని వచ్చి మంచి పని చేసావు అని జ్వాల (Jwala) తో అంటాడు.
ఆ క్రమంలో స్వప్న (Swapna) ఎవరో అనామకురాలు వండి పెడితే తింటున్నారు అని అంటుంది. దాంతో జ్వాల నువ్ వండి పెడితే వాళ్ళకి ఈ కర్మ ఉండదు కదా అని అంటుంది. ఆ మాటకి స్వప్న జ్వాలను చెంపమీద కొట్టబోతుంది. ఈలోపు నిరూపమ్ (Nirupam) కొట్టకుండా తన చేతిని పట్టుకొని అపుతుంది.
ఇక రేపటి భాగంలో జ్వాల (Jwala) ఊరికే ఆటో అంటున్నావు. ఆటో అంటే అంత చులగనగా ఉందా అని అంటుంది. దాంతో స్వప్న (Swapna) నాకు కోపం రానివ్వకు అని అంటుంది. ఇక కోపం వస్తే ఎం చేస్తావ్ అన్నట్లు జ్వాలా మాట్లాడుతుంది. ఇక స్వప్న కోపంతో జ్వాలా ఆటోని తగల పెడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.